Bigg Boss 7 Elimination: లీకైన 3వ వారం ఎలిమినేషన్.. ఆమెనే ఎందుకు పంపించేశారంటే!
ఎటువంటి పరిస్థితుల్లో ప్రసారం అయినా ప్రేక్షకుల ఆదరాభిమానాలను దక్కించుకుంటూ నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతున్నదే బిగ్ బాస్. చిత్ర విచిత్రమైన టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య కొట్లాటలు.. కోల్డ్ వార్‌లు.. ప్రేమ వ్యవహారాలు.. రొమాంటిక్ సన్నివేశాలు వంటివి చూపిస్తూ నిర్వహకులు దీనిపై ఆసక్తిని మరింతగా పెంచుతున్నారు.
దీంతో ఇది సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్ ఉల్టాపుల్టాగా సాగుతోంది. ఇక, ఇందులో మూడో వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారన్న దానిపై వచ్చిన సమాచారం మీకోసం!

క్రేజీ కంటెంట్‌తో ఏడో సీజన్: తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షోకు మించిన ఆదరణ మరే దానికి రావడం లేదన్నదన్న విషయం తెలిసిందే. అందుకే ఇది వరుసగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌ను క్రేజీ కంటెంట్‌తో ఉల్టా పుల్టాగా నడిపిస్తున్నారు. దీంతో దీనికి భారీ రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఇది మళ్లీ భారీ రేటింగ్‌ను రాబడుతోంది.
ఇద్దరు లేడీసే వెళ్లిపోయారు: ఏడో సీజన్‌లోకి శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, నటి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, నటి రతికా రోజ్, ప్రియాంక జైన్, రైతు పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమర్‌దీప్‌లు ఎంటర్ అయ్యారు. వీరి నుంచి మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా షో నుంచి ఎలిమినేట్ అయిపోయారు.
మూడో వారం నామినేట్ వీళ్లే: ఏడో సీజన్ మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ కొన్ని గొడవలతో రంజుగానే సాగింది. ఇందులో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. అందులో ప్రిన్స్ యావర్, ప్రియాంక, రతికా రోజ్, శుభశ్రీ రాయగురు, అమర్‌దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణ, దామినిలు ఉన్నారు. వాస్తవానికి తేజ నామినేటైనా సందీప్, శివాజి కలిసి తమకున్న స్పెషల్ పవర్‌తో అమర్‌ను అతడితో స్వాప్ చేశారు.
అతడికే ఓటింగ్.. సేఫ్ చేసి: మూడో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లతో సాగింది. అయితే, ఇందులో టాప్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఎవరూ ఊహించని కంటెస్టెంట్లు అత్యధిక ఓట్లు సంపాదించారు. ముఖ్యంగా గత వారం టాస్కుల్లో ఇరగదీసిన ప్రిన్స్ యావర్ ఎక్కువ ఓటింగ్‌తో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. అందుకే అతడిని శనివారం ఎపిసోడ్‌లోనే నాగార్జున సేఫ్ చేసేశాడు.
ఈ సారి దామిని ఎలిమినేట్: నిజానికి బిగ్ బాస్ షోకు సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియ అనేది చాలా సీక్రెట్‌గా జరిగే వ్యవహారమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినా ఇది ఒకరోజు ముందుగానే షూటింగ్ జరుపుకోవడంతో సమాచారం మొత్తం లీక్ అవుతోంది. ఇక, ఏడో సీజన్ 3వ వారంలో షకీలా ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్ షాక్‌లో ఉన్నారు.
ఒక్క ఎపిసోడ్‌కే వ్యతిరేకత: వాస్తవానికి నామినేషన్‌లో ఉన్న కొందరు కంటెస్టెంట్ల కంటే దామినికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ, ఈ వారం జరిగిన ఓ టాస్కులో ప్రిన్స్ యావర్ పట్ల ఆమె క్రూరంగా ప్రవర్తించడంతో ఓటింగ్ తారుమారు అయింది. నూట్రల్‌గా ఉన్న ఆడియెన్స్ యావర్‌కు ఓట్లు వేయగా.. దామినికి అలాంటి పోలింగ్ మిస్ అయింది. ఈ కారణంగానే ఆమె ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











