Bigg Boss 9 Telugu: ఆ నటితో టచ్‌లోకి బిగ్‌బాస్ టీమ్? ఇక హౌస్‌లో ముద్దులు, హగ్గులే!

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ మరికొద్దినెలల్లో ప్రారంభం కానుంది. ఇంటిల్లిపాదిని అలరించే ఈ షో కోసం కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా మొదలు పెట్టేశారు నిర్వాహకులు. ఈసారి ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా రానున్నారు? ఈసారి ఎలాంటి వివాదాలు చోటు చేసుకోనున్నాయి? అంటూ నెటిజన్లు అప్పుడే విశ్లేషణలు మొదలుపెట్టేశారు. తాజాగా బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ కోసం కంటెస్టెంట్స్‌గా కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్‌లో ప్రక్షాళన
బిగ్‌బాస్ బ్రాండ్ దెబ్బతినకుండా ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు గేట్స్ క్లోజ్ చేస్తూ హిందీ బిగ్‌బాస్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఈనేపథ్యంలో దానిని తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషల్లో ప్రసారం కానున్న బిగ్‌బాస్‌కు కూడా వర్తింప చేస్తారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఊరు పేరు లేని కంటెస్టెంట్స్‌ కూడా జనంలో బాగా పేరున్న వారిని సంప్రదిస్తున్నారు. ఆటలు, డిస్కషన్స్, టాస్క్‌లు, నామినేషన్స్ ఇలా ప్రతీది కొత్తగా ఉంటుందని టాక్ వస్తోంది.

Debjani Modak Might Be A Contestant On The Bigg Boss Telugu Season 9

బిగ్‌బాస్‌లో మార్పులు ఇవేనా?
బిగ్‌బాస్ తెలుగు 8లో చాలా వరకు మార్పులు చేశారు. కెప్టెన్‌కు బదులు చీఫ్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. అలాగే చీఫ్‌కు ఇద్దరు డిప్యూటీ చీఫ్‌లను కూడా ఇచ్చారు. ఈ విధానం బాగానే వర్కవుట్ అయ్యింది. అలాగే ప్రైజ్‌మనీ సున్నాతో ప్రారంభించి.. కంటెస్టెంట్సే తమ ప్రైజ్‌మనీని సంపాదించుకోవాలనే నిబంధన తీసుకొచ్చి సస్పెన్స్ కంటిన్యూ చేశారు. దీనిని కూడా కొనసాగించే అవకాశాలు లేకపోలేదు. ఉల్టా పల్టా అంటూ సాగిన గత సీజన్‌లో కన్నడ బ్యాచ్, గ్రూపులు ఎక్కువ కావడంతో ఈసారి అలాంటి వాటికి హౌస్‌లో చోటివ్వకూడదని అనుకుంటున్నారట.

కంటెస్టెంట్స్ ఎంపికలో బిగ్‌బాస్ టీమ్
ఈసారి బిగ్‌బాస్ టీమ్ కంటెస్టెంట్స్‌ ఎంపిక ప్రక్రియ కాస్త ముందుగానే ప్రారంభించినట్లుగానే పుకార్లు వినిపిస్తున్నాయి. జూలై చివరి నాటికి కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేసి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆగస్ట్ ఎండింగ్ లేదా సెప్టెంబర్ మొదటి వారానికి బిగ్‌బాస్‌ను టెలికాస్ట్ చేసే అవకాశాలు పుష్కళంగా ఉన్నాయి. హోస్ట్ ప్లేస్‌లో విజయ్ దేవరకొండ, నందమూరి బాలకృష్ణల పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఈసారి కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ బాధ్యతలు నిర్వర్తిస్తారని ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది.

కంటెస్టెంట్స్‌గా కొందరి పేర్లు
కాగా.. ఈసారి కంటెస్టెంట్స్‌గా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి రీతూ చౌదరి, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, అలేఖ్య చిట్టి పికెల్స్ రమ్యలు ఖచ్చితంగా హౌస్‌లోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా బుల్లితెర నటి దేబ్‌జనీ మోదక్ కూడా ఈసారి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగు పెడతారని అంటున్నారు. ఇప్పటికే దేబ్‌జనీతో బిగ్‌బాస్ టీమ్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. స్టార్ మాలో ఎన్నెన్నో జన్మల బంధం, సత్యభామ తదితర సీరియల్స్‌తో ఈ ముద్దుగుమ్మ తెలుగువారికి పరిచయమయ్యారు. ప్రస్తుతం స్టార్ మా లోనే ప్రసారం అవుతున్న కిర్రాక్ బాయ్స్ - ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2లో దేబ్‌జనీ మోదక్ పార్టిసిపేట్ చేస్తోంది. గత వారం ఇమ్మాన్యుయేల్‌కు ముద్దుపెట్టి షాకిచ్చించి ఈ ముద్దుగుమ్మ. హౌస్‌లోకి గనుక ఇమ్మాన్యుయేల్, దేబ్‌జనీలు అడుగుపెడితే కిస్‌లు, హగ్‌లు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X