Brahmamudi December 20th కుప్పకూలిన సీతారామయ్య... రాజ్‌కు గర్ల్ ఫ్రెండ్ ఉందేమోనని కావ్య డౌట్

ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో అనామిక, కల్యాణ్ పెళ్లి పనుల గురించి దుగ్గిరాల కుటుంబం మాట్లాడుతూ ఉంటుంది. మనతోనే పెళ్లికి కావాల్సినవి అన్నీ చేయించేలా ఉన్నారని రుద్రాణి సెటైర్ వేస్తుంది. అసలు వాళ్లు మన ఆస్తి చూసి సంబంధం కలుపుకుంటున్నట్లు అనిపిస్తుందని చెప్తుంది. నాకు ఈ పెళ్లి జరుగుతుందని అనిపించట్లేదని అంటుంది. నాకు కూడా అలాగే అనిపిస్తోంది మామ్ అని రాహుల్ అంటాడు. ఇక రాజ్ వచ్చి... మనిద్దరి పెళ్లి సరిగ్గా జరగలేదు. వీడిదైనా జరగని అని చెప్తాడు.

ఇలా ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్లు ఉండగా... కుప్పకూలిపోతాడు సీతారామయ్య. దీంతో ఇంట్లోని వారంతా ఏమైందని కంగారు పడుతుంటారు. అదోలా ఉందని సీతారామయ్య అంటాడు. దాంతో డాక్టర్‌ కి కాల్ చేస్తాడు రాజ్. ఇక డాక్టర్ వచ్చి సీతారామయ్యను డాక్టర్ చెక్ చేస్తుంటాడు. ఈ పెళ్లి ఆపేద్దాం, అనుకున్నప్పటి నుంచి ఏవేవో ఆటంకాలు వస్తున్నాయి, ఈ పెళ్లి వాయిదా వేద్దామని అనామిక వాళ్లకు చెప్పేస్తానని కల్యాణ్ అంటాడు.

December 20th 2023 Episode number 283 in Brahmamudi Telugu Serial Nuvvu Nenu Prema Serail

ఆవేషపడకు అని రాజ్, అపర్ణ చెబుతారు. లోపల సీతారామయ్యను డాక్టర్ చెక్ చేస్తుంటే.. ఇందిరాదేవి విసిగిస్తుంది. దీంతో బయటకు వెళ్లమని డాక్టర్ చెబుతాడు. పెళ్లి ఆపేద్దామని మళ్లీ కల్యాణ్ అంటే.. దోషం కోసం పరిహారం చేశాం కదా అని ఇందిరాదేవి అంటుంది. ఇప్పుడు మొక్క మార్చినట్లు చెబితే అంతా వదినను నిందిస్తారని కల్యాణ్ అనుకుంటాడు. సీతారామయ్యను హాస్పిటల్‌ లో చేరాలని డాక్టర్ చెబుతాడు. ఇప్పుడు జాతకాలు అని దుష్ప్రచారం చేస్తారు. ట్యాబ్లెట్స్ ఇవ్వండి అంతే అని సితారామయ్య అంటాడు.

నా వృత్తికి ఇది విరుద్ధం అండని చెప్తాడు డాక్టర్. అలా చేయలేనని అంటాడు. దీంతో బయటకు వచ్చిన డాక్టర్ సీతారామయ్యకు ప్రమాదం ఏం లేదని, నీరసం వల్ల అలా అయిందని చెప్తాడు. అంతకుమించి ప్రమాదం లేదని అంటాడు. సంతోషంగా పెళ్లి జరిపించండి అని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు. బావా నీకు ఏ సమస్య లేదు అని ఇందిరాదేవి సంతోషంగా అంటే.. మనవడి పెళ్లి ఆపేందుకు వీళ్లేదని సీతారామయ్య అంటాడు.

December 20th 2023 Episode number 283 in Brahmamudi Telugu Serial Nuvvu Nenu Prema Serail

మరోవైపు అనామిక పెళ్లి గురించి టెన్షన్ పడుతుంటారు ఆమె పెరెంట్స్. వాళ్లే పెళ్లి చేస్తామని చెప్పిన పెళ్లిలో అది ఇది తెమ్మంటే ఎక్కడి నుంచి తీసుకొస్తామని అనుకుంటారు. ఇంతలో సేట్ పేరాలాల్ కాల్ చేసి తన డబ్బు తనకు ఇవ్వాలని అడుగుతాడు. పెళ్లి అయ్యాకే ఇవ్వాలని వార్నింగ్ ఇస్తాడు. దీంతో ఎలాగైనా పెళ్లి జరగాలని అనుకుంటారు అనామిక తల్లిదండ్రులు. మరోవైపు విక్రమాదిత్యకు కాల్ చేసి కల్యాణ్ పెళ్లి గురించి గుర్తు చేస్తాడు రాజ్.

త్వరగా వచ్చేయమని రాజ్ అంటే.. అక్కకు చెప్పి వస్తానని అంటాడు. మరోవైపు రాజ్‌కు శ్వేత కాల్ చేసి కలవడం గురించి గుర్తు చేద్దామని చేసినట్లు చెబుతుంది. కానీ, మూడ్రోజులు ఇంట్లో ఉండము. పెళ్లి గ్రాండ్‌గా చేయాలని రిసార్ట్‌కు వెళ్తున్నామని రాజ్ అంటాడు. ఇంతలో కావ్య రావడంతో కంగారుపడతాడు రాజ్. రిసార్ట్ పేరు ఏంటని శ్వేత అడిగితే.. పక్కకు వెళ్తాడు రాజ్. దాంతో ఎక్కడికీ వెళ్తున్నారు. గర్ల్ ఫ్రెండా అని కావ్య అంటుంది. దాంతో , శ్వేత షాక్ అవుతారు.

December 20th 2023 Episode number 283 in Brahmamudi Telugu Serial Nuvvu Nenu Prema Serail

ఏయ్.. అదేంటి అని రాజ్ అంటే.. అలా సీక్రెట్‌గా వెళ్లడం ఎందుకు. ఎప్పుడు ఆఫీస్ పనే కదా. సరే గానీ ఏ సూట్ పెళ్లికి మంటారు అని చెప్పిన కావ్య.. మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పాలంటుంది. అలాగే చేయు అని రాజ్ అంటాడు. రిసార్ట్ పేరు చెప్పిన రాజ్ అక్కడ కలవడం వద్దంటాడు. తర్వాత కాల్ పెట్టేస్తాడు. మనం కూడా పెళ్లికి వెళ్లి రాజ్‌కు సర్‌ప్రైజ్ చేద్దామని శ్వేత అనుకుంటుంది. రిసార్ట్‌కు దుగ్గిరాల కుటుంబం, పద్మావతి, విక్రమాదిత్య వస్తారు. కల్యాణ్ పెళ్లి ధూం ధాం చేద్దామని రాజ్ అంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X