Dancee Plus Finale Winner: ఫినాలేలో అదరగొట్టిన జాతిరత్నాలు చిట్టి.. ఫైనల్ లైవ్ ఎప్పుడు? ప్రైజ్ మనీ ఎంతంటే?

యాంకర్, డైరెక్టర్ ఓంకార్ హోస్ట్‌గా స్టార్ మాలో ప్రసారం అవుతున్న డ్యాన్సీ ప్లస్ తుది అంకానికి చేరుకొన్నది. ఆదివారం సాయంత్రం జరిగే ఫినాలేలో విజేత ఎవరో తెలిసిపోతుంది. మంచి టీఆర్పీ ఉన్న ఈ షోలో విజేత ఎవరనే విషయం ఇప్పుడు డ్యాన్స్‌ను అభిమానించే వారిలో ఉత్కంఠను కలిగిస్తున్నది. ఈ షో ఫినాలే విషయంలోకి వెళ్తే...

Recommended Video

BA Raju : Mahesh Babu కి Loyal PRO, Tollywood Encyclopaedia || Filmibeat Telugu
నువ్వా? నేనా అనే రేంజ్‌లో

నువ్వా? నేనా అనే రేంజ్‌లో

గతంలో డ్యాన్స్‌కు సంబంధించిన రియాలిటీ షోలను ఓంకార్ నిర్వహించినా.. ఈ సారి టాప్ రేంజ్‌లో ప్రోగ్రాంను డిజైన్ చేశారు. ఆరుగురు జడ్జీలతో నువ్వా నేనా అనే విధంగా షోను డిజైన్ చేశారు. అని మాస్టర్, బాబా భాస్కర్, రఘు మాస్టర్, యశ్వంత్, మోనాల్ గజ్జర్, ముమైత్ ఖాన్ న్యాయమూర్తులుగా ఎంచుకొని ఈ షోను మరింత క్రేజ్‌గా మార్చారు.

ఆరు టీమ్‌ల వివరాలు

ఆరు టీమ్‌ల వివరాలు

బాబా భాస్కర్ టీమ్‌లో అంచీ ముంబై, నివేదిత, అని మాస్టర్ గ్రూప్‌లో జియా థాకూర్, టీమ్ వెలాసిటీ, టీమ్ రఘు కింద డార్జిలింగ్ డెవిల్స్, తేజస్విని, మహేశ్వరి, యశ్వంత్ టీమ్‌లో సంకేత్ సహదేవ్, వాసి టోని, టీమ్ మోనాల్‌లో ఎంఎంకే, లుంగా మామాస్, టీమ్ మమైత్ ఖాన్ జట్టులో రామ్ లక్ష్మన్, 8 కౌంట్జ్‌తో షోను ఉర్రూతలూగించారు.

జాతిరత్నాలు ఫేమ్ చిట్టి

ఇక డ్యాన్సీ ప్లస్ షో ఫినాలే తారల తళుకుబెళులతో అదిరిపోయింది. జాతిరత్నాలు ఫేమ్ చిట్టి ఫారియా అబ్దుల్లా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో దుమ్మురేపింది. అల్లు అర్జున్ పాట టాప్ లేచిపోతుంది పాటకు స్టెప్పులేసి ఆకట్టుకొన్నారు. ఈ సందర్భంగా మోనాల్ గజ్జర్ మాట్లాడుతూ... వాసి టోని దాల్ ఫ్రై అయితే.. మీరు తడ్కా అంటూ కామెంట్ చేయడంతో చిట్టి అబ్బా అంటూ ఎక్స్‌ప్రెషన్ పెట్టింది.

ఫైనల్‌కు చేరుకొన్న సభ్యులు

డ్యాన్సీ ప్లస్ షో ఫినాలేకు చేరుకొన్న వారిలో టీమ్ అనీ నుంచి జియా థాకూర్, టీమ్ బాబా భాస్కర్ నుంచి నివేదిత, టీమ్ రఘు నుంచి డార్జిలింగ్ డెవిల్స్, టీమ్ యశ్వంత్ నుంచి సంకెత్ సహదేవ్, టీమ్ యశ్వంత్ నుంచి వాసి టోని, టీమ్ మోనాల్ నుంచి టీమ్ వెలాసిటీ సభ్యులు ఉన్నారు.

ఆదివారం సాయంత్రం 6 గంటలకు

ఇక డ్యాన్సీ ప్లస్ షో గ్రాండ్ ఫినాలే ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానున్నది. ఈ ఫినాలేకు సంబంధించిన లైవ్ డిస్నీ + హాట్‌స్టార్‌లో వీడియో స్ట్రీమింగ్ కూడా అవుతున్నది. ఈ షోను నేరుగా ఈ యాప్ ద్వారా చూడవచ్చు.

విజేతల వివరాలు సోషల్ మీడియాలో లీక్

డ్యాన్సీ ప్లస్ షోలో విజేతల వివరాలు షో ప్రసారం కావడానికి ముందే లీక్ అయ్యాయి. టీమ్ యశ్వంత్ పర్యవేక్షణలో ఉన్న సంకేత్ సహదేవ్ విజేతగా నిలిచారని అని మాస్టర్ టీమ్ మెంబర్ జియా థాకూర్ రన్నరప్‌గా నిలిచినట్టు సోషల్ మీడియాలో వివరాలు వైరల్ అవుతున్నాయి. విజేతకు రూ.20 లక్షల ప్రైజ్ మనీ సొంతం చేసుకోనున్నారు. రన్నరప్‌కు ప్రైజ్ మనీ ఎంత అనే విషయం గోప్యంగా ఉంచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X