Bigg Boss Telugu 6: బిగ్ బాస్ షో ఒక బ్రోతల్ హౌస్.. డబ్బు కోసమే ఇలా.. సీపీఐ నారాయణ కామెంట్స్
బిగ్గెస్ట్ కాంట్రవర్సీస్ షో గా కొనసాగుతున్న బిగ్ బాస్ షో 6వ సీజన్ ఆదివారం రోజు గ్రాండ్ గా మొదలైన విషయం తెలిసిందే. నాగార్జున హోస్టింగ్ తో మొదలైన ఈ బిగ్ బాస్ షో ఈసారి ఎలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది అనేది కూడా హాట్ టాపిక్ గా మారుతొంది. అయితే ఈ క్రమంలో పలువురు ప్రముఖులు మరోసారి బిగ్ బాస్ షో పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇక మరోసారి సిపిఐ కీలక నేత నారాయణ బిగ్ బాస్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదొక బ్రోతల్ హౌస్ అంటూ సమాజానికి ఉపయోగపడనిది అని విమర్శలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇదొక దుష్టశక్తి
సిపిఐ నారాయణ మాట్లాడుతూ.. బిగ్ బాస్ 6వ సీజన్ మొదలైంది. మొదటినుంచి కూడా ఏదో అట్టహాసంగా కొనసాగిస్తామని అనుకుంటున్నారు. నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. బిగ్ బాస్ అనేది ఈ సమాజానికి దుష్టశక్తి లాంటిది. సమాజానికి ఎలాంటి ఉపయోగం లేనిది. సంబంధం లేని యువతీ యువకులను ఒక ఇంట్లోకి తీసుకువచ్చి దీంట్లోనే కల్చర్ ని అలాగే సంస్కృతిని నేర్చుకోండి అంటున్నారు. అలాగే ఎదుటి వాళ్లతో కూడా ఎలా ఉండాలో ఇక్కడ నేర్చుకోవాలని అంటున్నారు. కానీ అలాంటి మంచి మెస్సేజ్ కనిపించడం లేదు.. అని అన్నారు.

యువత శక్తిని నిర్వీర్యం
మన భారతదేశ సంస్కృతి చాలా గొప్పది. ఇది యూరోపియన్ కంట్రీస్ కల్చర్ కాదు. అలాంటిది బిగ్ బాస్ హౌస్ లో సంబంధం లేకుండా అలాంటి కల్చర్ ను చూపించడం అనేది కరెక్ట్ కాదు. యువత సమయాన్ని వాళ్ళు వృధా చేస్తున్నారు. సమాజానికి ఎంతో ఉపయోగపడే యువత ఒక నేషనల్ ప్రాపర్టీ. అలాంటి నేషనల్ ప్రాపర్టీని ఈ బిగ్ బాస్ చెడుదారులలో కొనసాగిస్తోంది. బిగ్ బాస్ లోకి కొంతమందిని పంపిస్తున్నారు. ఇక దాన్ని కోట్లాదిమంది చూస్తున్నారు. ఒక విధంగా లక్షలాదిమంది యువత శక్తిని నిర్వీర్యం చేస్తున్నట్లే అవుతోంది.

బిగ్ బాస్ ఒక బ్రోతల్ హౌస్
బిగ్ బాస్ వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు. ఇది ఒక సామాజిక రుగ్మత. అందుకే నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. చెడు సంప్రదాయం మాత్రమే దీనివల్ల కొనసాగుతోంది కానీ ఎలాంటి మెసేజ్ అయితే రావడం లేదు. వందరోజుల పాటు యువతీ యువకులు మేము గొప్పగా ఉన్నాము అంటూ చెప్పడం ఎవరు నమ్మలేరు. తాడి చెట్టు కింద పాలు తాగుతున్నాము అంటే ఎవరు నమ్మరు. అలాగే బ్రోతల్ హౌస్ నుంచి బయటికి వచ్చేవారిని చూస్తే ఏమంటారు? అలాగే మీ కొంపను చూస్తే ఏమంటారు? ఇది కేవలం సమాజానికి ఉపయోగపడని ఒక దరిద్రపు షో.. అని అన్నారు.

నాగార్జున డబ్బు సంపాదిస్తున్నారు
బిగ్ బాస్ అనేది రియాలిటీ షో కాదు రియాలిటీ బూతు షో. నిజానికి దీన్ని జనాలు ఎలా చూస్తున్నారో అర్థం కావడం లేదు. చూసేవాళ్ళు తెలివి తక్కువగా ఉన్నారా? ఆడే వాళ్ళు తెలివి తక్కువగా ఉన్నారా?. ఒక విధంగా బిగ్ బాస్ నిర్వాహకులు ఈ విధంగా క్యాష్ చేసుకుంటున్నారు అనే అనిపిస్తుంది. ఇది కేవలం అన్యాయం మాత్రమే. నాగార్జున లాంటి వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళ నాన్నకు మంచి పేరుంది. అలాంటివాళ్లు ఇలాంటి ముదానష్టపు పనులు చేసి డబ్బు ఎలా సంపాదిస్తున్నారు? దీన్ని నిర్వీర్యం చేయాల్సిన బాధ్యత ఉంది. బిగ్ బాస్ అనేది సమాజానికి ఉపయోగపడని షోగానే మేము చూస్తున్నాము.. అంటూ సిపిఐ నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


Click it and Unblock the Notifications











