అరియానా కాస్తా అతియానా అయిపోయింది.. అలా దొరికిపోవడంతో ట్రోల్ చేసేస్తున్నారు!!
బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లు చెప్పేదాని మీద నిలబడాల్సి ఉంటుంది. చెప్పే మాటలు ఒకలా చేతలు ఒకలా ఉంటే మాత్రం ట్రోలింగ్‌కు గురి కావాల్సి వస్తుంది. తాజాగా అరియానా అలాగే నెటిజన్లకు చిక్కింది. సోషల్ మీడియాలో అభిజిత్ ఫ్యాన్స్ అరియానాను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. అసలు కథ ఏంటో తెలియాలంటే గత వారంలో జరిగిన ఓ ఎపిసోడ్‌ను గుర్తుకు తెచ్చుకోవాల్సిందే.

గతవారం కెప్టెన్సీ..
ఏడో వారం కెప్టెన్సీ టాస్క్‌లో అవినాష్ అరియానా పోటీ పడిన సంగతి తెలిసిందే. కంటెస్టెంట్లను ట్రాలీలలో తోసుకుంటూ వెళ్లాలని, ఎవరి స్టేషన్‌లో అయితే ఎక్కువ మంది ఉంటారో వారే కెప్టెన్‌గా ఎన్నికవుతారని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. అందులో అరియానా అభిజిత్‌తో పెట్టిన చర్చ అందరికీ గుర్తుండే ఉంటుంది.

అభిజిత్ అలా అనడంతో..
తాను ఏ పని చేయను అని అలా ఎవరు తనకు పని అప్పగించరో వారికే సపోర్ట్ చేస్తానని అభిజిత్ అన్నాడు. ఆ నియమాలకు కట్టుబడి అవినాష్ తన ట్రాలీలో ఎక్కించుకుని స్టేషన్‌లో దింపేశాడు. అయితే అరియానా మాత్రం అభిజిత్‌తో పెద్ద లెవెల్‌లో చర్చకు దిగింది.

అరియానా వేరే లెవెల్ యాక్టింగ్..
తన కెప్టెన్సీలో అందరూ పని చేయాలని అందరూ పని చేస్తేనే ఇళ్లు బాగుంటుందని అలాంటి ఆఫర్లు తాను ఇవ్వలేనని, అలా ఇస్తేనే వస్తానంటే మీ సపోర్ట్ వద్దని అభిజిత్‌తో అరియానా వాదించింది. అయితే అరియానా కూడా అలాంటిదేనని నిన్నటి ఎపిసోడ్‌తో తేలిపోయింది.

నిన్నటి టాస్క్‌లో..
నిన్నటి టాస్క్‌లో సోహెల్ మెహబూబ్ ఇద్దరూ కలిసి అరియానా అవినాష్‌లను బద్దకస్తుల జంటగా ట్యాగ్ ఇచ్చారు. అరియానా ఇంట్లో పని చేయదని, తన పని వేరే వాళ్ల మీదకు నెట్టేస్తుందని సోహెల్ మెహబూబ్ అసలు సంగతి చెప్పారు. అయితే బద్దకస్తుల జంటకు ఆ ట్యాగ్ పోవాలంటే ఏ పని ఇచ్చినా సరే అది చేయాల్సి ఉంటుందని తెలిపారు. అది కూడా మధ్యలోనే వదిలేద్దామని అనుకున్నారు. కానీ బిగ్ బాస్ హెచ్చరించడంతో మొత్తం గిన్నెలను కడిగారు.
నెటిజన్ల ట్రోలింగ్..
అభిజిత్‌ను గత వారంలో అలా అనడం, ఈ వారం ఇలా అరియానా గుట్టు బయటపడటంతో అందరూ ట్రోల్ చేస్తున్నారు. అప్పుడు మాట్లాడిన వీడియోను, సోహెల్ మెహబూబ్ మాట్లాడిన వీడియోలను ఎడిట్ చేసి ఒకే దగ్గరకు చేర్చి అతియానా అంటూ ట్రోల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











