బిగ్ బాస్, నాగార్జునపై నారాయణ సంచలన వ్యాఖ్యలు: మీ వాళ్ల ఫొటోలు పెడతావా అంటూ దారుణంగా!

దేశంలోని ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్న తెలుగులోనే భారీ స్థాయిలో పాపులర్ అయింది బిగ్ బాస్ షో. ఈ కారణంగానే వరుసగా నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అంతేకాదు, ఎన్నో రికార్డులను క్రియేట్ చేసి సత్తా చాటింది. ఇలా మాత్రమే కాదు.. ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులను బిగ్ సెలెబ్రిటీలను చేసిందీ షో. ఇలాంటి పరిస్థితుల్లో సీపీఐ జాతీయ నాయకులు నారాయణ బిగ్ బాస్ షోపై, హోస్ట్ నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, కుటుంబ సభ్యులనూ ఇందులోకి తీసుకొచ్చి మరీ వ్యాఖ్యానించారు. ఆ వివరాలు మీకోసం!

గ్రాండ్‌గా ఓపెనింగ్... గ్రాండ్‌గా ముగింపు

గ్రాండ్‌గా ఓపెనింగ్... గ్రాండ్‌గా ముగింపు

బిగ్ బాస్ నాలుగో సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఎంతో సందడిగా సాగిన ప్రారంభ ఎపిసోడ్‌లో పదహారు మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. ఈ ఎపిసోడ్‌కు రికార్డు స్థాయిలో రేటింగ్ వచ్చింది. ఇక, 105 రోజుల అనంతరం అంటే గత ఆదివారం ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే జరిగింది. చిరంజీవి చీఫ్ గెస్టుగా వచ్చిన ఈ ఎపిసోడ్ కూడా సూపర్ సక్సెస్ అయింది.

విన్నర్.. రన్నర్.. బిగ్ బాస్‌లో తొలిసారి

విన్నర్.. రన్నర్.. బిగ్ బాస్‌లో తొలిసారి

వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో సహా ఈ సీజన్‌లోకి 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వీళ్లలో టైటిల్ ఫేవరెట్లుగా ఉన్న కొందరు కంటెస్టెంట్లు మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి అభిజీత్ విన్నర్ అవుతాడని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగానే అతడే విజేత అయ్యాడు. అఖిల్ రన్నర్‌గా నిలిచాడు. సోహెల్ రూ. 25 లక్షల ప్రైజ్ మనీ తీసుకుని రికార్డు సాధించాడు.

బిగ్ బాస్‌పై ఈ సారి ఇలాంటి విమర్శలు

బిగ్ బాస్‌పై ఈ సారి ఇలాంటి విమర్శలు

గత బిగ్ బాస్ సీజన్లలో షో జరుగుతున్న తీరుపై ఎక్కువగా విమర్శలు వచ్చాయి. ఇందులో అసభ్యకరమై సన్నివేశాలు ఉన్నాయని, ఆడవాళ్లను కించపరిచేలా డిజైన్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు, ఒకానొక దశలో షోలో కాస్టింగ్ కౌచ్ కూడా ఉందని పలువురు కంప్లైంట్ చేశారు. ఆ సమయంలో తెలుగు బిగ్ బాస్ షో.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

నాలుగో సీజన్ ఫినాలే విజయవంతంగా పూర్తయిందన్న ఆనందంలో ఉన్న బిగ్ బాస్ యూనిట్‌కు షాక్ తగిలింది. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ తాజాగా ఈ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. షో జరుగుతోన్న తీరు త‌ప్ప‌న్న ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నానన్న ఆయన.. దాని మీద చ‌ర్య‌లు తీసుకోమ‌ని పోలీసుల‌ను కోరినా ప‌ట్టించుకోవ‌ట్లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

నాగార్జున చేసిన పనిని తప్పుబట్టారు

నాగార్జున చేసిన పనిని తప్పుబట్టారు

ఆరంభ ఎపిసోడ్‌లో అభిజీత్‌కు ముగ్గురు ఫొటోలు చూపించి ఓ గేమ్ ఆడించిన విషయం తెలిసిందే. దానిని ప్రస్తావిస్తూ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘బిగ్‌బాస్‌లో ముగ్గురు అమ్మాయిల‌ ఫోటోలు పెట్టి వీరిలో ఎవ‌రిని కిస్ చేస్తావు? ఎవ‌రితో డేటింగ్ చేస్తావు? ఎవరిని పెళ్ళి చేసుకుంటావు? అని ఓ యువ‌కుడిని నాగార్జున అడ‌గడం దారుణ‌ం' అని ఆయన వ్యాఖ్యానించారు.

వాళ్ల ఫొటోలు పెడతావా అంటూ కామెంట్

వాళ్ల ఫొటోలు పెడతావా అంటూ కామెంట్

అభిజీత్‌తో గేమ్ ఆడించడాన్ని తప్పుబట్టిన నారాయణ.. మీడియా సమావేశంలో హోస్ట్ అక్కినేని నాగార్జునకు ఊహించని ప్రశ్న వేశారాయన. ‘నాగార్జున త‌న ఇంట్లోని మ‌హిళా న‌టుల ఫొటోలు పెట్టి ఇలా అడ‌ుగుతాడా? ఇన్నేళ్లూ పద్ధతిగా ఉన్న ఆయన ఈ షో కోసం ఇప్పుడెందుకిలా చేస్తున్నాడు?' అంటూ ఫైర్ అయ్యారు. నారాయణ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X