‘ఆమె’ కారణంగా అడ్డంగా బుక్కైన యాంకర్ రవి.. ఇక నమ్మలేమంటూ చేతులెత్తిసిన నాగబాబు!
తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం ఉన్న స్టార్ యాంకర్లలో రవి ఒకడు. లేడీ యాంకర్లు గ్లామర్‌తో హవా చూపిస్తున్న సమయంలో అద్భుతమైన టాలెంట్‌తో చాలా కాలంగా నిలదొక్కుకోగలిగాడతను. ఈ క్రమంలోనే ఎన్నో షోలను హోస్ట్ చేశాడు. కేవలం టీవీ షోలు మాత్రమే కాదు... సినిమా ఫంక్షన్లు, తారలతో ఇంటర్వ్యూలు ఇలా చేతి నిండా ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అదే సమయంలో తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అతడు ఓ మహిళను మోసం చేసినట్లు బుక్ చేశారు కొందరు ఆకతాయిలు. ఆ సంగతులేంటో మీరూ చూడండి.!

ఎన్నో షోలు... అది మాత్రం చాలా ప్రత్యేకం
యాంకర్ రవి... తన కెరీర్‌లో పలు ఛానెళ్లలో ఎన్నో షోలను హోస్ట్ చేశాడు. వాటిలో చాలా వరకు విజయవంతంగా ప్రసారం అయినవే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమైన ‘పటాస్' ప్రత్యేకమనే చెప్పాలి. స్టాండప్ కామెడీ షోగా పరిచమయైన ఇది అతడికి ఎంతో పేరును తెచ్చి పెట్టింది. అదే సమయంలో యూత్‌లో అతడి ఫాలోయింగ్‌ను అమాంతం పెంచేసింది.

అదే మైనస్ అయింది... రవిపై విమర్శలు
‘పటాస్' వల్ల రవికి ఎంత మంది పేరు, ప్రఖ్యాతలు వచ్చాయో... అంతే స్థాయిలో విమర్శలు కూడా చెలరేగాయి. ఇందులో మరో యాంకర్ అయిన శ్రీముఖితో అతడు ప్రవర్తిస్తున్న తీరు.. వాడుతున్న భాష కారణంగానే ఈ పరిస్థితి ఎదురైంది. దీంతో ఏకంగా ఈ షోనే నిషేదించాలని చాలా మంది డిమాండ్ చేశారు. ఆ సమయంలో రవి వాళ్లందరికీ తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చాడు.

పటాస్‌కు గుడ్‌బై... అదిరిపోయేలా ఎంట్రీ
తనకు మంచి పేరు తెచ్చి పెట్టిన ‘పటాస్' షోకు కొద్ది రోజుల క్రితం యాంకర్ రవి గుడ్‌బై చెప్పేశాడు. శ్రీముఖి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లినప్పటికీ... మరో యాంకర్‌తో కలిసి షోను నడిపించిన అతడు.. ఆ తర్వాత చేతులెత్తేశాడు. ఆ షోకు మాత్రమే కాదు... సదరు ఛానెల్ నుంచి సైతం బయటకు వచ్చేశాడు. అప్పుడే నాగబాబు సారథ్యంలోని ‘అదిరింది' షోలోకి ఎంట్రీ ఇచ్చాడు.

యాంకర్‌గా కంటే వివాదాలతో పాపులరిటీ
యాంకర్ రవికి వివాదాలు కొత్తేం కాదు. అతడి కెరీర్‌లో చాలా సార్లు ఈ తరహా పరిస్థితిని ఎదుర్కొన్నాడు. మరీ ముఖ్యంగా ఓ సినిమా ఫంక్షన్‌లో ఆడవాళ్లపై అతడు చేసిన కామెంట్స్ పెద్ద రాద్దాంతం అయ్యాయి. ఆ తర్వాత అతడు క్షమాపణలు కూడా చెప్పాడు. అయినప్పటికీ రవిపై మహిళా సంఘాలు గొడవలు చేయడం మాత్రం ఆగలేదు. చాలా రోజుల తర్వాత దీనికి పుల్‌స్టాప్ పడింది.

సినిమా హీరోగా మారాడు.. స్టేషన్‌కెళ్లాడు
బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని స్టార్ యాంకర్‌గా కొనసాగుతోన్న రవి... సినిమా రంగంలోకీ అడుగు పెట్టాడు. ఈ క్రమంలోనే ‘ఇది మా ప్రేమకథ' అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇది బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టడంతో నిరాశ చెందాడు. అదే సమయంలో ఈ మూవీ విషయంలో వివాదాలు తలెత్తడంతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడీ యాంకర్.
Recommended Video

మహిళను మోసం చేసి బుక్కైన యాంకర్
వరుస షోలు... ఈవెంట్లతో బిజీ బిజీగా గడుపుతున్న రవి... మరోసారి హైలైట్ అయ్యాడు. అయితే, ఈసారి అతడు యాక్టర్‌గా ఓ పని చేసి వార్తల్లోకి ఎక్కాడు. ‘అదిరింది' షోలో భాగంగా అతడు రౌడీ బాయ్స్ టీమ్ స్కిట్‌లో యాక్టింగ్ చేశాడు. ఇందులో రవి... ఓ గ్రామీణ మహిళను మోసం చేసినట్లు చూపించారు. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా వదిలింది సదరు చానెల్.
యాంకర్ రవిని నమ్మలేమన్న నాగబాబు
ఈ స్కిట్ చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న జడ్జ్ నాగబాబు సహాయం కోరుతాడు రవి. ‘ఏమోనయ్యా మేము నిన్ను నమ్మలేము. నువ్వు చేసినా చేసుండొచ్చు' అంటూ బదులిచ్చాడాయన. దీంతో అవాక్కయిపోతాడు రవి. యాదమ్మ రాజు, హరి కాంబినేషన్‌లోని టీమ్ ఈ స్కిట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసేస్తోంది.


Click it and Unblock the Notifications











