twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Corona Effect: నెట్‌ఫ్లిక్స్ సంచలన నిర్ణయం.. అదే దారిలో..

    |

    కరోనావైరస్ సృష్టిస్తున్న ప్రకంపనలతో అన్ని రంగాలు కుదేల్ అవుతున్నాయి. ప్రాణాంతక వైరస్ పలు రకాలుగా ప్రభావం చూపడంతో కొన్ని సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలపై నియంత్రణ, కోతలు విధించుకోవడం కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సర్వీస్ సంస్థ నెట్‌ఫ్లిక్స్, సోషల్ మీడియా దిగ్దజం ఫేస్‌బుక్ సంచలన నిర్ణయాలు ప్రకటించాయి. అవేమిటంటే..

     ఇంటర్నెట్ సేవల మందగింపు

    ఇంటర్నెట్ సేవల మందగింపు

    కరోనావైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిపోయింది. పలుదేశాల్లో ఇంటర్నెట్ సేవలు, ప్రసారాలు మందగించాయి. దీంతో ఇంటర్నెట్ సేవల వినియోగం కష్టంగా మారింది. మెరుగైన ఇంటర్నెట్ సేవల కోసం పలు సంస్థలు తమ డేటా సేవలపై కోత పెడుతున్నాయి.

     ఇంటర్నెట్ వినియోగం పెరిగి..

    ఇంటర్నెట్ వినియోగం పెరిగి..

    ఇంటర్నెట్ సేవలను మరింత బలపేతం చేయడానికి నెట్‌ఫ్లిక్స్, ఫేస్‌బుక్ కంపెనీలు తమ డేటా సర్వీసుల ఉపయోగాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించాయి. ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. డేటా సేవల్లో కోత పెట్టడం ద్వారా ఇంటర్నెట్ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం, తద్వారా మెరుగైన ఇంటర్నెట్ సేవలకు బాట వేయాలనే నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి.

    కీలకంగా రానున్న 30 రోజులు

    కీలకంగా రానున్న 30 రోజులు

    ప్రపంచం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో రానున్న 30 రోజులు కీలకంగా మారాయి. దీంతో భారతీయ టెలికాం నెట్‌వర్క్స్‌పై 25 శాతం ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించాలని నిర్ణయం తీసుకొన్నదని నెట్‌ఫ్లిక్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇలాంటి నిర్ణయమే యూరప్‌ దేశాల్లో కూడా అమలు చేయాలని చూస్తున్నట్టు పేర్కొన్నది. ఇంటర్నెట్ వినియోగం పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపింది.

    హెచ్‌డీ వీడియోలపై నియంత్రణ

    హెచ్‌డీ వీడియోలపై నియంత్రణ

    నెట్‌ఫ్లిక్స్ సీఈవో రీడ్ హ్యాస్టింగ్‌తో యూరోపియన్ యూనియన్ కమిషనర్ థియర్రీ బ్రెటన్‌తో ఇటీవల సంప్రదింపులు జరిపారు. ఈ సందర్భంగా ఇంటర్నెట్ ఆవశ్యకత, వినియోగం గురించి చర్చించాను. అందరికీ మెరుగైన ఇంటర్నెట్ సేవలను అందించడానికి ప్రయత్నిద్దాం. అవసరం లేని సమయంలో హెచ్‌డీ వీడియోలను ప్రసారం చేయకుండా కట్టడి తీసుకోవాలని రీడ్‌కు సూచించినట్టు తెలిపారు. అంతేకాకుండా ప్రజలను, కంపెనీలను హెడీ వీడియోలు ప్లే చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

    English summary
    Online Streaming service Netflix Inc and social media giant Facebook decided to cut the amount of data their services use to ease congested telecoms networks in India. It said, millions of people are using home internet amid a lockdown to contain the coronavirus outbreak.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X