Deepika Pilli: పొట్టి దుస్తుల్లో దీపిక పిల్లి హాట్ షో.. బీచ్ లో సోకుల విందు, ఫొటోలు వైరల్

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది అమ్మాయిలు యమ పాపులర్ అయ్యారు. ఈ సామాజిక మాధ్యమంతో వచ్చిన ఫేమ్ ద్వారా ఎన్నో ఆఫర్లను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అలాంటి వారిలో క్యూట్ భామ దీపికా పిల్లి ఒకరు. టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై మెరిసింది. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే ఎవరు సంపాదించుకోని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఓవైపు సినిమాలతో.. మరోవైపు యాంకర్ గా దూసుకుపోతోన్న ఈ చిన్నది సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్ గా ఉంటోంది.

లక్షల ఫాలోవర్లతో..

లక్షల ఫాలోవర్లతో..

బ్యూటిఫుల్ స్మైలింగ్ క్వీన్ గా బుల్లితెరపై వెలుగొందుతోంది దీపికా పిల్లి. సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ముందే మోడల్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది ఈ చిన్నది. మోడలింగ్ రంగంలో తన అందచందాలతో విపరీతంగా సందడి చేసింది. అంతేకాదు, అదే సమయంలోనే అప్పట్లో బాగా పాపులర్ అయిన టిక్ టాక్ వీడియోలతో మరింతగా ఫేమస్ అయిపోయింది దీపిక పిల్లి. ఆమె చేసిన వీడియోలతో టిక్ టాక్ లో కొన్ని లక్షల ఫాలోవర్లను సంపాదించుకుంది. దీంతో ఫిల్మ్, టీవీ షోల మేకర్ల దృష్టినీ ఆకర్షించేసింది.

క్రేజ్ తో సినీ ఆఫర్లు..

క్రేజ్ తో సినీ ఆఫర్లు..

సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారిపోయిన క్యూట్ భామ దీపిక పిల్లికి బుల్లితెరపై అనేక షోలలో అవకాశం దక్కింది. ఈ క్రమంలోనే ఈ చిన్నది ఈటీవీలో ప్రసారం అయిన 'ఢీ' షో ద్వారా కెరీర్ మొదలు పెట్టింది. ఈ రియాలిటీ డ్యాన్స్ షోలో ఓ టీమ్‌కు మెంటర్‌గా చేసిన దీపికా.. తనదైన అందం, అభినయం, కామెడీతో ఆకట్టుకుంది. అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తూ మరింత క్రేజ్ పెంచుకుంది. తద్వారా తన క్రేజ్‌ను పెంచుకోవడంతో పాటు ఆఫర్లనూ అందుకుంది.

చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో..

చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో..

బుల్లితెరపై హవా చూపిస్తున్న సమయంలోనే దీపికా పిల్లిని పలు రూమర్స్ చుట్టు ముట్టాయి. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ముందే దీపికా పిల్లి ఓ కుర్రాడితో ప్రేమాయణం సాగించినట్లు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. ఆ తర్వాత 'ఢీ' షోలో హైపర్ ఆదితో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని టాక్ వచ్చింది. అంతేకాదు, ఆదిని ఆమె పెళ్లి చేసుకోబోతుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, తర్వాత అదంతా తప్పుడు ప్రచారం అని క్లారిటీ వచ్చింది.

సినిమాల్లో గ్లామర్ ట్రీట్..

సినిమాల్లో గ్లామర్ ట్రీట్..

అతి తక్కువ సమయంలోనే బుల్లితెర యాంకర్ దీపికా పిల్లికి భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకు చాలా అవకాశాలు క్యూ కట్టాయి. ఇలా ఆమె 'కామెడీ స్టార్స్' సహా పలు షోలకు యాంకర్‌గానూ చేసింది. అలాగే, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పించిన 'వాంటెడ్ పండుగాడ్' సహా పలు చిత్రాల్లో నటించింది ఆకర్షించింది. ఈ సినిమాలో తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అబ్బా అబ్బా.. అనే పాటకు అందాల విందు చేసింది ఈ భామ. ఈ సినిమాలో మరో యాంకర్ అనసూయ కూడా నటించి ఆకట్టుకుంది.

కామెడీ షోకి యాంకర్ గా..

కామెడీ షోకి యాంకర్ గా..

క్యూట్ బ్యూటి దీపిక పిల్లి ప్రస్తుతం ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ షోకి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఇలా ఒకవైపు టీవీ షోలు, మరోవైపు ఓటీటీలో కార్యక్రమాలు, అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. దీపిక పిల్లి సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను క్రమంగా పెంచుకుంటోంది.

బీచ్ లో అందాల విందు..


సోషల్ మీడియాలో అప్పుడప్పుడు గ్లామర్ డోస్ పెంచుతూ హాట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది క్యూట్ సొగసరి దీపికా పిల్లి. ఇప్పుడు తాజాగా మరోసారి గ్లామర్ పిక్స్ వదిలింది ఈ భామ. బ్లూ టాప్ వైట్ షార్ట్ జీన్స్ వేసుకున్న బీచ్ లో సందడి చేసింది ఈ క్యూట్ యాంకర్. ఓ వైపు సముద్రం అందం.. మరోవైపు దీపికా సొగసులతో ఈ ఫొటోలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. తన థైస్ అందాలతో మెస్మరైజ్ చేసిన దీపిక పిల్లి ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X