twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్ న్యూస్.. కోర్టుకెక్కిన 'బిగ్ బాస్'

    |

    Recommended Video

    Madras High Court To Stop Bigg Boss 3 || Filmibeat Telugu

    బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ కి సంబందించిన ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 3 కోర్టులో పిటిషన్ దాఖలు కావడం జనానికి షాకిస్తోంది. మరి కొద్దిరోజుల్లోనే బిగ్ బాస్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనుకున్న ఆడియన్స్ ఆశ్చర్యపోయేలా హైకోర్టులో ఈ షోపై కేసు నమోదైంది. వివరాల్లోకి పోతే..

     బుల్లితెర వినోదాల విందు బిగ్ బాస్

    బుల్లితెర వినోదాల విందు బిగ్ బాస్

    గత రెండు సీజన్లలో బిగ్ బాస్ షో బుల్లితెర ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంది. హోస్ట్ మొదలుకొని పార్టిసిపెంట్స్ వరకు అందరూ చిన్ని తెరపై వినోదాల విందు చేశారు. ఈ రెండు సీజన్స్ విజయవంతంగా పూర్తి కావడంతో మూడో సీజన్ పై భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్. అయితే ఇంతలో కోర్టు కేసు రూపంలో వారికి ఊహించని షాక్ తగిలింది.

    బిగ్ బాస్ వెంటనే నిలిపి వేయాలంటూ

    బిగ్ బాస్ వెంటనే నిలిపి వేయాలంటూ

    బిగ్ బాస్ షోని వెంటనే నిలిపి వేయాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ షో టెలికాస్ట్ కాకుండా ఆపుతూ కోర్టు నిర్ణయం తీసుకోవాలంటూ సదరు పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అయితే ఈ పిటిషన్ ఎవరు వేశారనేది తెలియక పోయినప్పటికీ బిగ్ బాస్ షో నిలిపివేయండి అనడానికి గల కారణాలేంటో తెలిశాయి.

    షాకింగ్ రీజన్స్.. తీవ్రఅభ్యంతరం

    షాకింగ్ రీజన్స్.. తీవ్రఅభ్యంతరం

    బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తున్నారని, ఇలాంటివి పిల్లల మీద చెడు ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ షోకు అనుమతి రద్దు చేస్తూ వెంటనే బిగ్ బాస్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయాలని పిటిషన్ దారు డిమాండ్ చేస్తున్నాడు. దీనిపై మద్రాసు హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.

    మూడో సీజన్లో కూడా కమల్ హాసనే..

    మూడో సీజన్లో కూడా కమల్ హాసనే..

    తమిళ బిగ్ బాస్ షోకి గాను గత రెండు సీజన్లలో హోస్ట్ గా చేసిన కమల్ హాసనే మూడో సీజన్ లోనూ హోస్ట్‌గా చేయబోతున్నారు. మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానున్న ఈ షోపై కోర్టులో పిటిషన్ దాఖలు కావడం బుల్లితెర ఆడియన్స్‌ని షాక్‌కి గురి చేస్తోంది. గతంలో కూడా తమిళనాడులో పలు టీవీ, సినిమాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టులో పిజిషన్లు దాఖలైన సందర్భాలు కోకొల్లలు.

    English summary
    The Madras High Court has issued notices to CBFC and others on a plea seeking a direction to set up a panel to censor TV programmes and restrain 'Star Vijay' channel from broadcasting the show "Bigg Boss", hosted by Kamal Haasan without censor certificate.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X