Karthika Deepam 2 : అలాంటి వ్యక్తితో అస్సలు ఉండలేను - డాక్టర్ బాబుతో వంటలక్క
'బంధానికి, బాధ్యతలకు విలువ ఇవ్వని వ్యక్తి గురించి ఆలోచించను' అంటోంది వంటలక్క ప్రేమీ విశ్వనాథ్. డాక్టర్ బాబుతో ఈ విషయం చెప్పింది. ఇంతకీ అసలేం జరిగింది? ప్రస్తుతం ఈ విషయం గురించే బుల్లితెర ప్రేక్షకులంతా తెగ ఆలోచిస్తున్నారు. దాని గురించి పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం...
సినిమాలకు సీక్వెల్స్ రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండ్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే అదే ట్రెండ్‌ను సీరియల్స్ కూడా కొనసాగించేందుకు రెడీ అవుతున్నాయి. బుల్లితెరపై విశేష ఆదరణ పొందిన కార్తీక దీపం కూడా ఇప్పుడు ఇదే రూట్‌ను ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే కార్తీక దీపం ఇది నవ వసంతం అంటూ సీక్వెల్‌ను అనౌన్స్ చేసి ఓ గ్లింప్స్‌ను విడుదల చేశారు. తెలుగు లోగిళ్లు మరువని కథ కొత్త వెలుగులతో మళ్లీ వస్తోంది అని ప్రేక్షకుల మనసులో ఆనందాన్ని నింపారు.

దీంతో స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ అంతా మళ్లీ అలర్ట్ అయిపోయారు. అసలే ఈ ధారావాహిక కోసం వారంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. డాక్టర్ బాబు - వంటలక్క కెమిస్ట్రీ కోసం వారంతో ఎంతో ఆత్రుతగా ఉన్నారు. అయితే తాజాగా ఈ సీక్వెల్‌కు సంబంధించి మరో కొత్త ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఎమోషనల్‌గా సాగిన ఈ ప్రచార చిత్రం ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది.
ఇందులో వంటలక్కను మళ్లీ పనిమనిషిగా చూపించారు మేకర్స్. డాక్టర్బాబులో ఇంట్లో ఆమె పనిమనిషిగా ఉంటుంది. 'నువ్వు ఇక్కడ కూర్చొని చదువుకో అమ్మ. ఇంట్లో పని చూసుకొని వస్తాను' అంటూ వంటలక్క తన కూతురిని కూర్చొపెట్టి వెళ్తుంది. అయితే అక్కడ ఆ చిన్నది దీనంగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో డాక్టర్ బాబు 'ఏంటే రౌడీ ఏమి ఆలోచిస్తున్నావు' అంటూ వస్తారు. 'ఈ రోజు ఫాదర్స్ డే కదా. పిల్లలంతా తమ నాన్నలతో కలిసి వెళ్తున్నారు. మా నాన్న ఎలా ఉంటారో నాకు కూడా తెలీదు' అంటూ బాధతో చెబుతుంది.

'గడ్డాలు మీసాలు పెట్టుకుని మరి నన్నే వచ్చేమంటావా?' అంటూ సరదాగా నవ్వించేందుకు ప్రయత్నిస్తాడు డాక్టర్ బాబు. 'అంతలో ఏమీ అనుకోకండి బాబు గారు' అంటూ వంటలక్క ఎంట్రీ ఇస్తుంది. 'నీకు అర్థమవుతుందా ఆ పసి హృదయం తండ్రి ప్రేమ కోసం తపిస్తోంది. పట్టింపులు, పంతానికో పోకుండా ఆలోచించు' అంటూ డాక్టర్ బాబు సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తాడు. కానీ వంటలక్క మాత్రం 'బంధానికి, బాధ్యతలకు విలువ ఇవ్వని వ్యక్తి గురించి ఆలోచించను' అంటూ వెళ్లిపోతుంది. కార్తీక దీపం ఇది నవం వసంతం అంటూ ప్రోమో ముగిసింది.
ఇకపోతే కార్తిక దీపం మొదటి భాగం సాయంత్రం 7.30 గంటలకు ప్రసారం అయ్యేది. అయితే ఆ ధారావాహిక ముగిశాక దాని స్థానంలో బ్రహ్మముడి సీరియల్‌ను ప్రసారం చేయడం మొదలు పెట్టారు. ఇది కూడా విశేష ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు మళ్లీ కార్తీక దీపం సీక్వెల్ మళ్లీ రావడంతో టైమింగ్‌ను ఛేంజ్ చేస్తున్నారని తెలిసింది. మళ్లీ కార్తీక దీపం సీక్వెల్‌ను సాయంత్రం 7.30 గంటలకు టెలికాస్ట్ అయ్యేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











