Brahmamudi December 30th: అప్పు ప్రేమను బయటపెట్టిన బంతి... కల్యాణ్ పెళ్లి క్యాన్సిల్?

ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో అనామిక, కల్యాణ్ సంగీత్ జరుగుతుండగా.. అందరూ డ్యాన్స్ చేస్తారు. ఇక ఈ డ్యాన్స్ లో భాగంగా అప్పు మత్తులో కల్యాణ్ ను హగ్ చేసుకుని ఐ లవ్ యూ అని చెప్తుంది. ఇది విన్న అనామిక తల్లి... నా అల్లుడికి ఐ లవ్యూ చెప్తావా అంటూ గొడవపడుతుంది. ఇక కల్యాణ్.. మీరంతా ఏ కాలంలో ఉన్నారు... అప్పు నాకు రాజ్ అన్నయ్య పెళ్లి అయినప్పటి నుంచి ఫ్రెండ్. ఈ మధ్య ఐ లవ్యూ చెప్పడం చాలా కామన్. తల్లికి కూతురు, తండ్రికి కొడుకు చెబుతున్నాడు. అనామిక మన ప్రేమకు అప్పు ఎంత హెల్ప్ చేసిందో నీకు తెలుసుగా. నన్ను ప్రేమిస్తే.. అలా చేస్తదా అని కల్యాణ్ చెప్పుకువస్తాడు.

సంగీత్ తర్వాత పెళ్లి మండపంలో పెళ్లి మొదలవుతుంది. ఇక పెళ్లి జరుగుతుంటే.. కనకాన్ని స్వప్న బయటికి తీసుకొస్తుంది. ఆ అరుణ్ గాడిని... పెళ్లి మండపం దగ్గర్లో ఉన్న స్టోర్ రూమ్‌లోకి మారుద్దామని సలహా ఇస్తుంది. లేదంటే మధ్యలో పారిపోతాడేమో.. వాడ్ని కట్టి పడేసిన రూమ్.. పెళ్లి మండపానికి చాలా దూరం కదా.. పారిపోయే అవకాశం ఉంటుంది' అంటుందని చెప్తుంది. వీరి మాటలను మురళి వింటాడు. కనకం అరుణ్‌ని ఆ స్టోర్ రూమ్ నుంచి పెళ్లి మండపం స్టోర్ రూమ్‌కి మార్చడానికి సాయం చేస్తుంది. అయితే మురళీ తమని ఫాలో అవుతున్న సంగతి వాళ్లకు తెలియదు.

December 30th 2023 Episode number 292 in Brahmamudi Telugu Serial Nuvvu Nenu Prema Serail

మరోవైపు తాగుబోతు అరుణ్‌ని మోసుకుని వెళ్తున్న కనకం, స్వప్నలను చూసి.. ఇది చాలా ఆసక్తిగా ఉందని వీడియో తీస్తాడు. ఇక అరుణ్ ను కట్టిపడేసి... వెళ్లిపోతారు. ఇక మురళి ఈ విషయాన్ని రుద్రాణికి చెప్తాడు. ఇక అరుణ్‌ని బందించిన రూమ్‌కి.. రుద్రాణి, రాహుల్, మురళీ వస్తారు. అయితే ఆ తాగుబోతు మాత్రం వీడియో తీస్తూనే ఉంటాడు. అరుణ్ ను లేపి... నీ వల్ల ప్లాన్ మొత్తం పాడయిందని అంటుంది. తనను కావ్య వాళ్లు కిడ్నాప్ చేసినట్లు అరుణ్ చెప్తాడు.

ఇక రుద్రాణి.. ఆ తాగుబోతు వీడియో తీయడం చూస్తుంది. రాహుల్ పరుగున వెళ్లి... ఆ తాగుబోతుని ఆ గదిలోకి లాక్కొస్తాడు. ఫోన్ లాక్కుని మన వీడియో డిలెట్ చెయ్ అంటుంది రుద్రాణి. ఇక వీడియో డిలెట్ చేద్దామని చూస్తే.. కనకం వాళ్ల వీడియో కనిపిస్తుంది రాహుల్‌కి. మామ్ ఇది మనకు యూజ్ అయ్యేలా ఉంది అంటాడు రాహుల్. ఆ వీడియోలో కనకం, స్వప్న ఇద్దరూ అరుణ్‌ని తీసుకొచ్చి కట్టేయడం కనిపిస్తూ ఉంటుంది.

