యాంకర్ ఓంకార్ డ్యాన్సీ ప్లస్ ఫినాలే.. విజేత వివరాలు లీక్.. ప్రైజ్ మనీ ఎంతంటే..
యాంకర్, డైరెక్టర్ ఓంకార్ హోస్టుగా డ్యాన్సీ ప్లస్ షో విశేషంగా ఆదరణ సంపాదించుకొన్నది. ఈ షోకు సంబంధించిన ఫైనల్ ఎపిసోడ్ ఈ వారాంతంలో ప్రసారం కానున్నది. అయితే ఈ షోలో ఎవరు విజేతగా నిలుస్తారనే విషయం ఆసక్తిగా మారింది. అయితే ఈ షో ఫైనల్ ఎపిసోడ్ ఇప్పటికే పూర్తి అయినందున ఆ విజేత వివరాలు మీడియాలో లీక్ అయ్యాయి. ఈ వివరాల్లోకి వెళితే..

12 మంది కంటెస్టెంట్లు.. 6 గురు జడ్జీలు
డ్యాన్సీ ప్లస్ తెలుగు షో 12 మంది కంటెస్టెంట్లతో కూడిన టీమ్స్, ఆరుగురు జడ్జీలు, ఒక హోస్టుగా షో ప్రారంభమైంది. 12 జట్లల్లో రెండు జట్లకు ఒక జడ్జీని కేటాయించారు. దీంతో ఈ కార్యక్రమం మరింత క్రేజ్‌ను సొంతం చేసుకొన్నది. ఆట డ్యాన్స్ షోతో అత్యంత పాపులారిటీని సొంతం చేసుకొన్న ఓంకార్ ఈ షోను అద్భుతంగా డిజైన్ చేశారనే అభిప్రాయం ప్రేక్షకుల్లో వ్యక్తమైంది.

మోనాల్ గజ్జర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా
డ్యాన్సీ ప్లస్ షోలో ఆరుగురు జడ్జీలుగా ఉన్నారు. వారిలో అని మాస్టర్, బాబా భాస్కర్, రఘు మాస్టర్, యశ్వంత్, మోనాల్ గజ్జర్, ముమైత్ ఖాన్ న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్నారు. అని మాస్టర్ గ్రూప్‌లో జియా థాకూర్, టీమ్ వెలాసిటీ, బాబా భాస్కర్ టీమ్‌లో అంచీ ముంబై, నివేదిత, టీమ్ రఘు కింద డార్జిలింగ్ డెవిల్స్, తేజస్విని, మహేశ్వరి, యశ్వంత్ టీమ్‌లో సంకేత్ సహదేవ్, వాసి టోని, టీమ్ మోనాల్‌లో ఎంఎంకే, లుంగా మామాస్, టీమ్ మమైత్ ఖాన్ జట్టులో రామ్ లక్ష్మన్, 8 కౌంట్జ్ ఉన్నారు.

మే 16న ఫినాలే ఎపిసోడ్
డ్యాన్సీ ప్లస్ షో ప్రతీ శనివారం, ఆదివారం ప్రసారం అవుతుంది. ఈ షోకు సంబంధించిన చివరి ఎపిసోడ్, చివరి ఎలిమినేషన్ ఈ వారాంతంలో జరుగుతుంది. మే 16 తేదీన ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో డ్యాన్సీ ప్లస్ షో విజేత ఎవరు అనే విషయం తెలుస్తుంది. ఈ గ్రాండ్ ఫినాలేలో విజేతను ప్రకటిస్తారు.

విజేతగా సంకేత్ సహదేవ్
అయితే డ్యాన్సీ ప్లస్ షోలో విజేతల వివరాలు షో ప్రసారం కావడానికి ముందే లీక్ అయ్యాయి. టీమ్ యశ్వంత్ పర్యవేక్షణలో ఉన్న సంకేత్ సహదేవ్ విజేతగా నిలువగా, అని మాస్టర్ పర్యవేక్షణలో ఉన్న జియా థాకూర్ రన్నరప్‌గా నిలిచినట్టు సమాచారం. దీంతో ఈ షో తాజా సీజన్ ముగిసే అవకాశం ఉంది.
Recommended Video

ప్రైజ్ మనీ ఎంతంటే..
అయితే విజేతగా నిలిచిన సంకేత్ సహదేవ్ భారీగా ప్రైజ్ మనీని అందుకోబోతున్నాడు. సంకేత్ సహదేవ్‌కు రూ.20 లక్షల ప్రైజ్ మనీ బహుమతిగా సొంతం చేసుకోబోతున్నాడు. రన్నరప్‌కు ఎంత ప్రైజ్ మనీ అనే విషయం సీక్రెట్‌గా ఉంచినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











