అర్చన కోతలే కోతలు.. షాక్‌లో ఆదర్శ్.. బిగ్‌బాస్‌ ఇంట్లో దీక్షా, కార్తీక, మహేష్ కత్తి..

బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో ఫైనల్‌కు మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. అనేక సర్‌ప్రైజ్‌లకు చోటుండే బిగ్‌బాస్‌లో 68 రోజు అనేక ట్విస్టులు కనిపించాయి.

By Rajababu

Recommended Video

Bigg Boss Telugu Day 68 : Archana Overaction అర్చన కోతలే కోతలు.. షాక్‌లో ఆదర్శ్..

బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో ఫైనల్‌కు మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. అనేక సర్‌ప్రైజ్‌లకు చోటుండే బిగ్‌బాస్‌లో 68 రోజు అనేక ట్విస్టులు కనిపించాయి. ఫైనల్‌కు చేరిన ఐదుగురు కొత్త లుక్‌తో అందంగా కనిపించారు. ఫైనల్‌ రోజు కోసం వెయిట్ చేస్తున్న సభ్యులు ఉత్సాహంగా కనిపించారు. ఈ ఎపిసోడ్‌లో అర్చన కోసిన కోతలు ఆదర్శ్‌తోపాటు ప్రేక్షకులను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి. అవేమింటంటే..

అలా కలలు వచ్చేవి..

అలా కలలు వచ్చేవి..

నాకు బిగ్‌బాస్ ఆఫర్ రాకముందే ఈ రియాల్టీ షోలో పాల్గొన్నట్టు కలలు వచ్చేవి. బిగ్‌బాస్ ఆఫర్ వచ్చినట్టు, కార్యక్రమంలో పాల్గొన్టట్టు కలల్లో కనిపించేవి. అలాగే బిగ్‌బాస్ హౌస్‌లో తిరిగినట్టుగా కలలు వచ్చేవి అని అర్చన పేర్కొన్నారు.

 కోతలకు షాకైన ఆదర్శ్

కోతలకు షాకైన ఆదర్శ్

అంతేకాకుండా బిగ్‌బాస్‌లో ప్రిన్స్, సమీర్ పాల్గొన్నట్టు కూడా కలలో కనిపించాయి. బిగ్‌బాస్‌కు ముందు ప్రిన్స్, సమీర్ ఎవరో తెలియదు. అయినా నాకు వారు కలలో కనిపించారు అని అర్చన కోతలు కోసింది. అర్చన ఈ విషయాలను చెప్తున్నపుడు ఆదర్శ్, శివబాలాజీ ఆశ్చర్యానికి లోనయ్యారు. అర్చన మాటలకు ఆదర్శ్ ముసిముసిగా నవ్వుకోవడం కనిపించింది.

బిగ్‌బాంబ్ క్లోజ్

బిగ్‌బాంబ్ క్లోజ్

బిగ్ బాస్ హౌస్ నుంచి దీక్షా పంత్ వెళ్లిపోతున్నప్పుడు విసిరిన బిగ్‌బాంబ్ టాస్క్ శుక్రవారం కూడా కొనసాగింది. నాలుగో ఎక్కాన్ని రివర్స్‌లో చదువుతూ కనిపించారు. అలాగే దీక్షను ఆటపట్టిస్తూ హావభావాలు ప్రదర్శించారు. అలాగే బిగ్‌బాంబ్ టాస్క్ గురువారం ముగిసినట్టు బిగ్ బాస్ ప్రకటించారు.

దీక్షా రీ ఎంట్రీ

దీక్షా రీ ఎంట్రీ

68వ రోజు ఎపిసోడ్ కొనసాగుతుండగా, సడెన్‌గా దీక్షాపంత్ బిగ్‌బాస్ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. దీక్షాను చూడగానే అందరూ సభ్యులు షాక్ గురయ్యారు. ప్రధానంగా దీక్షాను చూసిన అర్చన అసహనానికి గురైంది. దీక్షాతో మాట్లాడానికి ఇష్టపడలేదు.

శివ.. నీవే విజేతవు..

శివ.. నీవే విజేతవు..

ఇంట్లోకి మరోసారి వచ్చిన దీక్షా.. శివబాలాజీతో మాటల్లో మునిగిపోయింది. నీవే బిగ్‌బాస్ టైటిల్ రేసులో ఉన్నావు అని శివబాలాజీతో దీక్షా చెప్పడం కనిపించింది. తాను కూడా పలు ఇంటర్వ్యూలలో నీ పేరు, ఆదర్శ్ పేర్లను చెప్పానని అతడికి దీక్ష వెల్లడించింది.

అరుంధతిలా కత్తి కార్తీక

అరుంధతిలా కత్తి కార్తీక

దీక్షా తర్వాత కత్తి కార్తీక బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించింది. చీరకట్టు, నగలు ధరించి అరుంధతి స్టయిల్లో కార్తీక ఎంట్రీ ఇచ్చింది. బతుకమ్మ సెలబ్రేషన్ కొనసాగుతున్నాయని, అందుకే ఈ డ్రస్‌లో వచ్చాను అని తెలపడం గమనార్హం. ఆదర్శ్‌తో అన్నా అంటూ కార్తీక చనువుగా వ్యవహరించింది. ఇంటి బయట విషయాలను ఆసక్తిగా ఆదర్శ్‌కు కార్తీక వివరించింది.

మన రిలేషన్ అదుర్స్

మన రిలేషన్ అదుర్స్

బిగ్‌బాస్ హౌస్‌లో మన ఇద్దరి రిలేషన్‌ను గొప్పగా చెప్పుకొంటున్నారని ఆదర్శ్‌కు కార్తీక వివరించింది. తాను ఎలిమినేట్ అయి వెళ్తున్నప్పడు కంటతడి పెట్టుకోవడం చూసి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు అని చెప్పింది. వారిద్దరి మధ్య సంభాషణ ఆసక్తిగా సాగింది.

జ్యోతి, మధుప్రియ, మహేష్..

జ్యోతి, మధుప్రియ, మహేష్..

దీక్షా, కార్తీక తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లోకి మధుప్రియ, జ్యోతి, మహేశ్ కత్తి ఎంట్రీ ఇచ్చారు. వీరిని చూసి ట్రిపుల్ ధమాకా అంటూ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. మధుప్రియ బయట విషయాలను గుక్క తిప్పుకోకుండా చెప్పింది. తాను స్వయంగా ఇంటిని నుంచి బయటకు పోవడం తప్పేనని మధుప్రియ చెప్పింది. అలాగే బిగ్‌బాస్ తెలుగు ఎంత హిట్ అయిందో అనే విషయాన్ని ఇంటి సభ్యులకు మహేశ్ వివరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X