గుడ్‌న్యూస్ చెప్పిన సత్యభామ సీరియల్ నటి... ఆ ఫోటోలతో షాకిచ్చిన దేబ్‌జనీ

సినిమా, టీవీ రంగంలో ఉన్న నటీనటులకు ఎప్పుడు ఏమవుతుందోనన్న టెన్షన్ ఉంటుంది. తమ అందం, అదృష్టం బాగున్నంత కాలం ఢోకా ఉండదని.. తర్వాత పరిస్థితి ఏంటీ? అనే దానిపై స్పష్టమైన అవగాహన ఉంది. తమ ముందు తరాల వారి జీవితాల్ని గుణపాఠంలా తీసుకుని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని భావిస్తున్నారు. నటనను వృత్తిగా కొనసాగిస్తూనే.. వ్యాపారాలు, పెట్టుబడులు, రియల్ ఎస్టేట్‌లోకి దిగుతున్నారు. ఒకరిని చూసి మరొకరు ఇలా ముందుకు సాగుతున్నారు.

తెలుగు బుల్లితెరపై పరభాషా నటులు
గతంతో పోలిస్తే బుల్లితెర నటీనటులకు ప్రస్తుతం అవకాశాలతో పాటు రెమ్యునరేషన్ కూడా బాగానే అందుతోంది. ఇక బ్రాండ్ అండార్స్‌మెంట్స్ విషయంలోనూ మంచి ఆదాయం వస్తోంది. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై స్టార్ మాలో ప్రసారమవుతోన్న సీరియల్స్‌కు మంచి ఆదరణ దక్కడంతో పాటు టీఆర్పీ రేటింగ్ కూడా టాప్ లెవల్‌లో వస్తోంది. అలాగే నటీనటులకు కూడా స్టార్ స్టేటస్ అందుతోంది. తెలుగు బుల్లితెరపై ఈ మధ్యకాలంలో తెలుగు వారి కంటే పరభాషా నటుల డామినేషన్ ఎక్కువ అవుతోంది. తమిళ, కన్నడ, బెంగాలీ ఇండస్ట్రీలకు చెందిన పలువురు నటీనటులు తెలుగు టెలివిజన్ రంగాన్ని ఆక్రమిస్తున్నారు.

Debjani Modak Satyabhama Serial actress launched new business

బెంగాలీ అందాలు అదరహో
అలా బెంగాల్ నుంచి ఇక్కడ అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు దేబ్‌జనీ మోదక్. హీరోయిన్లను మించిన అందంతో మెరిసిపోతూ కుర్రకారును రెచ్చగొడుతున్నారు ఈ ముద్దుగుమ్మ. 1996 మార్చి 20న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో దేబ్‌జనీ మోదక్ జన్మించారు. ఆమె తండ్రి అపూర్భా మోదక్ వ్యాపారవేత్త కాగా, తల్లి మితా మోదక్ గృహిణి. ప్లస్ 2 చదువుతుండగానే దేబ్‌జనీకి సినిమాలు, టీవీ సీరియల్స్‌ నుంచి అవకావాలు రావడంతో... కరస్పాండెన్స్ ద్వారా చదువుకున్నారు.

ఎన్నెన్నో జన్మల బంధంతో ఫేమ్
2013లో నాకౌట్ అనే బెంగాలీ సినిమాతో దేబ్‌జనీ వెండితెరపై అడుగుపెట్టారు. తర్వాత గ్యాంగ్‌స్టర్ కింగ్, క్లాప్ స్టిక్ వంటి సినిమాల్లో నటించారు. బెంగాలీ సీరియల్స్‌లోనూ బిజీ అయిన ఆమెకు సౌత్ నుంచి ఆఫర్లు వచ్చాయి. తొలుత తమిళంలో సన్ టీవీ నిర్మించి రసతి, వనతై పోలా ధారావాహికలలో నటించారు. అనంతరం స్టార్ మాలో టెలికాస్ట్ అయిన ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్‌లో డాక్టర్ వేదాశ్వినీగా తెలుగువారిని పలకరించారు. ఆ ధారావాహికలో నిరంజన్‌కు భార్యగా తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో పలు చిత్రాలతో పాటు బుల్లితెరపై పలు కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ అలరిస్తున్నారు.

బిగ్‌బాస్ ఛాన్స్ మిస్
ఈ ఏడాది బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్ లిస్ట్‌లో దేబ్‌జనీ పేరు వినిపించింది. అయితే చివరి నిమిషంలో ఆమె బిగ్‌బాస్ టీమ్ ఆఫర్‌ను తిరస్కరించినట్లుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వచ్చాయి. ఇకపోతే.. సీరియల్‌లో నటించినందుకు గాను రోజుకు 25 వేల వరకు ఆమె పారితోషికంగా తీసుకుంటారని బుల్లితెర వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన పలు సీరియల్స్, టీవీ కార్యక్రమాలతో కలిపి ఆమె నెలకు 12 లక్షల వరకు సంపాదిస్తారని అంటున్నారు.

కొత్త ప్రయాణం మొదలైంది
ఇకపోతే.. తన కెరీర్‌పై స్పష్టమైన ప్లానింగ్‌తో ఉన్న దేబ్‌జనీ మోదక్ తాజాగా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పలువురు నటీనటుల మాదిరిగానే తను కూడా బిజినెస్‌లోకి దిగారు. కిన్నోరి శారీ పేరుతో వస్త్ర వ్యాపారంలోకి దిగారు. తన సొంతూరు కోల్‌కతాలో షాప్ ఏర్పాటు చేసుకుని తాజాగా పూజా కార్యక్రమాలతో దుకాణాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను దేబ్‌జనీ మోదక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. నేను చాలాకాలంగా కలలు కంటున్న క్షణంలోకి అడుగుపెట్టాను.. చేతులు జోడించి ప్రార్ధనలు చేస్తూ, నా కొత్త హోల్‌సేల్ దుకాణం కోసం పూజ చేశాను. ఒక చిన్న ఆశగా మొదలైనది నెమ్మదిగా దార్శనికతగా ఎదిగి, నేడు.. కోల్‌కతాలోని బారాబజార్‌లోని రద్దీగా ఉండే సందులలో రూపుదిద్దుకుంది. ఇది ప్రారంభం మాత్రమే. అతి త్వరలో మేము ఆన్‌లైన్‌కి వస్తున్నా.. ప్రత్యేకించి హోల్‌సేల్ ప్లాట్‌ఫామ్‌లలోకి. ఇది త్వరలోనే మీకు తెలియజేస్తాను. నా కథలో భాగమైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు అంటూ దేబ్‌జనీ రాసుకొచ్చారు.

More from Filmibeat

Read more about: debjani modak movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X