Bigg Boss Elimination: దామిని ఎలిమినేషన్‌తో చెత్త రికార్డు.. షో చరిత్రలో రెండోసారి మాత్రమే
తెలుగు బుల్లితెరపై దాదాపు ఏడేళ్లుగా హవాను చూపించడంతో పాటు దేశంలోనే నెంబర్ వన్ షోగా ప్రభావాన్ని చూపిస్తోంది బిగ్ బాస్. అందుకే నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తోన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా అనే సీజన్‌తో నడుపుతున్నారు. దీనికి ఆరంభం నుంచే అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా రికార్డు స్థాయి రేటింగ్ కూడా లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌తో బిగ్ బాస్ షోలో దామిని ఎలిమినేషన్‌తో ఓ చెత్త రికార్డు నమోదు అయింది. అసలేం జరిగిందో మీరే చూడండి!
ఎన్నో అంచనాల నడుమ మొదలైన బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి పద్నాలుగు మంది కంటెస్టెంట్లు మాత్రమే వచ్చారు. అందులో ఏడుగురు మగవాళ్లు, ఏడుగురు ఆడవాళ్లు ఉన్నారు. ఇందులో మొదటి వారం జరిగిన ఎలిమినేషన్‌లో కిరణ్ రాథోడ్ బయటకు వెళ్లిపోయింది. రెండో వారంలో షకీలా ఎలిమినేట్ అయింది. ఇక, గత ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో దామిని ఎవిక్ట్ అయింది.

బిగ్ బాస్ షో తెలుగులో ఇప్పటికే ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. అయితే, ఒకే సీజన్‌లో మొదటి మూడు వారాల్లో ముగ్గురూ లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో ఐదో సీజన్‌లో మొదటిసారిగా ఇలా జరిగింది. అప్పుడు ఫస్ట్ వీక్‌లో సరయు రాయ్, రెండో వారంలో ఉమ, మూడో వారంలో లహరి షారిలు బయటకు వెళ్లారు.
బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఐదు, ఏడు సీజన్లలో మాత్రమే మొదటి మూడు వారాలకూ ముగ్గురు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. తద్వారా షో చరిత్రలో ఇదో చెత్త రికార్డులా మిగిలిపోయింది. ఇక, నాలుగో వారం కూడా లేడీ కంటెస్టెంటే ఎలిమినేట్ అయితే.. ఇది ఇండియాలోనే పరమ వేస్ట్ రికార్డుగా అవుతుంది. దీంతో ఈ వారం ఎలిమినేషన్‌పై ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ మొదటి సీజన్‌లో ఫస్ట్ వీక్‌లో జ్యోతి, రెండో వారంలో మధుప్రియ, మూడో వారంలో సమీర్‌లు షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. నాని హోస్ట్ చేసిన రెండో సీజన్‌లో అయితే మొదటి వారంలో సంజన, రెండో వారంలో నూతన్ నాయుడు, మూడో వారంలో మాత్రం కిరీటిలు బిగ్ బాస్ షో నుంచి బయటకు వెళ్లిపోయారు.
ఇక, నాగార్జున వచ్చిన తర్వాత మూడో సీజన్‌లో మొదటి వారం హేమ, రెండో వారంలో జాఫర్, మూడో వారంలో ఎలిమినేషన్ లేకపోవడంతో నాలుగో వారంలో తమన్నా ఎలిమినేట్ అయ్యారు. అలాగే, నాలుగో సీజన్‌లో ఫస్ట్ వీక్‌లో సూర్య కిరణ్, రెండో వారంలో కల్యాణి, మూడో వారంలో దేవి నాగవల్లి వెళ్లిపోయారు.
ఆరో సీజన్ విషయానికి వస్తే... ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేయడంతో రెండో వారంలో డబుల్ షాక్ ఇచ్చారు. ఫలితంగా 14వ రోజే షానీ, అభినయ బయటకు వెళ్లిపోయారు. అలాగే, మూడో వారంలో నేహా చౌదరి వెళ్లిపోయింది. మొత్తంగా బిగ్ బాస్ షోలో మొదటి మూడు వారాల ఎలిమినేషన్స్ ఇలా సాగాయి.


Click it and Unblock the Notifications











