twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6 ఒక క్యాన్సర్, హైకోర్టు భయపడింది.. సీపిఐ నారాయణ షాకింగ్ కామెంట్స్

    |

    అసాధారణ రెస్పాన్స్​తో దూసుకుపోతోంది బుల్లితెర రియాలిటీ షో బిగ్​బాస్​. ఇప్పటి వరకు ఐదు సీజన్లను ఎంతో విజయవంతంగా పూర్తి చేసి ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ షో ప్రస్తుతం ఆరో సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ కూడా మరి కొన్ని రోజుల్లో పూర్తి కానుంది. అయితే బిగ్ బాస్ రియాలిటీ షోకి ఆదరణ ఎంతుందో.. విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ షోపై ఇదివరకు చాలా మంది ప్రముఖులు విమర్శలు గుప్పించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వారు సీపీఐ నేత నారాయణ. ఈ షో ప్రతి సీజన్​ సమయంలో ఆయన తనదైన స్టైల్​లో ఏకిపారేస్తాడు. బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ప్రారంభంలో విమర్శలు గుప్పించిన నారాయణ తాజాగా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు.

    తీవ్ర స్థాయిలో విమర్శలు..

    తీవ్ర స్థాయిలో విమర్శలు..

    తెలుగు బుల్లితెర చరిత్రలోనే సూపర్బ్​ రెస్పాన్స్​తో దూసుకుపోతోంది బిగ్​బాస్ రియాలిటీ షో. ప్రతి సీజన్​ను మరింత జోష్​తో, మరింత ఆదరణతో ముందుకు సాగుతోంది. ఈ ఆదరణ, ఈ మన్ననలు ఒకవైపు మాత్రమే. మరోవైపు బిగ్​బాస్ షో ఒక కాంట్రవర్సీ షో. ఇదొక బూతు దందా అని పలువురు ఇప్పటికీ చాలా సార్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బిగ్ బాస్ తెలుగు 6 స్టార్టింగ్ లో సింగర్ స్మిత కూడా పలు కామెంట్స్ చేశారు.

    పలువురికి పాపులారిటీ..

    పలువురికి పాపులారిటీ..

    అయితే బిగ్​బాస్​ షో కొంతమందికి సినిమా అవకాశాలు, పాపులారిటీ, ఐడెంటిటీ తెచ్చిపెట్టి అద్భుతమైన అవకాశం. కానీ ఇదే బిగ్​బాస్ రియాలిటీ కొందరికి బ్రోతల్​ హౌజ్​ల కనిపిస్తుంది. వారు పెట్టే టాస్క్​లు, కాన్సెప్ట్​ పాశ్చాత్య సంస్కృతికి మించి దారుణంగా ఉంటోందని తీవ్ర స్థాయిలో మండిపడిన సందర్భాలున్నాయి. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి సీపీఐ నేత నారాయణ.

     బ్యాన్ చేయాలని డిమాండ్..

    బ్యాన్ చేయాలని డిమాండ్..

    బిగ్ బాస్ అనే రియాలిటీ షోపై సీపీఐ నారాయణ ఎప్పటి నుంచో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ షో ప్రతి సీజన్ కు తనదైన శైలీలో కామెంట్స్ చేస్తుంటారు. అలాగే ఈ షో ప్రారంభమైన మొదట్లో ఇదొక బూతు షో అని, నాగార్జున వంటి స్టార్ హీరో చేయాల్సిన పని కాదని, ఈ షోని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ప్రారంభంలో కూడా ఇలాగేఇదొక బ్రోతల్ హౌజ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

    మరోసారి విమర్శలు..

    మరోసారి విమర్శలు..

    ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ రియాలిటీ షోపై షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు స్పందించారు. "తెలంగాణ హైకోర్టు బిగ్ బాస్ కు సంబంధించి ఏమి చేయలేకపోయింది. పోలీస్ స్టేషన్ కు వెళ్లాను. కింది కోర్టు నుంచి హైకోర్టు వరకు వెళ్లాను. కానీ వాళ్లు ఆ కేసును టేకప్ చేయలేదు. ఏపీ హైకోర్టు మాత్రం టేకప్ చేసింది. నాగార్జునకు నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలిసింది" అని నారాయణ తెలిపారు.

    బిగ్ బాస్ ఒక క్యాన్సర్..

    బిగ్ బాస్ ఒక క్యాన్సర్..

    ఇంకా సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. "ఏమైనా కానీ బిగ్ బాస్ పై పిటీషన్ ను ఏపీ హైకోర్టు టేకప్ చేసింది. తెలంగాణ కోర్టు భయపడినా.. ఆంధ్ర ప్రదేశ్ కోర్టు పిటీషన్ స్వీకరించినందుకు అభినందిస్తున్నాను. బిగ్ బాస్ సాంఘిక దురాచారంతో కూడుకున్న షో. అదొక క్యాన్సర్ లాంటిది. దాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందని మరొక్కసారి చెబుతున్నాను" అని విజయవాడ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

    సినీ నిర్మాత పిటీషన్..

    సినీ నిర్మాత పిటీషన్..

    ఇక ఇదిలా ఉంటే ఈ బిగ్ బాస్ షోని నిలిపివేయాలంటూ సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ రియాలిటీ షోలో అశ్లీలత ఎక్కువైందని, కుటుంబంతో కలిసి చూడాలంటే ఇబ్బందిగా ఉందని న్యాయవాది కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేస్తూ ఆరోపించారు. ఈ షోలో అశ్లీలత ఎక్కువైన కారణంగా, చట్ట ప్రకారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ప్రసారం చేయాలని కోరారు.

    English summary
    Popular Political Leader CPI Narayana Shocking Comments On Bigg Boss In Vijayawada Press Meet And Says It Is A Cancer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X