Brahmamudi December 19th 'బ్రహ్మముడి'లోకి నువ్వు నేను ప్రేమ...అనామిక, కల్యాణ్ పెళ్లిలో విక్కి, పద్మావతి సందడి

బ్రహ్మముడి సీరియల్ లో ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు ఎపిసోడ్ లో శ్వేత‌తో ఫోన్ మాట్లాడుతుండ‌గా అపర్ణ చూసి రాజ్ దగ్గరకు వెళ్తుంది. ఇక త‌ల్లికి ఏం స‌మాధానం చెప్పాలో తెలియ‌క సెలైంటుంగా జారుకోవాలని అనుకుంటాడు రాజ్. అస‌లు నువ్వు ఏం చేస్తున్నావ‌ని కొడుకును నిల‌దీస్తుంది అప‌ర్ణ‌. కావ్య విష‌యంలో ఏం నిర్ణ‌యం తీసుకున్నావ‌ని అడుగుతుంది. కావ్య నా జీవితం ఉండ‌ద‌ని అంటాడు. అప్పుడు, ఇప్పుడు అదే మాట చెబుతున్నాన‌ని త‌ల్లితో అంటాడు.

గుడిలోనూ, పెళ్లి ప‌త్రిక కాలిపోయిన‌ప్పుడు ఎందుకు కావ్య‌ను వెన‌కేసుకువ‌చ్చావ‌ని రాజ్ ను నిల‌దీస్తుంది అపర్ణ. కావ్య‌ను చేయ‌ని త‌ప్పుకు నిందించార‌ని ఆమెకు స‌పోర్ట్ చేశాన‌ని చెప్తాడు రాజ్. గొడ‌వ‌ల్లో క‌ళ్యాణ్ ఇష్ట‌ప‌డ్డ అమ్మాయికి ఎక్క‌డ దూర‌మ‌వుతాడోన‌ని అలా మాట్లాడాన‌ని క్లారిటీ ఇస్తాడు. కావ్య‌కు స‌పోర్ట్ చేసినంత మాత్రానా ఆమెపై ప్రేమ ఉన్న‌ట్లు కాద‌ని అంటాడు. కానీ మాకు అలా క‌నిపించ‌లేదు. నీ భార్య కాబ‌ట్టి వెన‌కేసుకువ‌చ్చావ‌ని అనిపిస్తోంద‌ని అంటుంది అప‌ర్ణ‌.

December 19th 2023 Episode number 283 in Brahmamudi Telugu Serial Nuvvu Nenu Prema Serial

నీది నిజ‌మైన ప్రేమ అనుకొని కావ్య నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావ‌ని అంటుంది అపర్ణ. నీ హ‌ద్దుల్లో నువ్వు ఉంటే మంచిద‌ని చెప్తుంది. తాత‌య్య ఆరోగ్యం బాగ‌య్యే వ‌ర‌కు కావ్య‌పై ప్రేమ ఉన్న‌ట్లు న‌టిస్తా.. ఆ త‌ర్వాత క‌ళావ‌తిని త‌న జీవితంలో నుంచి పంపిచేస్తా అంటూ రాజ్ చెప్తాడు. కొడుకు ఆలోచ‌న‌ల‌ను అప‌ర్ణ అర్థం చేసుకుంటుంది. రాజ్ కావ్య‌ను వ‌దిలేసి త‌ను ఇష్ట‌ప‌డిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల‌ని కోరుకుంటున్నాడ‌ని అర్థం చేసుకుంటుంది. అదే జ‌ర‌గాల‌ని ఆశ‌ప‌డుతుంది.

