జబర్దస్త్‌పై కరోనా ఎఫెక్ట్: కమెడియన్స్‌లో మొదలైన గుబులు.. ఇదీ మ్యాటర్!!
ప్రపంచాన్ని కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. కంటికి కనిపించని కరోనా దెబ్బకు అన్నిరంగాలు విలవిలలాడిపోతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. ఇక రోజువారి కూలీల పరిస్థితి అయితే మరీ అద్వాన్నంగా తయారవుతోంది. ఇప్పుడీ ఎఫెక్ట్ జబర్దస్త్ కమెడియన్స్‌పై పడుతున్నట్లుగా తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..

షూటింగ్స్ బంద్.. ఎక్కడ చూసినా నిర్మానుష్యం
కరోనా వేగంగా వ్యాప్తిచెందుతూ మానవాళికి ముప్పు తీసుకొస్తోందని గ్రహించిన భారత ప్రధాని మోడీ వెంటనే రియాక్ట్ అయి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 15వ తేదీ వరకు దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో సినిమా షూటింగ్స్ సహా.. అన్ని రంగాలు మూతపడి అంతటా నిర్మానుష్య పరిస్థితులు నెలకొన్నాయి.

విలవిలాడుతున్న పేదలు.. పనుల్లేక ఇబ్బందులు
ఈ నేపథ్యంలో రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు పనుల్లేక, ఆ కారణంగా చేతిలో డబ్బు లేఖ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రోజు వారి కూలీలైతే బ్రతుకు భారమై కంగారు పడుతున్నారు. సినీ ఇండస్ట్రీలోకి కార్మికులు సైతం షూటింగ్స్ లేక విలవిలాడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

బుల్లితెర పరిశ్రమకు కరోనా కష్టకాలం.. ఉపాధికి గండి
కేవలం వెండితెరపైనే కాదు బులితెర మీద కూడా ఈ కరోనా ఎఫెక్ట్ పడింది. లాక్‌డౌన్ కారణంగా పలు సీరియల్స్, రియాలిటీ షోస్ షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో బుల్లితెర పరిశ్రమకు కరోనా కష్టకాలం వచ్చేసింది. షూటింగ్స్‌పై ఎందరో ఆధారపడిన ఎందరో కార్మికుల ఉపాధికి గండి పడింది.

జబర్దస్త్‌పై కరోనా ఎఫెక్ట్..
ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్‌పై కూడా కరోనా ఎఫెక్ట్ పడిందని తెలుస్తోంది. జబర్దస్త్ కొత్త ఎపిసోడ్స్ షూటింగ్ నిలిపి వేశారనేది తాజా సమాచారం. లాక్‌డౌన్ కారణంగా ఆర్టిస్టులంతా ఇప్పటికే ఇంటికే పరిమితం కావడంతో కొత్త ఎపిసోడ్ షూటింగ్స్ తాత్కాలికంగా నిలిపివేశారని తెలుస్తోంది.

జబర్దస్త్ కమెడియన్స్ ఆవేదన!
ఈ జబర్దస్త్‌పై చాలామంది జీవితాలు ఆధారపడ్డాయి. కమెడియన్స్ మొదలుకొని టెక్నీషియన్స్ వరకు ఎందరో రోజువారీ వేతనంపై ఆధారపడి పని చేస్తుంటారు.
దీంతో ఇప్పుడు షూటింగ్స్ నిలిపివేత కారణంగా తమకు ఇబ్బందులు తప్పడం లేదని, ఈ పరిస్థితి ఇంకా ఎంతకాలం? అని ఆవేదన చెందుతున్నట్లు వాళ్లంతా ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది.
Recommended Video

ఇంకొన్ని రోజులు ఇలాంటి పరిస్థితులే ఉంటే..
ఈ కరోనా మహమ్మారి కారణంగా ఇంకొన్ని రోజులు ఇలాంటి పరిస్థితులే ఉంటే షూటింగులు జరగక తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అంటున్నారు. యాజమాన్యమే తగిన పరిష్కారం ఆలోచించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.


Click it and Unblock the Notifications











