Brahmamudi December 12th రుద్రాణి ప్లాన్‌కు కావ్య బలి.. కాలిపోయిన శుభలేఖ.. కల్యాణ్ పెళ్లి ఆగిపోనుందా?
ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో (డిసెంబర్ 12వ తేదీ) మొక్కే కదా అని పీకెస్తే.. చచ్చిన మొక్క బతికిందని కనకం అనుకుంటూ ఉంటుంది. ఇక బయట కూర్చొని కలలు కంటుంటుంది. అనామిక అమ్మానాన్నలతో కలిసి లోపలికి అడుగుపెట్టింది.. ఇంట్లోని మందంతా వారికి స్వాగతం పలికారు.. అంటూ ఊహించుకుంటుంది. తర్వాత ఇరు కుటుంబాలు దేవుడి దగ్గర శుభలేక పెడితే కుంకుమ నేల పడినట్లు కలకంటుంది. దాన్ని ఇంట్లో వాళ్లంతా అపచారంగా భావించారు అని కనకం ఊహించుకుంటుంది. ఇక పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు ఊహించుకుంటుంది.
ఈ విషయంపై అనామిక తల్లిదండ్రులతో కల్యాణ్, తన తల్లిదండ్రులు గొడవ పడినట్టు అనుకుంటుంది. ఇక కల్యాణ్ ఆ పెళ్లి వద్దు అనుకున్నట్లు అందుకు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఓకే చెప్పినట్లు కలకంటుంది. దీంతో పెళ్లి ఆగిపోయింది అని గంతులు వేస్తుంది. ఇంతలో అప్పు అక్కడికి వచ్చి పగటి కలలు కంటున్నావా అని ఒకటి వేస్తుంది. ఇంతలో అక్కడికి కల్యాణ్ వస్తాడు.

బ్రో అప్పుడే వచ్చేశావా.. టైమింగ్ అంటే నీదే బ్రో.. అంటూ కల్యాణ్ వస్తాడు. పెళ్లి కార్డు ఇవ్వడానికి అనామిక వాళ్లు వస్తున్నారు. వాళ్లు వెళ్లిన తర్వాత మనం బయటకు వెళ్లి కార్డులు పంచాలని చెప్తాడు. ది నా కలే కావొచ్చు. కానీ నేను నా కూతురు కన్న కలని నిజం చేయడం కోసం ఈ కలనే నేను నిజం చేస్తానని కనకం అనుకుంటుంది. మరోవైపు ఏంటి మమ్మీ అందరూ అనామిక వాళ్లు మొదటి పత్రిక తెస్తున్నారు. పెళ్లి ఎంత గ్రాండ్‌గా చేయాలా అని ఆలోచిస్తుంటే నువ్వు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావ్ అని రాహుల్ అంటాడు.
మరి ఏం చేయమంటావ్. మనకు ఆ తలకుమాసిన స్వప్నను అంటగట్టి వీళ్లు మాత్రం ఇంత మంచి సంబంధం తెచ్చుకుంటారా.. దాన్ని చూస్తూ ఎలా ఉండాలి. నాకు దక్కని ఆనందం వాళ్లకు కూడా దక్కకూడదని రుద్రాణి అంటుంది. అయితే ఏంటి మమ్మీ ఈ పెళ్లి ఆపుతావా.. అలా చేస్తే వీళ్లు ఊరుకుంటారా అని రాహుల్ అంటాడు. పిచ్చి రాహుల్ నేను ఎందుకు ఆపుతాను. కావ్య చేత ఆపేలా చేస్తా.. వాళ్ల జాతకంలోనే మాంగల్య దోషం ఉందని పంతులు చెప్పారు కదా.. ఏ జరిగినా అది ఆ దోషం వల్ల జరిగిందని ఈ పెళ్లి ఆపేస్తారు. కాకపోతే ఆ తప్పుని కావ్య చేత చేయిస్తే మన చేతికి మంటి అంటుకోదని ప్లాన్ వేస్తుంది.
