Don't Miss!
- News
మనీశ్ సిసోడియా ఇళ్లలో సోదాలు పూర్తి.. ఆర్టికల్‌పై కామెంట్ప్‌పై న్యూయార్క్ టైమ్స్ గుర్రు
- Sports
World Test championship: ఇంగ్లాండ్‌పై గెలుపుతో అగ్రస్థానంలో సౌతాఫ్రికా.. ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే?
- Technology
త్వరలో భారత్‌లోకి 180W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా గల మొబైల్!
- Lifestyle
Health Tips: Healthy Fatty Foods:ఈ కొవ్వు పదార్ధాలు మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడి, గుండెపోటును నివారిస్తాయి..
- Finance
Crorepati Tips: రూ.27 లక్షలకు 73 లక్షలు లాభం.. ఈ ఫార్ములాతో మీరే కోటీశ్వరులు.. పొదుపు పాఠాలు
- Automobiles
కొత్త 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు వెల్లవుతాయి.. ఎప్పుడంటే?
- Travel
బౌద్ధం.. జైనం.. గుంటుపల్లి చరిత్రలో నిక్షిప్తం
Dancee Plus Finale Show TRP Rating: బుల్లితెరపై రికార్డు క్రియేట్ చేసిన ఓంకార్: దాని తర్వాతి స్థానం సొంతం...!
తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తుంటాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకాదరణను అందుకుంటాయి. అలాంటి వాటిలో 'డ్యాన్స్ ప్లస్' ఒకటి. డ్యాన్స్ రియాలిటీ షోగా వచ్చిన ఈ ప్రోగ్రామ్‌కు తెలుగు ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. తద్వారా ఇది విజయవంతంగా మొదటి సీజన్‌ను పూర్తి చేసుకుంది. ఇక, అంగరంగ వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలేకు కూడా తెలుగు ఆడియెన్స్ ఆదరణను అందించారు. ఫలితంగా ఇది బుల్లితెరపై సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

టాలెంట్‌ను పరిచయం చేసేందుకు
బుల్లితెరపై
సరికొత్త
కాన్సెప్టులతో
షోలను
క్రియేట్
చేస్తూ
తన
ప్రత్యేకతను
చాటుకున్నాడు
ఓంకార్.
ఇప్పటికే
ఎన్నో
కార్యక్రమాలను
రూపొందించిన
అతడు..
ఇప్పుడు
మరోసారి
స్టార్
మా
ఛానెల్
కోసం
'డ్యాన్స్
ప్లస్'
అనే
షోను
తీసుకొచ్చాడు.
కొత్త
టాలెంట్‌ను
ప్రపంచానికి
పరిచయం
చేయడం
కోసం
ఈ
షోను
మొదలు
పెట్టాడు.
దీని
ద్వారా
ఎంతో
మంది
తమ
టాలెంట్లను
చూపించుకున్నారు.

డ్యాన్స్‌తో పాటు గ్లామర్ యాడ్ చేసి
ఎంతో ఆసక్తికరంగా సాగిన 'డ్యాన్స్ ప్లస్' షోకు ఆరుగురు జడ్జ్‌లుగా వ్యవహరించారు. అందులో కొరియోగ్రాఫర్లు ఆనీ మాస్టర్, బాబా భాస్కర్, యశ్వంత్, రఘు మాస్టర్లతో పాటు గ్లామర్ క్వీన్ మోనాల్ గజ్జర్, హాట్ బ్యూటీ ముమైత్ ఖాన్ ఉన్నారు. వీళ్లంతా రెండేసి టీమ్‌లను ఎంపిక చేసుకుని.. పోటీలో భాగం అయ్యారు. షో మధ్యలో ఒకరు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు.

కొత్త కొత్త టాస్కులతో ఆసక్తికరంగా
ప్యూర్ డ్యాన్స్‌తో సాగిన 'డ్యాన్స్ ప్లస్' షో ప్రీమియర్ ఎపిసోడ్ నుంచి గ్రాండ్ ఫినాలే వరకూ ఊహించని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగింది. మరీ ముఖ్యంగా ఇందులో సరికొత్త టాస్కులు కనిపించాయి. దీంతో కంటెస్టెంట్లు, కొరియోగ్రాఫర్లు పోటీ పడి మరీ ఇందులో పాల్గొన్నారు. ఆరంభం నుంచి చివరి వరకు ఇది 43 ఎపిసోడ్స్ పాటు సాగింది. అన్నింటికీ మంచి స్పందన వచ్చింది.

ఫినాలేలో ట్విస్టులు.. సంకేత్ విన్
మిగిలిన షోల మాదిరిగా 'డ్యాన్స్ ప్లస్' ఏకపక్షంగా సాగలేదు. ఇందులో ఎవరు గెలుస్తారన్న విషయం ఫినాలే ఎపిసోడ్ వరకూ అంచనా వేయలేకపోయారు. అంతలా కంటెస్టెంట్లు అందరూ పోటీ ఇచ్చారు. ఇక, గ్రాండ్ ఫినాలేలో జియా ఠాకూర్ ఊహించని విధంగా ముందే ఎలిమినేట్ అయిపోగా.. సంకేత్ సహదేవ్ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. మహీ అండ్ తేజు రన్నర్‌తో సరిపెట్టుకున్నారు.

డ్యాన్స్ ప్లస్ షో టీఆర్పీ ఎంతంటే
'డ్యాన్స్ ప్లస్' షో గ్రాండ్ ఫినాలే దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగింది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ షో సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. ఇక, ఈ సీజన్ చివరి ఎపిసోడ్‌కు రికార్డు స్థాయిలో 12.5 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అలాగే, శనివారం ప్రసారం అయిన ప్రీ ఫినాలే ఎపిసోడ్‌కు 9.2 రేటింగ్ వచ్చింది. ఫలితంగా ఇది టాప్-5 జాబితాలో చేరిపోయింది.

దాని తర్వాతనే డ్యాన్స్ ప్లస్ షో
తెలుగు బుల్లితెరపై అత్యధికంగా టీఆర్పీ రేటింగ్ అందుకున్న షోలలో బిగ్ బాస్ ప్రథమ స్థానంలో ఉంది. నాలుగో సీజన్ ఫినాలే ఎపిసోడ్‌కు 18.5, ప్రీమియర్ ఎపిసోడ్‌కు 18.2 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. దీని తర్వాత జాబితాలోనూ మూడు, రెండో సీజన్ ఎపిసోడ్‌లు ఉన్నాయి. వీటి తర్వాతి స్థానాన్ని డ్యాన్స్ ప్లస్ షో అందుకుంది. దీంతో ఓంకార్ మరోసారి ఈ షోతో సత్తా చాటాడు.