హుధూద్: టీవీ స్టార్ల చారిటీ క్రికెట్ మ్యాచ్

By Bojja Kumar

హైదరాబాద్: హుధూద్ తుఫాన్ కారణం అయిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల బాధితులను ఆదుకునేందుకు సినిమా, టీవీ రంగాలకు చెందిన ప్రముఖులంతా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు టీవీ స్టార్లు హైదరాబాద్‌లో చారిటీ మ్యాచ్ నిర్వహించారు. నిధుల సేకరణలో భాగంగా ఈ చారిటీ మ్యాచ్ నిర్వహించారు.

త్వరలో టాలీవుడ్ మెగా ఈవెంట్
హుధూత్ తుఫాన్ బాధితులకు సహాయం అందించడమే లక్ష్యంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖలంతా కలిసి మెగా ఈ వెంటుకు ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ 9న నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా దాదాపు రూ. 10 కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు 13 గంటల పాటు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. ఇందుకు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోను వేదికగా ఎంచుకున్నారు. ఈ మెగా ఈ వెంటులో టాలీవుడ్ స్టార్స్ డాన్స్ ఈ వెంట్స్, కామెడీ షో, ఇతర కల్చరర్ ఫ్రొగ్రామ్స్ ఉండనున్నాయి.

Cricket match between Telugu TV stars

పరిశ్రమ మొత్తం కలిసి ప్రతిష్టాత్మకంగా చేస్తున్న కార్యక్రమం కావడంతో టాలీవుడ్‌కి చెందిన స్టార్స్ అంతా హాజరవుతారని తెలుస్తోంది. ఈ మెగా ఈవెంటుకు సౌతిండియా స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్‌‍తో ఇతర పరిశ్రమల స్టార్స్ కూడా హాజరు కాబోతున్నారు. టికెట్స్, డొనేషన్స్ రూపంలో నిధులు సమకూర్చాలని ప్లాన్ చేస్తున్నారు. ‘వి లవ్ వైజాగ్' పేరుతో ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ మెగా ఈ వెంటుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X