Bigg Boss Srija: బిగ్‌బాస్ హౌస్‌లో అసలు జరిగేది ఇదే.. దమ్ము శ్రీజ షాకింగ్ రివీలేషన్స్

Bigg Boss Srija: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో శ్రీజ దమ్ము ఒకరు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్నంకు చెందిన శ్రీజ... సాఫ్ట్‌వేర్ జాబ్‌ను వదిలిపెట్టి మరీ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. కామనర్స్ కోటాలో ఎంట్రీ ఇచ్చిన శ్రీజ, మొదటి అగ్నిపరీక్ష నుంచే తన దమ్ము చూపించింది. ఆట తీరుతో పాటు మాటల్లోనూ స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉండటంతో ప్రేక్షకుల దృష్టిని వెంటనే ఆకర్షించింది. చాలామంది "ఈ అమ్మాయి ఖచ్చితంగా ఫినాలే వరకు వెళ్తుంది" అని అంచనా వేశారు. కానీ అందరి ఊహలకు భిన్నంగా ఐదో వారంలోనే ఆమె ఎలిమినేట్ కావడం బిగ్‌బాస్ ఆడియెన్స్‌కు షాక్ ఇచ్చింది.

ఈ ఎలిమినేషన్ అన్యాయమని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తర్వాత భరణితో కలిసి హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన శ్రీజ... కేవలం వారం రోజుల్లోనే మళ్లీ బయటకు రావాల్సి వచ్చింది. భరణిని కాపాడేందుకే శ్రీజను బలి చేశారంటూ అప్పట్లో నెటిజన్లు మండిపడ్డారు. ప్రస్తుతం బిగ్‌బాస్ తర్వాత కూడా శ్రీజ ఫుల్ బిజీగా ఉంది. పలు టీవీ షోలు, స్పెషల్ అపియరెన్సులతో పాటు రియాలిటీ ప్రోగ్రామ్స్‌లో సందడి చేస్తోంది. తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న ఆమె... తన పర్సనల్, ప్రొఫెషనల్ జర్నీతో పాటు బిగ్‌బాస్ అనుభవాలను ఓపెన్‌గా పంచుకుంది.

Dammu Srija Opens Up on Bigg Boss Journey PR Teams and Shocking Truths About Elimination

శ్రీజ దమ్ము తాజాగా ఓ టాక్ షోలో పాల్గొని తన బిగ్‌బాస్ జర్నీ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. తెలియని ప్రాంతం నుంచి వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు రావడం తన జీవితంలో పెద్ద మైలురాయి అని చెప్పింది. 'నిజంగా నన్ను నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా. బిగ్‌బాస్ స్టేజ్ వరకు వెళ్లి వచ్చానంటే అదే నా సక్సెస్. అగ్నిపరీక్షలో అడుగు పెట్టిన రోజే - నేను హౌస్‌లోకి వెళ్తాను అని చెప్పేశా. ఆ రోజు నా కాన్ఫిడెన్స్ లెవెల్ అదే,' అంటూ గుర్తు చేసుకుంది శ్రీజ.

బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాలంటే డబ్బులు ఇవ్వాలా? అనే ప్రశ్నకు స్పందిస్తూ... 'అంత డబ్బులు ఉంటే నేను బిగ్‌బాస్‌లోకి ఎందుకు వస్తాను? ఫేమ్ రావాలి, కొంచెం మనీ వస్తుంది అనే ఉద్దేశంతోనే వెళ్లా. నా విషయంలో అయితే ఇప్పటివరకు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అలాంటి వార్తలన్నీ ఫేక్. టాలెంట్ ఉంటేనే కాల్ వస్తుంది' అంటూ క్లారిటీ ఇచ్చింది.

ఇక హౌస్‌లో మాధురితో జరిగిన వాగ్వాదంపై స్పందించిన శ్రీజ... ఆమె ఎవరో తెలియక పరిచయం కోసమే ప్రశ్నించానని, కానీ అర్థం చేసుకున్న విధానం వేరుగా ఉండటంతో చిన్న గొడవ జరిగిందని చెప్పింది. బిగ్‌బాస్ విన్నర్‌గా కళ్యాణ్ నిలవడంపై మాట్లాడుతూ... 'నాకు మాటల్లో చెప్పలేనంత ఆనందం. ఒక కామనర్ విన్నర్ కావాలని కోరుకున్నా. 99% కళ్యాణ్ విన్ అవుతాడని తెలుసు... కానీ రూమర్స్ చూసి కాస్త టెన్షన్ పడ్డా. ఫైనల్‌గా అతను గెలిచినప్పుడు చాలా ఏడ్చా. పెర్ఫార్మెన్స్ ఆధారంగానే విన్నర్ సెలెక్ట్ చేస్తారు'అని తెలిపింది.

పీఆర్ టీమ్స్ గురించి మాట్లాడుతూ... ప్రతి కంటెస్టెంట్‌కు PR ఉంటుందని, తనను కూడా అగ్నిపరీక్ష సమయంలో సంప్రదించారని కానీ డబ్బులు పెట్టలేక రిజెక్ట్ చేశానని చెప్పింది. " పీఆర్ వల్ల ఒకరు పాజిటివ్‌గా కనిపించొచ్చు, నెగటివ్‌గా కూడా చూపించొచ్చు" అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఎలిమినేట్ అయినప్పుడు కన్నా దసరా సందర్భంగా హైపర్ ఆది హౌస్‌లోకి వచ్చినప్పుడు ఎక్కువ ఎమోషనల్ అయ్యానని, అలాగే పేరెంట్స్‌ను హౌస్‌కు పిలవలేకపోయిన సందర్భం చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చింది. ఇలా బిగ్‌బాస్ హౌస్‌లో ఎదురైన అనుభవాలు, బాధలు, ఆనందాలన్నింటినీ ప్రేక్షకులతో షేర్ చేస్తూ - తన జర్నీ తనకు జీవితాంతం గుర్తుండిపోయే ఛాప్టర్ అని దమ్ము శ్రీజ భావోద్వేగంగా వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X