Brahmamudi December 28th:కల్యాణ్ మీద ప్రేమను బయటపెట్టిన అప్పు.. పెళ్లి ఆగిపోనుందా?
ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌లో దుగ్గిరాల ఇంట్లో కల్యాణ్, అనామిక పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే అరవిందకు గాజులు తొడుగుదామని రాజ్ చెప్తాడు. గుడ్ ఐడియా అని విక్రమాదిత్య కూడా చెప్తాడు. దాంతో అరవిందకు రాజ్, విక్రమాదిత్య, కల్యాణ్, ఆర్య గాజులు వేస్తారు. ఇక నుంచి నీకు నేను, కల్యాణ్ కూడా తమ్ముళ్లే. ఏ కష్టమొచ్చిన మేమున్నామని రాజ్ అరవిందతో చెప్తాడు.
బామ్మర్దులు ఎక్కువైపోయి శత్రువుల సంఖ్య పెరిగిపోతుందని మురళి మనసులో అనుకుంటాడు. ఇంతలో అనామిక మాత్రమే మీకు చెల్లెలా.... నేను, స్వప్న కూడా చెల్లెళ్లమ్మే కదా. మాకు కూడా గాజులు వేయండి అని కావ్య మురళికి షాక్ ఇస్తుంది. దాంతో సరేనని కావ్య, స్వప్నకు గాజులు వేస్తాడు మురళి. గాజులు వేసి వెళ్లబోతుంటే.. అన్నయ్య ఆగండి. ఇంకో ముఖ్యమైన చెల్లెలిని మరిచిపోతారా అని.. పద్మావతి కూడా చెల్లెలే కదా. గాజులు వేయండి అని కావ్య అంటుంది.

ఈ సందడిలో అది మర్చిపోయాను అని అరవింద చెప్తుంది. దాంతో పద్మావతి గాజులు వేయించుకునేందుకు చేయి చాపుతుంది. గాజులు వేసినట్లు వేసి కిందకు జారుస్తాడు మురళి. అతని చేయికి రక్తం రావడంతో ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొస్తానని చెప్పి తీసుకెళ్తుంది అరవింద. చూశావా వాడి నిజ స్వరూపం అని పద్దు అంటే.. ఈ పెళ్లి అయ్యేలోపు అందరికీ తెలుస్తుంది అని కావ్య అంటుంది.
మరోవైపు కల్యాణ్ కోసం బంతి వస్తాడు. మొత్తానికి కల్యాణ్ రూమ్ కనిపిస్తుంది. లోపలికి వెళ్లి బంతి మాట్లాడటం చూసిన అప్పు.. వీడు అసలు విషయం చెబుతాడేమో అని కంగారుపడుతుంది. ఈ పెళ్లి నీకు ఇష్టమేనా అని కళ్యాణ్ ను బంతి అడుగుతాడు. ఇష్టం లేకుండా ఎందుకు చేసుకుంటానని అంటాడు. కానీ, అప్పు అక్కకు అని బంతి అంటుండంగా.. అప్పు వచ్చి ఆపుతుంది. కల్యాణ్ తో మాట్లాడనివ్వకుండా బంతిని అప్పు తీసుకుపోతుంది.
మరోవైపు అంతా మొబైల్స్‌లో మాట్లాడుకుంటూ ఉండటం చూసి ఇందిరాదేవి ఫైర్ అవుతుంది. ఫోన్స్ అన్ని తీసుకుని ఒక ట్రేలో పెట్టమని తాను చెప్పేవరకు ఎవరికీ ఇవ్వొద్దంటుంది. అందాక కాబోయే భార్యాభర్తలకు చెరొకరు సలాహాలు ఇవ్వాలని అంటుంది. అంతా కలిసి కూర్చుంటారు. ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇస్తారు. రాజ్ మాత్రం ప్రేమ పుడితే ఆగదంటూ తన గర్ల్ ఫ్రెండ్ గురించి ఇన్ డైరెక్ట్‌గా చెబుతాడు. అది అపర్ణకు అర్థం అవుతుంది.
తర్వాత అప్పును చెప్పమంటారు. కృష్ణుడికి జీవితం అంకితం ఇచ్చినవారంటే ఇష్టం. అలా రాధ తన ప్రేమను అంకితం ఇచ్చింది కాబట్టే రాధాకృష్ణులు అని చెప్పుకుంటారు. అనామిక కూడా కల్యాణ్‌కు అంకింతం ఇవ్వాలని చెబుతుంది అప్పు. దాంతో అంతా చప్పట్లు కొడతారు. అప్పు కూడా ఇలా మాట్లాడుతుందని నాకు ఇప్పుడే తెలిసిందని కల్యాణ్ అంటాడు. అనంతరం అప్పు వెళ్లి ఒంటరిగా బాధపడుతుంది.
అప్పు దగ్గరకు పద్దు వచ్చి ఎవరు ఆ అబ్బాయి అని అడుగుతుంది. ఎవరు లేరు అని అప్పు కవర్ చేస్తుంది. మరోవైపు రాజ్, విక్కీకి స్నాక్స్ తీసుకొస్తారు కావ్య, పద్దు. అప్పు గురించి మాట్లాడుకుంటారు. ఇలా మాట్లాడుతుందని అస్సలు అనుకోలేదని కావ్య అంటే.. నాకు తేడా కొడుతుందని పద్దు అంటుంది. ఇంతలో అరవిందకు పొలమారడంతో నీళ్లు తెస్తానని విక్కీ వెళ్తాడు.

ఇంతలో అక్కడ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాని చెప్పి కిస్ చేయబోతుంటాడు మురళి. దాంతో కోపంగా ఊగిపోయిన విక్కీ నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ది రాదా రాస్కెల్ అని మురళి కాలర్ పట్టుకుని గట్టిగా అరుస్తాడు విక్కీ. దాంతో అంతా అక్కడికి వస్తారు. ఇదే కరెక్ట్ టైమ్ అని చూడు రాణమ్మా నేను ఏం చేయకున్నా ఇలా కాలర్ పట్టుకున్నాడని మురళి అంటాడు.
దాంతో మరింత కోపంగా నువ్ ఏం చేయలేదా అని మళ్లీ కాలర్ పట్టుకుంటాడు విక్కీ. దాంతో విక్కీని కొడుతుంది అరవింద. అందరిముందే నా భర్తను కాలర్ పట్టుకునే అవసరం ఏమొచ్చింది చెప్పు అని అడిగితే విక్కీ సైలెంట్‌గా ఉంటాడు. నేను కేసు విషయమై రిలేటివ్ అమ్మాయితో క్లోజ్‌గా ఉంటే అది అపార్థం చేసుకున్నాడని మురళి అంటాడు. నా భర్తనే అనుమానిస్తావా. అతను శ్రీరామచంద్రుడురా అని అరవింద అంటుంది. పోనిలే వదిలేయమని మురళి అంటాడు.
తర్వాతి ఎపిసోడ్‌లో సంగీత్ వేడుకలో అనామికతో కల్యాణ్ డ్యాన్స్ చేస్తుంటే చాలు అని అప్పు అంటుంది. వెళ్లి కల్యాణ్‌ను హగ్ చేసుకుంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు.తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే.. నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి.


Click it and Unblock the Notifications










