చిరంజీవి పంచె కట్టుపై...దాసరి సెటైర్లు!

అదును చూసి ఈ రెండు వర్గాలు ఒకరిపైకి ఒకరు సెటైర్లు వేసుకోవడం చాలా సందర్భాల్లో చూసాం. తాజాగా ఇలాంటి సందర్భమే మరోసారి చోటు చేసుకుంది. ఈసారి దాసరి నారాయణరావు చిరంజీవిపైకి పరోక్షంగా సెటైర్లు వదిలారు. దాసరి సెటైర్లు చిరంజీవి పంచె ఊడేలా ఉన్నాయని ఆయన మద్దతు దారులు కొందరు అభిప్రాయ పడుతున్నారు.
అసలు విషయంలోకి వెళితే...
డబ్బింగ్ సీరియళ్లకు వ్యతిరేకంగా తెలుగు టీవీ కళాకారులు గత కొంత కాలంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి దాసరి తన అండదండులు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మా టీవీ ఓనర్లలో ఒకరైన చిరంజీవిపైకి సెటైర్లు విసిరారు దాసరి. అన్ని ఛానళ్లు డబ్బింగ్ సీరియళ్లు ఆపుచేస్తామని మాట ఇచ్చినా....మా టీవీ మాత్రం తెలుగు టీవీ కళాకారులను పట్టించుకోవడం లేదని, చిరంజీవి జోక్యం చేసుకోవాలని, ఆయన జోక్యం చేసుకుంటారనే నమ్మకం ఉందని దాసరి సెటైరిక్ గా కామెంట్స్ చేసారు.
దాసరి ఏమన్నారంటే...
'చిరంజీవి కేంద్ర మంత్రి కదా...ఆయన బిజీ, అందుకే ఆయన్ను కలిసే అవకాశం తెలుగు టీవీ కళాకారులకు దొరకడం లేదు. తెలుగు టీవీ కళాకారుల ఆందోళన బహుషా ఆయన వరకు వెళ్లి ఉండదు. వెళితే ఆయన తప్పకుండా స్పందిస్తాడు. తెలుగు భాషకు సంబంధించిన ఏ విషయం అయినా ఆయన ఓ అడుగు ముందే ఉంటారు. ఆ మధ్య ప్రపంచ తెలుగు మహా సభల్లో చిరంజీవి పంచె కట్టి, కండువా వేసి అచ్చమైన తెలుగు వాడిని అని నిరూపించుకున్నారు. తల్లిని మరిచిపోయినట్లు తెలుగును మరిచిపోతున్నారని ఆయన అన్న మాటలు నాకు గుర్తున్నాయి. తెలుగు టీవీ కళాకారుల ఆందోళన విషయం ఆయనకు తెలిస్తే తప్పకుండా ...తన మాటీవీలో డబ్బింగ్ సీరియళ్లు రాకుండా నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం ఉంది' అంటూ దాసరి వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











