Bigg Boss: భారీగా రెమ్యునరేషన్ .. బిగ్‌బాస్‌‌ ఆఫర్ రిజెక్ట్ చేసిన ఇద్దరు స్టార్ హీరోయిన్లు

దేశవ్యాప్తంగా బిగ్‌బాస్ సందడి మొదలైంది. ఈసారి హిందీలో సీజన్ ప్రారంభం కానుండగా తర్వాత రోజుల గ్యాప్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. బిగ్‌బాస్ హిందీ 19 సీజన్‌కు సంబంధించిన వార్తలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ‌హోస్ట్‌గా ప్రసారమవుతున్న ఈ కార్యక్రమంలో ప్లేస్ దక్కించుకోవాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. అలాంటిది ఇంతటి క్రేజ్ షోలో ఆఫర్ వస్తే ఇద్దరు స్టార్ హీరోయిన్లు వదులుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఈ హీరోయిన్లు ఎవరు? ఎందుకు ఆ ఆఫర్ వదులుకున్నారు? ఈ వివరాల్లోకి వెళితే..

మొదలైన బిగ్‌బాస్ సందడి
బిగ్‌బాస్ మొదలవ్వబోతుంటేనే సందడి మామూలుగా ఉండదు. హోస్ట్ ఎవరు? కంటెస్టెంట్స్ ఎవరు? ఎన్ని రోజులు షో నడుస్తుంది? హోస్ట్, కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ ఎంత? వివాదాలు, విమర్శలు ఇలా ఆ మూడు నెలలు సందడే సందడి. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన వాళ్లకి ప్రజల్లో ఉండే క్రేజ్ నెక్ట్స్ లెవల్. ఎంతోమంది సామాన్యులను బిగ్‌బాస్ కార్యక్రమం సెలబ్రెటీలను చేసింది. అందుకే ఈ మెగా రియాలిటీ షోలో భాగం కావాలని ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు.

Daisy Shah and Zareen Khan reject Bigg Boss Hindi 19 offer

సరికొత్తగా బిగ్‌బాస్‌
ఈసారి హిందీ బిగ్‌బాస్ ఓ నెల ముందుగానే స్ట్రీమింగ్ కానుందని బాలీవుడ్ టాక్. బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ లేకపోవడమే దానికి కారణం. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఈసారి కొత్త కొత్త కాన్సెప్ట్‌లను తీసుకొస్తున్నట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. నామినేషన్స్, కెప్టెన్సీ, సీక్రెట్ రూమ్‌తో పాటు తొలిసారిగా నలుగురు సెలబ్రెటీలు హోస్ట్‌లుగా వ్యవహరించనున్నారట. కొన్నేళ్లుగా హిందీ బిగ్‌బాస్‌కు కేరాఫ్‌గా నిలిచారు సల్మాన్ ఖాన్. సల్మాన్ అంటే బిగ్‌బాస్.. బిగ్‌బాస్ అంటే సల్మాన్ అన్నంతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈసారి కొత్త స్ట్రాటజీ ప్రకారం సల్మాన్‌తో పాటు ఫర్హాఖాన్, కరణ్ జోహార్, అనిల్ కపూర్‌లు హోస్టులుగా వ్యవహరించనున్నారట. వీకెండ్ ఎపిసోడ్స్‌ను సల్మాన్ హోస్ట్ చేసేలా.. వారం మధ్యలో మిగిలిన ముగ్గురు షోను నడిపించేలా ప్లాన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ వీరేనా?
బిగ్‌బాస్ హిందీ 19 సీజన్ కోసం కంటెస్టెంట్స్‌గా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అనితా హసనందానీ, చింకి, మింకీ, ఆశీష్ విద్యార్ధి, లత సబర్వాల్, అపూర్వ ముఖిజా, గౌరవ్ తేజా, రీమ్ షేక్, ధనశ్రీ వర్మ, పరమ్ సింగ్, భవికా శర్మ, హునార్ అలీ తదితరులు కంటెస్టెంట్స్‌గా సెలెక్ట్ అయినట్లుగా ఓ లిస్ట్ చక్కర్లు కొడుతోంది. అయితే ఇద్దరు టాప్ హీరోయిన్లను బిగ్‌బాస్ టీం సంప్రదించగా వారు ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లుగా బీటౌన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారే దైసీ షా, జరీన్ ఖాన్. ఆశ్చర్యకరంగా వీరిద్దరూ సల్మాన్ ఖాన్‌తో ఆడిపాడిన వారే కావడం విశేషం.

ఇంటిని వదల్లేం
జైహో, రేస్ 3 చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న డైసీ షా .. బిగ్‌బాస్ 19లో కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టబోతున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా స్పందించిన డైసీ షా వాటిని ఖండించింది. నేను బిగ్‌బాస్‌ను ఇప్పుడే కాదు, ఎప్పటికీ చేయనను తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఇక మరోనటి జరీన్ ఖాన్.. సల్మాన్‌తో కలిసి వీర్ సినిమా ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తనను బిగ్‌బాస్ నిర్వాహకులు సంప్రదించిన మాట నిజమేనని అంగీకరించింది. తాను ఇంట్లోనే ఉండాలనుకుంటున్నానని.. అమ్మను, ఇంటిని, వేల పనులను వదిలిపెట్టి మూడు నెలలు ఒక్కచోట ఉండలేనని జరీన్ తేల్చిచెప్పారు. అలాగే కొత్తవారితో స్నేహం కుదరడానికి టైం పడుతుందని, ఇప్పుడున్న కంఫర్ట్‌ను వదులుకుని బిగ్‌బాస్‌లో అడుగుపెట్టలేనని జరీన్ ఖాన్ అన్నారు. డైసీ షా, జరీన్‌లకు నిర్వాహకులు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినప్పటికీ వ్యక్తిగత కారణాలతో వారు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపడలేదని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X