భారీ అందాలతో షాకిచ్చిన మంజూష.. పైట తీసేసి మరీ పరువాల ప్రదర్శన
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎలాంటి అమ్మాయిలు అయినా అప్పుడప్పుడూ అందాల ప్రదర్శన చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన సెలెబ్రిటీలు సైతం గ్లామర్ షో చేస్తూ సెన్సేషన్ అవుతున్నారు. అలాంటి వారిలో యాంకర్ మంజూష ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ భామ.. ఇప్పుడు ఫ్రీలాన్స్ హోస్టుగా సందడి చేస్తోంది. ఇలా చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇక, సోషల్ మీడియాలోనూ రచ్చ లేపుతోన్న మంజూష.. తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!
చిన్నప్పుడే.. ఆ సీరియళ్లు:'కుచ్చి కుచ్చి కూనమ్మ' అనే చిత్రంతో మంజూష చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. ఆ తర్వాత మోడల్‌గా మారి సత్తా చాటింది. అందులో తనదైన అందచందాలతో మాయ చేసిన ఈ అమ్మడు.. బుల్లితెరపైకి నటిగా అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'ఆశల పల్లకి', 'అహల్య', 'చక్రవాకం' వంటి సీరియళ్లలో కూడా నటించింది. తద్వారా సీరియల్ నటిగా పాపులర్ అయింది.

ఎన్టీఆర్ మూవీతో ఫేమస్:టీవీ రంగంలో సందడి చేస్తోన్నప్పుడే మంజూష 'ఓంకారం' అనే సినిమాతో హీరోయిన్‌గా మారింది. కానీ, ఇది పెద్దగా ప్లస్ కాలేదు. అయితే, అనంతరం జూనియర్ ఎన్టీఆర్ 'రాఖీ'లో నటించే అవకాశం అందుకుంది. ఇందులో హీరో సోదరి పాత్రను పోషించిన మంజూష అదరగొట్టేసింది. తద్వారా మంచి గుర్తింపును అందుకుంది. కానీ, ఆ తర్వాత సినిమాల్లో కంటిన్యూ కాలేదు.
యాంకర్‌గా క్రేజీ రికార్డులే:సినిమాలకు బ్రేకిచ్చిన తర్వాత మంజూష యాంకర్‌గా మారింది. ముఖ్యంగా ప్రైవేట్ ఈవెంట్లు చేస్తూ కనిపించింది. ఇందులో భాగంగానే సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ హల్చల్ చేసింది. ఇలా రికార్డు స్థాయిలో 5000కు పైగా ఇంటర్వ్యూలు, సినిమా ఫంక్షన్లను హోస్ట్ చేసింది. తద్వారా మంజూష తెలుగులో ఏకైక యాంకర్‌గా క్రేజీ రికార్డును అందుకుంది.

అక్కడ యమా బిజీగానే:దాదాపు దశాబ్ద కాలంగా వరుస పెట్టి సినిమా ఫంక్షన్లు, సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లను హోస్ట్ చేస్తూ యాంకర్ మంజూష దూసుకుపోతోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో కూడా యమా హల్చల్ చేస్తూ ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను షేర్ చేసుకుంటూ క్రేజ్‌ను పెంచుకుంటోంది.
గ్లామర్ షోతో కవ్వింపు:యాంకర్ మంజూష సోషల్ మీడియాలో క్రమం తప్పకుండా గ్లామర్ షో చేస్తూ కవ్విస్తోంది. ఇందులో భాగంగానే అందాలను ఆరబోస్తూ తీసుకున్న ఫొటోలు, వీడియోలతో తరచూ హైలైట్ అవుతోంది. మరీ ముఖ్యంగా తన ఎద, నడుము, నాభి భాగాలను చూపిస్తూ తీసుకున్న పిక్స్‌ను ఎక్కువగా వదులుతోంది. దీంతో యాంకర్ మంజూష తరచూ సెన్సేషన్ అయిపోతోంది.

శారీలో భారీ అందాలు:తాజాగా యాంకర్ మంజూష తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు ట్రాన్స్‌పరెంట్ బ్లౌజ్ వేసుకుని పైటను పక్కకు జరిపేసి ఫోజులు ఇచ్చింది. మరీ ముఖ్యంగా వీటిలో ఆమె యమా క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. దీంతో మంజూష వదిలిన ఈ పిక్స్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారాయి.

అలాంటి కామెంట్లతో:యాంకర్ మంజూష తాజాగా షేర్ చేసిన ఫొటోలపై నెటిజన్ల నాటీగా కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది ఆమె బాడీపై, వేసుకున్న చీరపై తమదైన రీతిలో అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ కొందరైతే బూతులతో కూడిన కామెంట్లను రాస్తున్నారు. తద్వారా మంజూష పేరు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











