ఇదేందయ్యా ఇది.. OTTలో రిలీజ్ కాకుండానే టీవీలోకి దగ్గుబాటి హీరో మూవీ!

ఏ సినిమా అయినా మొదట ఓటీటీలో రిలీజ్ అయ్యాకే టెలివిజన్ ప్రిమియర్ కి వస్తుంది. అయితే ఓ మూవీ మాత్రం ఓటీటీలోకి రాకముందే... టీవీలోకి వచ్చేస్తోంది. దగ్గుబాటి సురేష్ తనయుడు, రానా సోదరుడు అభిరామ్ హీరోగా నటించిన చిత్రం అహింస. ఇక ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ థియేటర్లోకి జూన్ 2న రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా టీవీల్లోకి రానుంది. ఆ వివరాల్లోకి వెళితే...

దగ్గుబాటి రానా నాయుడు ఫ్యామిలీ నుంచి మరో వారసుడు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఫ్యామిలీ నుంచి ఇప్పటికే సురేష్, వెంకటేష్ ఇండస్ట్రీల్లో స్థిరపడ్డారు. ఇక ఆయన వారసులు రానా కూడా తనకంటూ ప్రత్యేకమైన పేరును తెచ్చుకున్నారు. ఇక ఆయన వైవిధ్య సినిమాల్లో నటిస్తూ... తనకంటూ ఫ్యాన్ బేస్ ను సాధించుకున్నారు.

Daggubati Abhiram Ahimsa Movie Tv Premiere Date Locked and telecast details

ఇక ఇప్పుడు ద‌గ్గుబాటి సురేష్ త‌న‌యుడు, రానా సోద‌రుడు అభిరామ్‌ కూడా అహింస‌ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తేజ ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌ టైన‌ర్‌ గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ... ఆశించిన ఫలితం రాలేకపోయింది.

దాదాపు రెండేళ్ల‌కుపైగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమా ప‌లుమార్లు రిలీజ్ వాయిదా ప‌డుతూ చివ‌ర‌కు ఈ ఏడాది జూన్ 2న థియేట‌ర్ల‌లోకి రాగా... డిజాస్టర్ గా నిలిచింది. రొటీన్ స్టోరీ కార‌ణంగా ఫ‌స్ట్ వీకెండ్‌ లోనే థియేట‌ర్ల‌లో క‌నిపించ‌కుండాపోయింది అహింస సినిమా. దాదాపు ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన అహింస మూవీ కోటి లోపే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టగలిగింది. ఇక ఈ సినిమా నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్టాల‌ను మిగిల్చింది.

Daggubati Abhiram Ahimsa Movie Tv Premiere Date Locked and telecast details

అభిరామ్ నటనతో పాటు తేజ దర్శకత్వంపై దారుణంగా విమ‌ర్శ‌లొచ్చాయి. అయితే ఈ మూవీ ఓటీటీలోకి రాకముందే.. టీవీలోకి టెలికాస్ట్ కాబోతుంది. ఓటీటీ రిలీజ్ లేకుండానే నేరుగా ఈ మూవీ టీవీలోకి రాబోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సినిమా డిజిట‌ల్‌ రైట్స్‌ ను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిన‌ట్లు ప్ర‌చారం అయితే జరిగింది.

Daggubati Abhiram Ahimsa Movie Tv Premiere Date Locked and telecast details

కానీ ఓటీటీలో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ కాని ఈ మూవీ... తాజాగా ఈ సినిమాను జెమిని టీవీలో త్వ‌ర‌లో టెలికాస్ట్ కానుందట. ఈ విష‌యాన్ని జెమిని టీవీ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. అహింస సినిమాలో గీతికా తివారి హీరోయిన్‌గా న‌టించింది. స‌దా, ర‌జ‌త్ బేడీ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఆర్‌పీ ప‌ట్నాయ‌క్ సంగీతాన్ని అందించాడు. ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ సంస్థ ఈ మూవీని నిర్మించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X