Bigg Boss: బిగ్ బాస్ అనేది ఓ క్రైమ్.. డబ్బులకు కక్కూర్తి పడే నాగార్జున హోస్టుగా..?

బుల్లితెరపై ఎన్నో రోజులుగా అలరించిన బిగ్ బాస్.. ఎట్టకేలకు ఏడో సీజన్ కూడా ముగిసింది. కానీ గొడవలు మాత్రం ఇంకా ముగియలేదు. టైటిల్ విన్నర్ ప్రశాంత్ ఫ్యాన్స్ రచ్చ అంతా ఇంతా కాదు. ఇక తాజాగా ఈ షోపై మరోసారి సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి సీజన్ కి ఆయన షో మీద, నాగార్జున మీద సీరియస్ కామెంట్స్ చేస్తుంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఈ షోను మరోసాపి బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ అంటేనే వివాదాల సుడిగుండమనే విషయం తెలిసిందే. హౌస్‌లో కంటెస్టెంట్స్ ఆటలు, పాటలు... వాళ్లు ఏం చేసిన వివాదాలకు దారితీస్తుంటాయి. ఆ సంగతి అలా ఉంటే.. వాళ్ల అభిమాన సంఘాల రచ్చ మాత్రం మరోలెవెల్ లో ఉంటుంది. సోషల్ మీడియాలో వాళ్లు చేసే అతి అరాచకంగా ఉంటుంది. తాజాగా బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‌ క్లైమాక్స్‌ లోనూ అదే జరిగింది. హౌస్‌ లో ప్లేయర్లు కుస్తీకి దిగినట్టే.. రియల్‌ లైఫ్‌ లో అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించారు.

 CPI Narayana Sensational Comments on Bigg Boss Show And Nagarjuna Full Details Here

105 రోజుల పాటు సాగిన ఈ రియాల్టీ షోలో విజేతగా పల్లవి ప్రశాంత్‌ నిలిచాడు. ఇక రన్నరప్‌గా అమర్‌దీప్‌ నిలవగా... ఇక్కడే రాద్ధాంతం మొదలైందని తెలుస్తోంది ప్రశాంత్‌ అమర్‌ దీప్‌ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. ఫైటింగ్ కు దిగారు. టైటిల్ తమకు దక్కాల్సిందని అమర్‌ దీప్‌ అభిమానులు గొడవకు దిగగా.. సత్తా ఉన్న వాడికే టైటిల్ దక్కిందని ప్రశాంత్ ఫ్యాన్స్‌ రచ్చ చేశారు. ఇదికాస్త పెద్ద గొడవకు కారణం అయింది.

అన్నపూర్ణ స్టూడియో సమీపంలో పార్టీసిపెంట్‌ల కార్లు, TSRTCకి చెందిన బస్సులపై దాడికి దిగారు అభిమానులు. ఇక ఒకరిని ఒకరు కొట్టుకుంటూ.. విధ్వంసం సృష్టించారనే విషయం తెలిసిందే. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఆర్టీసీ అధికారులు సైతం కంప్లైంట్ చేశారు. దీంతో పల్లవి ప్రశాంత్‌ తో పాటు ఆయన ఫ్యాన్స్‌ పై కేసులు ఫైల్ చేశారు పోలీసులు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.

 CPI Narayana Sensational Comments on Bigg Boss Show And Nagarjuna Full Details Here

ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే అనంతరం జరిగిన సంఘటనలపై సీపీఐ నేత నారాయణ ఫైర్ అవుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అసలు బిగ్‌ బాస్‌ షోని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. వినోదాన్ని ఆస్వాదించకుండా.. అభిమానం పేరుతో ఏమైనా చేయొచ్చా అంటూ మండిపడ్డారు. హద్దులు మీరి బరితెగిస్తే చూస్తూ ఉండిపోవాలా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తుల నష్టం దాకా వెళ్లారంటే వీళ్లని ఏమనాలని నిలదీశారు.

నేను సజ్జనార్ ను సూటిగా అడుగుతున్నా మీరు కమిషనర్ గా ఉన్నప్పుడు నేనే స్వయంగా వచ్చి ఈ బిగ్ బాస్ అనేది ఒక క్రైమ్, దాని మీద యాక్షన్ తీసుకోండని అడిగాను అంటూ అప్పటి విషయాలను గుర్తు చేశారు. మూడ్రోజులు తర్వాత నేను చేయలేను కోర్టుకు పొమ్మన్నారని తెలిపారు. కింది కోర్టుకు పోతే కొట్టేసి పైకోర్టుకు వెళ్ళమన్నారు.. పోలీసులు డిపార్ట్మెంట్ భయపడి, కోర్టులు భయపడి, ఏ బిగ్ బాస్ అనేది అంత ఆదర్శమైనదా? దానిలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయా అంటూ మండిపడ్డారు.

 CPI Narayana Sensational Comments on Bigg Boss Show And Nagarjuna Full Details Here

కేవలం డబ్బుల కోసం కక్కుర్తి పడి నాగార్జున లాంటి వాళ్లు యాంకర్ గా చేస్తున్నారని వెల్లడించారు. ఇప్పుడు ఒక రైతు బిడ్డను తీసుకొచ్చి అతనికి రూ.40 లక్షల ప్రైజ్ మనీ ఇచ్చి... పట్టణాల్లో వాళ్ళు చూస్తున్నారు కదా అని ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వారిని కూడా అట్రాక్ట్ చేసేలా రైతు బిడ్డను తీసుకొచ్చి బయట కొట్లాట పెట్టారు. దీనికి అంతా కారణం బిగ్ బాస్ చేసిన నాటకం, అసలు ఈ బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలి అంటూ సీపీఐ నారాయణ మండిపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X