జబర్దస్త్ వర్షకు మరోసారి షాక్.. OYOకి వెళ్దాం రమ్మంటూ చేయిపట్టి లాగిన డ్యాన్సర్!
జబర్దస్త్ వర్ష గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం కల్గిన ఈమె.. కమెడియన్ గా, ముఖ్యంగా ఇమాన్యూయేల్ కు లవర్ గా ఇరగదీస్తోంది. ఇప్పటికీ ఈ జంట అటు జబర్దస్త్ షోతో పాటు మరికొన్ని స్పెషల్ ఈవెంట్లలో కనిపిస్తున్నారు. ఈ మధ్యే వీరిద్దరితో కలిసి ఓ స్పెషల్ షో కూడా చేయిస్తున్నారు. అదే ప్రేమ కావాలి షో. అయితే ఈ ప్రేమ కావాలి షోలో వర్షకు ఎవరూ ఊహించని షాక్ తగిలింది. ఓ డ్యాన్సర్ ఓయోకి వెళ్దాం పదా అంటూ చేయి పట్టి లాగాడు.
ఏం చేయాలో తెలియక వర్ష అలా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత తేరుకుని లే వదులు అంటూ వదిలించుకుంది. అతడిని కొట్టేందుకు చేయి కూడా లేపింది. అయితే ఆ డ్యాన్సర్ ఎవరు, మరీ ఇంత పచ్చిగా ఎందుకు మాట్లాడాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జబర్దస్త్ షోలో వర్ష, ఇమాన్యూయేల్ జంటకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. వీరిద్దరి కాంబోను అనేక మంది లైక్ చేస్తుంటారు.

వర్ష, ఇమాన్యూయేల్ జంటకు ఉన్న క్రేజ్ తోనే వీరికి అనేక ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా అలా వచ్చిన క్రేజ్ తోనే.. షోకు కూడా మంచి గుర్తింపు వస్తుందని భావించిన నిర్వాహకులు... ప్రేమ కావాలి అనే షోను వీరిద్దరి చేతిలో పెట్టారు. అప్పటి నుంచి రెండు స్పెషల్ జంటలను పిలిచి అనేక ఆటలు, పాటలతో సందడి చేయిస్తుంటారు వీరిద్దరూ.
అయితే తాజాగా వచ్చిన ఎపిసోడ్కు డ్యాన్సర్ పండు వచ్చాడు. అయితే వర్ష స్టేజీపై ఉండగా.. ఆమె పక్కన ఇమాన్యూయేల్ కనిపించలేదు. ఈసారి షాకింగ్ గా పండు దర్శనం ఇచ్చాడు. నేనే యాంకర్ అంటూ రచ్చ చేశాడు. ముందుగా స్టేజీ మీదకు వచ్చిన ఈయన వర్షతో పులిహోర కలిపాడు. మనం వచ్చామంటే అమ్మాయిల ఫాలోయింగ్ మామూలుగా ఉండదంటూ షోకు వచ్చిన స్టూడెంట్స్ తో డ్యాన్స్ చేశాడు. వీరితో డ్యాన్స్ చేయాలంటే ఇలాంటి పాటే కావాలనిపిస్తుందంటూ ఓ పాటు చెప్పాడు.
ఇక ఆ తర్వాత వర్షతో మాట్లాడుతూ... నిన్ను చూస్తే ఎలాంటి పాటకు స్టెప్పులు వేయాలనిపిస్తుందో తెలుసా అంటూ అడిగాడు. అంతోలనే ఓ పాట ప్లే కాగా.. ఇద్దరూ స్టెప్పులు వేశారు. ఆ తర్వాత వర్ష.. పండు నువ్వు వస్తే ఇలాంటి పాటలేంటి.. ఓ ఊపు ఉండే పాట కావాలని అంటుంది. వెంటనే పండు.. ఇప్పుడు చూడంటూ మరో పాటను ప్లే చేయిస్తాడు. దానికి ఇద్దరూ స్టెప్పులు వేస్తారు. ఆ వెంటనే ఇది కాదు ఇది కాదు.. ఆ ఓయో.. ఓయో అది పెట్టంటూ స్టెప్పులు వేస్తాడు.

పాట రాగానే వర్షతో కలిసి డ్యాన్స్ చేసిన ఆయన కాసేపటికే ఆపేసి... ఓయో అంటే ఇక్కడ డ్యాన్స్ వేస్తావేంటి... పదా ఓయోకి వెళ్దాం రమ్మంటూ చేయి పట్టి లాగుతాడు. ఆ తర్వాత ఏం చేయాలో పాలుపోని వర్ష ఒక్క క్షణం అలాగే ఉండి ఆ తర్వాత పండును కొట్టేందుకు చేయి లేపుతుంది. అసలు నువ్వొచ్చావేంటి మా ఇమ్మూ ఏడని అడుగుతుంది. అలా అలా షోని కంటిన్యూ చేశారు. కానీ పండు వర్షను ఓయోకి రమ్మన్న మాట మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది. ఇదేం పద్ధతి అంటూ నెటిజెన్లు తిట్టి పోస్తున్నారు.


Click it and Unblock the Notifications