ఇది చాలు.. ఈ పెళ్లి ఆపడానికి.. ఆ స్వప్నను నా కోడలు కాదని గెంటేయడానికి పదా.. అంటూ ఆ తాగుబోతుకి డబ్బులు చేతిలోపెట్టి.. ఆ వీడియో తీసుకుని పెళ్లి మండపానికి వస్తారు. స్వప్నను, కనకాన్ని మాటలు అనేస్తూ.. ఆ తాగుబోతు తీసిన వీడియోని అందరికీ చూపిస్తుంది రుద్రాణి. పెళ్లి ఆగుతుంది. రచ్చ మొదలవుతుంది. 'నాది ఏ తప్పు లేదు.. అరుణ్‌దే తప్పు' అంటుంది స్వప్న. కనకం కూడా అదే మాట మాట్లాడుతుంది.

రుద్రాణి.. సాక్ష్యంగా వీడియో చూపించడంతో.. కనకం, స్వప్నలు ఎంత చెప్పినా చెల్లకుండా పోతుంది. ఇక ఈ లోపు.. అరుణ్ పారిపోతూ పద్మావతి కంట పడతాడు. పద్మావతి.. అరుణ్‌ని అక్కడికి లాక్కొస్తుంది. ఇక విక్కీ కోపంగా, ఆవేశంగా వెళ్లి అరుణ్ చెంపలు వాయిస్తాడు. 'రేయ్ ఒక ఆడపిల్ల మీద నిందలు వేసి.. పారిపోతావ్‌రా' అంటూ కొడతాడు. ఇంతలో రాజ్.. కూడా ఆవేశంగా మండపం దిగి అరుణ్ దగ్గరకు వస్తాడు. రాజ్ కూడా అరుణ్‌ని కొడతాడు. ఒకవైపు విక్రమ్, మరోవైపు రాజ్.. అరుణ్‌ని కొట్టడంతో.. నేను నిజం చెబుతాను సార్ అంటాడు అరుణ్.

అరుణ్... తనపై నేరం వేసుకుని... రుద్రాణి, రాహుల్ ను సేవ్ చేస్తాడు. అరుణ్ తప్పు మొత్తం తన మీద వేసుకుని చెబుతాడో ఊపిరిపీల్చుకుంటారు రాహుల్, రుద్రాణి. అయితే అరుణ్ నిజం చెప్పగానే.. స్వప్న ఆవేశంగా.. 'రాజ్.. వీడ్ని లాగి ఓ చెంప దెబ్బ కొట్టాలని ఉంది' అంటుంది. నీ ఇష్టమొచ్చింది చేసుకో అంటాడు రాజ్ కోపంగా అరుణ్‌ని స్వప్న వైపు తోస్తూ. వెంటనే స్వప్న.. అరుణ్‌ని కోపంగా రుద్రాణి, రాహుల్‌ల ముందుకు తీసుకుని వెళ్తుంది.

లాగిపెట్టి కొట్టేందుకు అరుణ్ మీదకు చేయి ఎత్తి.. రాహుల్ చెంప పగలగొడుతుంది కావాలనే. స్వప్న కొట్టడంలో తప్పు లేదని ఇందిరా దేవీ వాళ్లు తీర్పు ఇవ్వడంతో.. రాహుల్, రుద్రాణీలు రగిలిపోతారు. ఇప్పటికైనా నిజం చెప్పాడు కాబట్టి అరుణ్‌ని వదిలేయమని సీతారామయ్య అనడంతో.. ఆ గొడవ అక్కడితో ఆగిపోతుంది. పెళ్లి తంతు మొదలవుతుంది. ఇక తర్వాతి ఎపిసోడ్ లో బంతి రాసిన లెటర్... ధాన్యలక్ష్మి చదువుతుంది. అప్పు.. కల్యాణ్ ను ప్రేమించినట్లు ఒప్పుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X