Bigg Boss 7 Telugu: ఆ కంటెస్టెంట్ రీఎంట్రీ.. ఆరోజే అసలైన సర్‌ప్రైజ్.. బిగ్ బాస్ హిస్టరీలో తొలిసారిగా
రియాలిటీ ఆధారంగా నడుస్తూ.. ఎన్నో ఊహించని పరిణామాలు.. మైండ్ పోగొట్టే ట్విస్టులతో సాగుతోన్న ఏకైక షో బిగ్ బాస్. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను తీసుకొస్తూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోందీ షో. ఈ కారణంగానే తెలుగులో ఇది పలు సీజన్లను పూర్తి చేసుకుంది. గత నెలలో మొదలైన ఏడో సీజన్ కూడా ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, ఇందులో ప్రతివారం ఒకరు చొప్పున ఇప్పటికే ముగ్గురు హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో వాళ్ల నుంచి ఇప్పుడు ఒకరిని షోలోకి తీసుకు వస్తున్నారని తెలిసింది. వివరాల్లోకి వెళ్తే...
రోజు రోజుకూ ఆసక్తికరంగానే:భారీ అంచనాల నడుమ కొద్ది రోజుల క్రితమే ఏడో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో వచ్చిన ఈ సీజన్‌లో ఆరంభంలోనే గొడవలు, లవ్ ట్రాకులు, సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు ఇలా పలు రకరకాలుగా మజాను పంచి భారీ రేటింగ్‌ను అందుకుందీ సీజన్. అలా రోజు రోజుకూ మరింత ఆసక్తికరంగా సాగుతోంది.

ముగ్గురు లేడీస్ ఎలిమినేట్:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి శోభా శెట్టి, టేస్టీ తేజ, నటి రతికా రోజ్, శుభ శ్రీ, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్, శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, నటి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, సీరియల్ హీరో అమర్‌దీప్‌లు ఎంటర్ అయ్యారు. వీరి నుంచి తొలి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, థర్డ్ వీక్‌లో దామిని వెళ్లిపోయారు.
ఐదు వారాల తర్వాత అలా:బిగ్ బాస్ ఏడో సీజన్ ఉల్టా పుల్టాగా సాగుతుందని నిర్వహకులు ముందుగానే ప్రకటించారు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆరంభం నుంచే ట్విస్టులు ఇస్తున్నారు. ముఖ్యంగా పవర్ అస్త్ర అంటూ కంటెస్టెంట్లను కన్ఫార్మ్ చేస్తున్నారు. ఇలా ఈ సీజన్ ఐదు వారాల పాటు సాగుతుందట. ఆ తర్వాత నుంచి ఇదంతా మరోలా మారిపోబోతుందని ఇప్పటికే ఓ న్యూస్ లీక్ అయింది.
సీజన్ 2.O.. తొలిసారిగా:బిగ్ బాస్ హిస్టరీలోనే తొలిసారిగా ఇందులో ఐదు వారాల తర్వాత అంటే అక్టోబర్ 8న ఈ సీజన్ 2.O ప్రారంభం కాబోతుందని బుల్లితెర వర్గాల ద్వారా తెలిసింది. ఆరోజున హౌస్‌లోకి మరో ఏడుగురు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అందులో అర్జున్, యాంకర్ నిఖిల్, సింగర్ భోలే, పూజ, అంజలిల పేర్లు ఇప్పటికే బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
ఒక రీఎంట్రీ.. దామిని పేరు:బిగ్ బాస్ ఏడో సీజన్ 2.O ప్రీమియర్ ఎపిసోడ్ కూడా అంగరంగ వైభవంగా జరిగేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో మొత్తం రాబోయే ఏడుగురు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని ముందే చెప్పుకున్నాం. అందులో మూడో వారంలో ఎలిమినేట్ అయిన సింగర్ దామిని కూడా రాబోతుందని అంటున్నారు. అంటే ఈమె షోలోకి రీఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం.
ఇంకా నిర్ణయం తీసుకోలే:బిగ్ బాస్ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. షో నిర్వహకులు ఇప్పటికే దామినితో చర్చలు జరిపారట. అయితే, ఆమె రీఎంట్రీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే మారింది. ఒకవేళ ఆమె రీఎంట్రీ ఇవ్వకపోయినా.. ఈ ఐదు వారాల్లో బయటకు వెళ్లే వారిలో ఒకరిని మళ్లీ తీసుకు వచ్చేలా బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేసిందని టాక్.


Click it and Unblock the Notifications











