నిన్ను బూడిద చేస్తా.. నేను చస్తే నా మొగుడ్ని కట్టు కుంటావా? మోనితపై వంటలక్క ఫైర్
తెలుగు బుల్లితెర మీద జనరంజకంగా సాగుతున్న కార్తీక దీపం సీరియల్ భారీగా అనేక మలుపులతో సాగుతున్నది. విజయనగరంలో ఇడ్లీ బండి నడుపుతున్న దీపను గుర్తించి ఇంటికి తీసుకొచ్చిన డాక్టర్ కార్తీక్‌కు తన భార్యకు తీవ్ర అనారోగ్యం చేసిందనే విషయం తెలిసింది. దీప వంటకు దూరంగా ఉండాలని డాక్టర్ చెప్పిన విషయంతో కార్తీక్ ఆమెను వంటగదికి దూరంగా ఉంచాలని నిర్ణయించారు. కార్తీక్ నిర్ణయం నచ్చకపోవడంతో దీప అసంతృప్తితో తన పాతగూటికి చేరి వంటలక్కగా మారింది. ఈ క్రమంలో 1037 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

వంటలక్కగా మారిన దీప
దీప.. తన కస్టమర్ల కోసం వంటలు చేయడం మొదలుపెట్టింది. అయితే పొయ్యి వద్ద పొగకు తట్టుకోలేక దగ్గుతో బాధపడుతూ కనిపించింది. అయితే తనలోనే తాను నవ్వకుంటూ మళ్లీ వంటలక్కగా మారడం ఆశ్చర్యంగా అనిపిస్తుందని పనిమనిషి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

వంటింటి మహరాణిలా ఉండాలని
మా అత్తగారి ఇంటిలో పిల్లలకు, అందరికి పనిమనిషే వంట చేస్తుంది. నేను కేవలం బొమ్మలా ఉండాలి. అత్త, మామలకు, భర్తకు వడ్డించకూడదు. పెళ్లాంలా ఉండకూడదు.. వడ్డించకూడదు. ఎవరైనా అత్తింటి వాళ్లకు సేవల చేయాలి.. వంటింటి మహరాణిగా మారాలని అనుకొంటారు. కానీ ఆ ఇంట్లో నాకు అలాంటి పరిస్థితి లేదు. ఆ ఇంట్లో మహారాణి అనేది పేరుకు మాత్రమే అంటూ కామెంట్ చేస్తున్న సమయంలో అక్కడకు డాక్టర్ మోనిత, డాక్టర్ కార్తీక్ వచ్చారు.

దీప వద్దకు కార్తీక్, మోనిత
డాక్టర్ బాబు వచ్చారంటూ పనిమనిషి దీపకు చెప్పింది. అయితే డాక్టర్ కార్తీక్, డాక్టర్ మోనిత రావడాన్ని చూసి పట్టించుకోకుండా.. పనిమనిషితో ఏం కావాలో వారి వద్ద నుంచి ఆర్డర్ తీసుకోమని చెప్పింది. తన వద్దకు కార్తీక్ వచ్చినా పట్టించుకోకుండా దగ్గుతూనే ఉంది.

మోనిత నిన్ను బూడిత చేస్తా అంటూ
అయితే పనిచేసుకొంటున్న దీపను మోనిత పలకరించింది. దీప అనగానే.. పొయిలో నుంచి మండుతున్న కట్టెను తీసి.. బూడిద చేసి పడేస్తాను అంటూ తిట్టిపోసింది. ఇంకేం చూడటానికి వచ్చావు. అసలు నీవల్లే కదా అంటూ మండిపడింది. నేను చస్తే నా మొగుడిని కట్టుకొందామని చూస్తున్నావా? నా మొగుడు ఇచ్చిన ట్యాబ్లెట్‌ను మార్చి ఇస్తావా అంటూ ఫైర్ అయింది.
Recommended Video

కార్తీక్‌కు దీప వార్నింగ్
ఆ తర్వాత నీతో వచ్చిన అది వెళ్లిపోయింది.. నీవు కూడా వెళ్లిపో అంటూ డాక్టర్ కార్తీక్‌ను హెచ్చరించింది. దాంతో దీప చేతిలో నుంచి మండుతున్న కట్టెను తీసి పక్కన పడేశాడు. పొయ్యిని చల్లార్చి ఆమెను చేతిని పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి చాప, దిండు తీసుకొని పడుకొని ఆమెకు షాక్ ఇచ్చారు. నేను నీ ఇంట్లో పేషెంట్‌ను, కానీ ఇక్కడ వంటలక్కను అంటూ దీప ఫైర్ అయింది.


Click it and Unblock the Notifications











