బిగ్ బాస్ హౌస్‍లో ముదిరిన వివాదాలు: జైల్లో వరుణ్ సందేశ్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రోజులు గడిచే కొద్దీ మరింత ఆసక్తికరంగా సాగుతోంది. ఇంటి సభ్యులకు వింత వింత టాస్కులు ఇస్తూ బిగ్ బాస్ ఈ రియాలిటీ షోను మరింత రక్తి కట్టిస్తున్నారు. స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తున్న ఇంటి సభ్యుల మధ్య ఏదో ఒక విధంగా చిచ్చు పెడుతూ వారి మధ్య గొడవలు క్రియేట్ చేస్తున్నాడు.
బుధవారం రాత్రి ప్రసారం అయ్యే షోపై ఆసక్తి పెంచేలా తాజాగా ఓ ప్రోమో విడుదలైంది. ఇందులో వరుణ్ సందేశ్‌ను జైల్లో పెట్టినట్లు చూపించారు. మరి వరుణ్ ఇలా జైలు పాలవ్వడానికి కారణం ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయం తెలియాలంటే బుధవారం రాత్రి ఎపిసోడ్ చూడాల్సిందే.

మరో వైపు భార్య భర్తలుగా ఇంట్లోకి ఎంటరైన వరుణ్ సందేశ్, వితిక మధ్య రోజులు గడిచే కొద్దీ దూరం పెరుగుతోంది. ఇద్దరూ తొలత అన్యోన్యంగా, ప్రేమగా ఉన్నప్పటికీ.... తర్వాత జరిగిన పరిణామాలు వీరి మధ్య విబేధాలకు కారణమైంది. ఓ సందర్భంలో తన భార్యను ఇంటి నుంచి పంపేయాలని వరుణ్ సందేశ్ వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనం.
ఈ సారి ఎలిమినేషన్ లిస్టులో మొత్తం 8 మంది సభ్యులు ఉన్నారు. అందులో శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్ విట్టా, వరుణ్ సందేశ్, వితికా, పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారు. ఈ 8 మందిలో ఒకరు ఈవారాంతం బయటకు వెళ్లిపోవడం కాయం. బిగ్ బాస్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇందుకోసం బిగ్ బాస్ ఎలాంటి పనులు చెప్పినా చేయడానికి మొహమాట పడటం లేదు.


Click it and Unblock the Notifications











