Brahmamudi: ఎట్టకేలకు అనామికను పెళ్లి చేసుకున్న కల్యాణ్... మరి అప్పు పరిస్థితి ఏంటో?

బ్రహ్మముడి, నువ్వునేను ప్రేమ సీరియల్స్... కల్యాణ్, అనామిక పెళ్లి కోసం ఒక్కటైయ్యాయి. ఇక రెండు సీరియల్స్ సంగామాన్ని మెగా ఎపిసోడ్ గా గత రెండు వారాలుగా ప్రసారం చేస్తున్నారు. ఇక ఈ పెళ్లి జరగడంతో.. ఈవారంతో నువ్వునేను ప్రేమ సీరియల్, బ్రహ్మముడి సీరియల్ సంగమానికి బ్రేక్ పడినట్లే అయింది. ఇక సీరియల్ విషయానికి వస్తే... అప్పు ప్రేమను బయటపెట్టేందుకు బంతి ఓ లెటర్ రాసి.. కల్యాణ్ రూమ్ లో పెడతాడు. ఆ తర్వాత కనకానికి నేను తప్పు చేశాను అని బంతి అసలు విషయం చెప్తాడు.

అక్కడే ఉన్న కావ్య, పద్మవతిలు ఈ విషయాన్ని విని... షాక్ అవుతారు. అప్పు.. కల్యాణ్ ను ప్రేమిస్తుందని తెలుసుకుంటుంది కావ్య. కల్యాణ్ ఆ లెటర్ చదవొద్దు అని.. వెంటనే అందరూ కల్యాణ్ గదికి వెళ్తారు. అక్కడ అప్పు.. కల్యాణ్ ను ముస్తాబు చేస్తూ ఉంటుంది. ఇక కల్యాణ్ కు తెలియకుండా.. ఆ లెటర్ ను కావ్య తీసుకుంటుంది. ఇక ధాన్యలక్ష్మ వచ్చి కల్యాణ్ ను తీసుకువెళ్తుంది. కల్యాణ్ వెళ్లగానే కావ్య.. అప్పును హగ్ చేసుకుని.. ఎంత బాధను మోస్తున్నావే అంటూ ఓదార్చుతుంది.

December 31st 2023 Episode number 293 in Brahmamudi Telugu Serial Nuvvu Nenu Prema Serial

ఇక గోడ చాటుగా రుద్రాణి వారి మాటలను విని.. కల్యాణ్ ను అప్పు ప్రేమిస్తుందని తెలుసుకుంటుంది. ఈ విషయం నేను చెబితే ఎవరు నమ్మరు అని అనుకుంటుంది. ఇక కావ్య ఆ లెటర్ ను కిటికిలోంచి పడేస్తే... అది రుద్రాణికి దొరుకుతుంది. ఇది కదా అసలైన అవకాశం అని అనుకుంటుంది. వెంటనే దీన్ని బయటపెట్టాలని ప్లాన్ వేస్తుంది. అప్పు వాళ్లంతా.. పెళ్లి మండపానికి వెళ్లిపోతారు.

మరోవైపు అనామికను పెళ్లి మండపానికి తీసుకువస్తుంటే.. వాళ్ల పేరెంట్స్ కు అప్పు ఇచ్చిన సేట్ వస్తాడు. డబ్బులు ఇచ్చే వరకు కూడా పంపించను అని చెప్తాడు. ఇంతలో కావ్య చూసి.. రాజ్ కు చెప్తుంది. రాజ్ వెళ్లి ఏమైందని అడుగుతాడు. వాళ్లు నాకు రెండు కోట్లు ఇవ్వాలని సేటు రాజ్ కు చెప్తాడు. నేను ఇస్తాను అంటూ రాజ్ మాటిస్తాడు. ఇక సుబ్రమణ్యం అతని భార్య డ్రామా మొదలు పెట్టి.. రాజ్ కు థ్యాంక్స్ చెప్తారు. ఇక రాజ్ కావ్య వెళ్లాక... మనం వేసిన ప్లాన్ సక్సెస్ అని సంబురపడిపోతాుడ.

ఇక రుద్రాణికి దొరికిన ఆ లెటర్ ను ధాన్యలక్ష్మికి చూపించి రెచ్చగొడుతుంది. ఈ పెళ్లి ఆపడానికి కనకం ప్రయత్నిస్తుంది.. నువ్వే అడుగు అందరి ముందు అని రెచ్చగొట్టి పంపిస్తుంది. ధాన్య లక్ష్మి.. కల్యాణ మండపానికి వెళ్లి అప్పును నిలదీస్తుంది. మా కల్యాణ్ ను ప్రేమిస్తున్నావా అంటూ ఫైర్ అవుతుంది. మీ కుటుంబమే ఇలాంటిది అంటూ నోరు జారుతుంది. ఇప్పటికే ఇద్దరు కూతుళ్లను పంపించారు.. ఇప్పుడు మరో కూతురిని పంపించడానికి ప్లాన్ వేశారు అని ఫైర్ అవుతుంది.

ఇక అప్పు.. నేను ఒక్కదాన్నే ప్రేమించాను.. దానిలో తప్పేం ఉంది.. నేను ఆడపిల్లనే.. కల్యాణ్ ప్రేమించలేదు అని చెప్తుంది. ఇక కావ్య.. బంతి చేసిన పని గురించి చెప్తుంది.. అందరూ గొడవపడుతుండటంతో కల్యాణ్ లేచి.. దానిలో అప్పు తప్పేం లేదు.. నేనే చనువుగా మెలిగాను.. అందుకే అప్పుకు అలా అనిపించవచ్చు అని చెప్తాడు. దీంతో ఇందిరాదేవి కూడా ఇక్కడితో గొడవ ఆపండి అని చెప్తుంది. ఇక అప్పు, కనకం, మూర్తి వెళ్లిపోతారు. కల్యాణ్, అనామిక పెళ్లి జరుగుతుంది. పెళ్లి తర్వాత నువ్వు నేను ప్రేమ సీరియల్ ఆర్టిస్టులకు వీళ్లు వీడ్కోలు పలుకుతారు. అలా రెండు సీరియల్స్ మెగా ఎపిసోడ్ ఈ వారంతో ముగిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X