Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌ సూసైడ్ చేసుకుంటే... ఎవరు బాధ్యత వహిస్తారు?

బిగ్ బాస్ తెలుగు 7 పూర్తి అయింది కానీ.. వివాదాలు మాత్రం ముగియడం లేదు. దీనికి కారణం కామన్ మ్యాన్ గా ఎంటర్ అయి కప్ గెలుచుకున్న పల్లవి ప్రశాంత్. ఇక అతని మీద పోలీసులు కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్ ను అరెస్టు చేశారు. ఇక ఇదిలా ఉంటే పొలిటికల్ లీడర్ సీపీఐ నారాయణ.. ప్రశాంత్ విషయంపై సంచలన వీడియో రిలీజ్ చేశాడు. ప్రశాంత్ సూసైడ్ చేసుకుంటే ఎవరు బాధ్యలు అంటూ నిలదీశారు. ఆ వివరాల్లోకి వెళితే...

బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే పూర్తయ్యాక.. పల్లవి ప్రశాంత్ ర్యాలీగా బయలు దేరడం.. అక్కడ ఫ్యాన్స్ అత్య్సూహాం చూపించారు. పల్లవి ప్రశాంత్... బయటకు వెళ్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పోలీసులు చెప్పిన వినకుండా వెళ్లారు. రైతు బిడ్డను ఆపడం కరెక్ట్ కాదంటూ.. రెచ్చిపోయి మరీ వెళ్లిపోయాడు. ఇక ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్న కొంత మంది కంటెస్టెంట్స్ మీద దాడికి పాల్పడ్డారు.

CPI Narayana Responds on Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth Case Issue

అంతే కాదు వారి కార్లను ధ్వంసం చేశారు. పక్కనే ఉన్న టీఎస్ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు. కంటెస్టెంట్స్ దాడిప బిగ్ బాస్ మేకర్స్ కూడా ఎలాంటి రెస్పాన్స్ తీసుకోలేదు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్, పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇక తాజాగా సీపీఐ నారాయణ కూడా బిగ్ బాస్ నిర్వాహకులపై మండిపడ్డారు. పల్లవి ప్రశాంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

CPI Narayana Responds on Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth Case Issue

ఇక ఆ వీడియోలో సీపీఐ నారాయణ మాట్లాడుతూ... బిగ్ బాస్‌ షోలో పాల్గొన్న వారిపై పోలీసులు ప్రతాపం చూపించడం కాదు... బిగ్ బాస్ నిర్వాహకులు ఎవరు.. యాంకర్ ఎవరు.. వాళ్లు కదా రెచ్చగొట్టిందంటూ మండిపడ్డారు. బిగ్ బాస్ నిర్వాహకుల పైనా, యాంకర్ అయిన నాగార్జునపైన కదా కేసు పెట్టాల్సిందంటూ వెల్లడించారు. ఇక బిగ్ బాస్ లో పాల్గొన్న రైతు బిడ్డను హింసించడం, కేసు పెట్టడం ఎందుకు అంటూ ఫైర్ అయ్యారు.

CPI Narayana Responds on Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth Case Issue

ఇక ఈ పరిణామాల నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ సూసైడ్ చేసుకుంటే ఎవరు బాధ్యులు... అంటూ వెల్లడించారు. అతనిపై కేసులు ఎత్తేసి.. పబ్లిక్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతే కాదు.. బిగ్ బాస్ నిర్వహకులపైన, నాగార్జున పైన కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. పల్లవి ప్రశాంత్ కు పొరపాటున ఏమైనా జరిగినా.. పోలీసులే బాధ్యత వహించాల్సిందని తెలిపారు. ప్రస్తుతం సీపీఐ నారాయణ రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

CPI Narayana Responds on Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth Case Issue

ఇక పల్లవి ప్రశాంత్ ను గజ్వేల్‌ మండలం కొల్గూరులోని అతని నివాసంలో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన గొడవ కేసులో అతన్ని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. పల్లవి ప్రశాంత్‌పై 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయగా ఇప్పుడు అదే కేసుల నేపథ్యంలో ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడు రవిరాజులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి ఏం జరగనుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X