ఆ తర్వాత క‌ళ్యాణ్ చేతికి కంక‌ణం క‌డుతుంది కావ్య‌. నీపై ఏ చెడు దృష్టి ప‌డ‌కూడ‌ద‌ని క‌డుతున్నాన‌ని అంటుంది. మీరు ఉండ‌గా నాపై ఏ చెడు దృష్టిప‌డ‌ద‌ని క‌ళ్యాణ్ అంటాడు. మా పెళ్లి జ‌రిపిస్తార‌ని దేవుడి కంటే మిమ్మ‌ల్నే ఎక్కువ‌గా న‌మ్ముతున్నాన‌ని క‌ళ్యాణ్ చెప్తాడు. జాత‌కంలో దోషం అని పంతులు చెప్ప‌డంతో అనామిక నాకు ఎక్క‌డ దూరమ‌వుతుందోన‌ని భ‌య‌ప‌డ్డాన‌ని, కానీ అడ్డంకులు మొత్తం దూర‌మ‌య్యాన‌ని ఆనంద‌ప‌డ‌తాడు.

ఒక‌వేళ అనామిక దూర‌మైతే నా జీవితంలోకి మ‌రో అమ్మాయికి చోటు ఇవ్వ‌న‌ని, అనామిక జ్ఞాప‌కాల‌తోనే జీవితాంతం ఒంట‌రిగా ఉండిపోతాన‌ని అంటాడు కల్యాణ్. అది వింటున్న కనకం... అనామిక‌ను క‌ళ్యాణ్ ఎంత ఇష్ట‌ప‌డుతున్నాడో తెలిసిన త‌ర్వాత అత‌డి పెళ్లి ఆప‌డానికి ప్ర‌య‌త్నించి త‌ప్పు చేశాన‌ని ప‌శ్చాత్త‌ప‌ప‌డుతుంది. పెళ్లి ఆపితే అనామిక ఉసురు త‌న కూతురికి త‌గులుతుంద‌ని అనుకుంటుంది.

December 19th 2023 Episode number 283 in Brahmamudi Telugu Serial Nuvvu Nenu Prema Serial

క‌ళ్యాణ్ పెళ్లి ఏర్పాట్ల‌ను దుగ్గిరాల ఫ్యామిలీ మొద‌లుపెడుతుంది. పెళ్లికి విక్ర‌మాదిత్య‌ను పిల‌వాల‌ని క‌ళ్యాణ్‌కు చెబుతుంది ఇందిరాదేవి. విక్ర‌మాదిత్య‌కు కాల్ చేయాలని రాజ్ కు చెప్తుంది అపర్ణ. రాజ్ వీడియో కాల్ చేస్తాడు. ఎలా ఉన్నారు అంటూ ఇద్దరు పరామర్శించుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడుతారు. మ‌ధ్య‌లోకి కావ్య ఎంట్రీ ఇచ్చి రాజ్ భార్య‌ను తానే అని ప‌రిచ‌యం చేసుకుంటుంది. ఆ త‌ర్వాత క‌ళ్యాణ్ పెళ్లికి విక్ర‌మాదిత్య‌ను భార్య ప‌ద్మావ‌తితో క‌లిసి రావాల‌ని ఆహ్వానిస్తాడు రాజ్‌. దుగ్గిరాల ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో ప‌ద్మావ‌తి కూడా మాట్లాడుతుంది.

మరోవైపు క‌ళ్యాణ్ పెళ్లికి తాను రాలేన‌ని తండ్రితో అంటుంది అప్పు ఎంత‌ బ‌తిమిలాడిన విన‌దు. నువ్వు పెళ్లికి రానంటే క‌ళ్యాణ్ ఒప్పుకోడ‌ద‌ని అంటుంది. నువ్వు రాక‌పోతే మీ బంధం గురించి అంద‌రికి డౌట్ వ‌స్తుంద‌ని కృష్ణ‌మూర్తి అంటాడు. తండ్రి మాట‌ల‌తో క‌ళ్యాణ్ పెళ్లికి వెళ్లాల‌ని అప్పు ఫిక్స‌వుతుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్ లో కల్యాణ్ పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా.. పద్మావితి విక్కి వచ్చి సందడి చేస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X