Brahmamudi December 29th: సంగీత్‌లో ఊహించని మలుపు... అందరి ముందు కళ్యాణ్‌కు ఐ లవ్ యూ చెప్పేసిన అప్పు

బ్రహ్మముడి సీరియల్, నువ్వు నేను ప్రేమ సీరియల్ మహా ఎపిసోడ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కల్యాణ్, అనామిక పెళ్లి కోసం... రెండు సీరియల్స్ కలిశాయి. అయితే ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో ... మురళి కాలర్ పట్టుకున్న విక్కీని పద్మవతి కొట్టడంతో.. అటు అక్కా, ఇటు తమ్ముడు బాధపడుతూ కూర్చుంటారు. ఇక విక్కితో రాజ్ మాట్లాడి.. అక్కకు సారీ చెప్పమని చెప్తాడు. మరోవైపు రాణమ్మాతో కావ్య, పద్దులు మాట్లాడి.. తమ్ముడితో మాట్లాడమని చెప్తారు.

ఇక అక్క కోసం విక్కీ వచ్చి సారీ చెప్తాడు. ఇక వారిద్దరు అలా కలిసిపోతారు. ఇక ఈ సీరియల్ లో కల్యాణ్, అనామిక పెళ్లి కోసం.. సంగీత్ ఏర్పాటు చేశారు. ఈ సంగీత్ ల ఇక కళావతి ఒకవైపు.. పద్మావతి ఒకవైపు మైక్ అందుకుని.. డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. రాజ్, విక్కీ ఇద్దరూ ఒక చోటే కూర్చుని.. భార్యలపై సెటైర్స్ వేస్తుంటారు. ఇక ఇదిలా ఉండగా... కావ్యతో స్వప్న వచ్చి.. పద్మవతికి హెల్ప్ చేద్దామని ఓ సలహా ఇస్తుంది.

December 29th 2023 Episode number 291 in Brahmamudi Telugu Serial Nuvvu Nenu Prema Serail

తన దగ్గర ట్రూస్ సిరప్ ఉందని... అది మురళి చేత తాగించి... అసలు విషయం బయటపెడుదామని చెప్తుంది. దానికి కావ్య ఓకే అంటుంది. స్వప్న అనుకున్నట్లుగానే ఓ జ్యూస్ లో ఆ సిరప్ కలుపుతుంది. ఇక మురళికి ఇస్తే తాగేస్తాడు. ఈ విషయాన్ని కావ్య, స్వప్నలు... పద్మవతికి చెప్తారు.'అలా ఎందుకు చేశారు.. వాడు నిజం చెబితే.. అరుందతి వదిన ప్రాణాలకే ప్రమాదమని చెప్తుంది పద్దు. వీళ్లు కంగారు పడుతుంటే.. మురళీ స్టేజ్ మీదకు వచ్చి.. రాణమ్మా నన్ను క్షమించు అంటూ అరుస్తాడు.

కావ్య, స్వప్న, పద్మావతి కంగారు పడుతూ ఉంటారు. రాణమ్మ కంగారుగా.. 'ఏంటంది ఏం అయ్యింది మీకు?' అంటూ దగ్గరకు వెళ్లి ఆరా తీస్తూ ఉంటుంది. ఇక నేను నిన్ను మోసం చేశాను.. అని చెప్తాడు. పద్మావతిని ప్రేమించిన విషయం చెప్పేస్తున్నాడేమో అని కంగారుపడుతుంది పద్మావతి. పార్టీలో మందు తాగేశాను. ఎవరో కావాలనే జ్యూసులో నాకు మందు కలిపి ఇచ్చేశారు.. అంటూ చెప్తాడు. సరేలే రండి అని భర్తని స్టేజ్ కిందకు తీసుకుని వెళ్తుంది.