కావ్య మాత్రం ఎందుకు చేస్తుందని రాహుల్ అంటాడు.. కావ్య చేయదు తనకి కూడా తెలికుండా నేను చేస్తా.. చూడు అంటుంది రుద్రాణి. మరోవైపు రాజ్ ఫ్యామిలీ అంతా హాల్‌లో కూర్చొని అనామిక వాళ్ల కోసం ఎదురు చూస్తుంటారు. ఇంతలో వాళ్లు వస్తారు. కొద్ది సేపు మాట్లాడుకుంటారు. అనామిక, కల్యాణ్‌లపై జోకులు వేస్తారు. ఇక కనకం కోపంతో ఊగిపోతుంటే.. అప్పు బాధ పడుతుంటుంది. ఇక ఊరికెళ్లి పూజ చేయించామని మొదటి శుభలేఖ మీకే ఇవ్వాలని తీసుకొచ్చామని అనామిక తండ్రి అంటారు.

మీ పద్ధతి చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఆడపిల్లని వదిలించుకుంటామా అని చూస్తున్నట్లు ఉందని రుద్రాణి అంటుంది. డ పిల్ల ఎప్పటికీ పుట్టింటివాళ్లకు బరువు కాదు అండి అది ఒక బాధ్యత అని కావ్య అంటుంది. పెళ్లీడు రాగానే మంచి ఇంట్లోకి పంపించాలని అది ఆరాటం. మీకు అది అర్థంకాదులేండని అంటుంది కావ్య. నేను ఏదో సరదాగా అంటే నువ్వు ఎందుకు అంత సీరియస్‌గా తీసుకుంటావ్. అనామిక ఈ ఇంటి కోడలు అవ్వడం నాకు ఇష్టమేనని అంటుంది రుద్రాణి.
సరే సరే నువ్వు ఊరుకో రుద్రాణి. కావ్యా నువ్వు వెళ్లి మొదటి శుభలేఖ తీసుకురా. ధాన్యలక్ష్మి మీరు కార్డు తీసుకోండని ఇందిరాదేవి అంటుంది. ధాన్యలక్ష్మి దంపతులు వియ్యంకులకు తాంబూలం ఇచ్చి మొదటి శుభలేక తీసుకుంటారు. ఇక కనకం కుంకుమ పట్టుకుంటుంది. ధాన్యలక్ష్మి అడిగితే అది ఇచ్చినట్లే ఇచ్చి కిందపడేలా చేస్తుంది కానీ ధాన్యలక్ష్మి సమయానికి పట్టుకుంటుంది. ఇక పెళ్లి పత్రికను దేవుడి దగ్గర పెట్టి పూజ చేయమని కావ్యతో ఇందీరాదేవి చెప్తుంది. అందరూ పూజ చేయడానికి వెళ్తారు.
మరోవైపు రుద్రాణి పసుపులో ఏదో లిక్విడ్ కలుపుతుంది. కావ్య శుభలేఖకు పసుపు రాసి హారతి ఇచ్చినప్పుడు కొంచెం మంటకే ఆ శుభలేఖ కాలిపోతుంది అని రుద్రాణి తన ప్లాన్‌ను రాహుల్‌తో చెప్తుంది. కావ్య హారతి ఇస్తున్నప్పుడు ఒక్కసారిగా కార్డుకు మంట అంటుకుంటుంది. అందరూ షాక్ అవుతారు. ఏంటి కావ్యా నువ్వు చేసిని పని జాగ్రత్తగా ఉండాలి కదా.. నీ చేతుల మీద శుభకార్యం జరిపించాలి అని మా అమ్మ ఆశపడింది. కానీ నువ్వు ఇలా పెళ్లి పత్రిక తగలబెట్టావని రుద్రాణి డ్రామా మొదలుపెడుతుంది.

ఏంటి మీరు అనేది. నేను ఎందుకు అలా చేస్తానని కావ్య అంటుంది. నువ్వు చేయకపోతే దానంతట అదే తగలబడిందా అని అంటుంది రుద్రాణి. అదే నాకు అర్థం కావడం లేదని కావ్య అంటుంది. అర్థం కాకపోవడం ఏంటి.. నీ అజాగ్రత్త వల్లే ఇలా జరిగింది నువ్వే ఈ తప్పు చేశావు. ఒకసారి అనామిక ఫ్యామిలీని చూడు ఎంతలా కంగారు పడుతున్నారో. మీ చిన్నత్త మొహం చూడు ఎంత భయపడిపోతుందో అని అంటుంది.
అసలే పంతులు వచ్చి మాంగల్య దోషం ఉందన్నాడు. ఇంటి పెద్దకు గండం అని చెప్పాడు. ఇప్పుడు ఇలా జరిగితే ఏమనుకుంటారు. అమ్మాయి జాతకం వల్లే ఇలా అయిందని అనుకోరా... పెళ్లి పత్రిక అంటే మనం ఎంత మంగళకరంగా చూస్తాం. ఇప్పుడే మా అమ్మ చెప్పింది పత్రికను పెళ్లి అయినంత వరకు దేవుడి దగ్గర పెట్టాలి అని. నువ్వేమో దాన్ని తగలబెట్టి బూడిద చేశావని అంటుంది రుద్రాణి.
ఏంటి అత్తా అలా అంటావ్ కళావతి కావాలని చేసిందా అనుకోకుండా అలా జరిగిపోయిందని రాజ్ అంటాడు. అనుకోకుండా కాదు బాబు. అజాగ్రత్త వల్ల జరిగింది. ఆడ పిల్ల తల్లిదండ్రులుగా ఒకసారి మావైపు ఆలోచించండి. రుద్రాణి గారు చెప్పింది నిజమే కదా. అమ్మాయి కున్న దోషం వల్ల ఇలా జరిగింది అనుకోరా అని అనామిక ఫాదర్ అంటాడు. ఏదో అనుకోకుండా ఇలా జరిగింది ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఆలోచించకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తే మంచిది కదా అని కనకం అంటుంది.
ఏం ఆలోచించాలి అక్కయ్య గారు మీకు కూడా ముగ్గురు కూతుళ్లు ఉన్నారు కదా వాళ్ల విషయంలో ఇలా జరిగితే మీరు ఊరుకుంటారా అని అనామిక తల్లి అంటుంది. వాళ్లకి ఇంతకంటే పెద్ద గండాలే జరిగాయి లెండీ.. ఏంటి కనకం అని రుద్రాణి అంటుంది. రుద్రాణి గారు నేను తప్పు చేశాను కాబట్టి నన్ను అనండి మా అమ్మని ఎందుకు అంటారని కావ్య అంటుంది. ఇక అనామిక తల్లి కూడా సీరియస్ అవుతుంది.
ఆంటీ మీరు అనవసరంగా చాలా దూరం ఆలోచిస్తున్నారని కల్యాణ్ అంటాడు. ఆలోచన కాదు కల్యాణ్ బాబు ఇది మా కూతురి జీవితం. పెళ్లి చేసి పంపించేయడంతో పాటు మా బాధ్యత తీరిపోదు కదా. ఇక్కడ తను సంతోషంగా ఉండటం కూడా మాకు ముఖ్యమే. అసలు నాకు ఇప్పుడు అనిపిస్తుంది మీ వదినకు ఈ పెళ్లి ఇష్టమేనాఅని అనామిక తల్లి అంటుంది. ఏం లేదు బాబు పరిస్థితులు చూస్తే అలానే అనిపిస్తుందని అనామికతల్లి అంటుంది. ఇందాక వాళ్ల అమ్మ కుంకుమ కింద పడేయబోయింది. ఇప్పుడేమో కావ్య ఇదంతా చూస్తుంటే అనుమానమే వస్తుంది కదా. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.


Click it and Unblock the Notifications