వెళ్తూ వెళ్తూ స్వప్న, కావ్య, పద్మావతీలను చూసి నవ్వుతాడు. 'వాడు మనల్ని ఫూల్‌ని చేశాడు.. ఆ ట్రూత్ సిరప్ వాడు తాగలేదు' అని గుర్తిస్తారు పద్మావతి, కావ్యలు. ఇక ఆ తర్వాత స్టేజీ మీద కపుల్స్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కల్యాణ్ అనామిక డ్సాన్స్ చేయడానికి వెళ్తుండగా..కల్యాణ్ అప్పును రమ్మని అడుగుతాడు. నేనురాను అనిచెప్తుంది. ఇక పద్మవతి.. అప్పు మనసులో ఎవరు ఉన్నారో చెప్పించాలి అనుకుంటుంది.

December 29th 2023 Episode number 291 in Brahmamudi Telugu Serial Nuvvu Nenu Prema Serail

స్వప్న దగ్గరున్న ట్రూత్ సిరప్ అందుకుని.. జ్యూసులో కలిపి అప్పూతో బలవంతంగా తాగిస్తుంది. కల్యాణ్ అనామిక డ్యాన్స్ చేస్తుండగా.. అప్పు వచ్చి అపుర్రి అంటుంది. కనకం, కృష్ణమూర్తి షాక్ అవుతారు. అనామిక, కళ్యాణ్‌ల డాన్స్ ఆగిపోతుంది. అప్పూ ఊగుతూ స్టేజ్ మీదకు వెళ్లి.. అనామికను పక్కకు తోసి.. పాట మార్చండ్రా బయ్ అంటుంది. చిన్నదోవైపు పెద్దదో వైపు సాంగ్ ప్లే అవుతుంటే.. అప్పూ కళ్యాణ్‌ని పట్టుకుని డాన్స్ చేస్తూ ఉంటుంది.

కళ్యాణ్.. అనామికను కూడా రా అని పిలవడంతో.. అనామిక కూడా కళ్యాణ్‌కి మరోవైపు డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. కళ్యాణ్‌తో అనామిక, అప్పూ ఇద్దరూ డాన్స్ చేస్తూ ఉంటారు. అయితే అప్పూ అలా స్టేజ్ మీదకు వెళ్లడం.. చూసి.. కనకానికి అనుమానం వస్తుంది. అప్పును ఏం చెప్పి ఒప్పించావ్ అమ్మా అని కనకం... పద్మావతిని అడుగుతుంది. అంటే అప్పు మనసులో ఎవరు ఉన్నారో తెలుసుకుందామని ట్రూత్ సిరప్‌ని జ్యూసులో కలిపి అప్పూకి ఇచ్చానని చెప్తుంది.

అయ్యో ఎంత పని చేశావమ్మా? అప్పూ మనసులో ఉన్నది కళ్యాణ్ బాబే' అంటుంది కనకం కంగారుగా. మరోవైపు ఐ లవ్యూ కళ్యాణ్.. అని అప్పు.. కల్యాణ్ కు చెప్తుంది. పాట ఆగిపోతుంది. అనామిక షాక్ అయిపోతుంది. కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. శైలు, సుబ్బూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పూ అలా కళ్యాణ్‌ని హగ్ చేసుకోవడం చూసి.. అంతా షాక్ అయ్యి పైకి లేస్తారు. రాహుల్.. రుద్రాణిలు షాక్ అవుతూ ఒకరిని ఒకరు చూసుకుంటారు.

అంతా షాక్‌లోనే ఉంటారు. మరి పద్మావతి ఏమని కవర్ చేస్తుందో.. కనకం, పద్మావతి కలసి.. ఆ గొడవను ఎలా ఆపుతారో చూడాలి. ఇక తదుపరి ఎపిసోడ్ లో బంతి అప్పుప్రేమ గురించి లెటర్ రాసి.. కల్యాణ్ రూంలో పెడతాడు. ఏం జరగనుందో చూడాలి ఇగ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X