హైపర్ ఆది బండారం బయటపెట్టిన యాంకర్: అక్కడ పట్టుకున్నాడు.. చెప్పులు, రాళ్లతో కొట్టాలి అంటూ!

తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది టాలెంట్ ఉన్న కుర్రాళ్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది ఒకడు. జబర్ధస్త్ షో ద్వారా కెరీర్‌ను మొదలు పెట్టిన అతడు.. తక్కువ సమయంలోనే తన టాలెంట్లను బయట పెట్టి ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇలా టెలివిజన్ రంగంలో స్టార్‌గా ఎదిగిపోయాడు. ఇప్పుడు కూడా వరుసగా షోలు, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఓ షోలో యాంకర్ దీపికా పిల్లి.. హైపర్ ఆదిపై సంచలన ఆరోపణలు చేసింది. ఆ సంగతులు మీరే చూడండి!

లైఫ్ ఇచ్చింది ఆపేశాడు: హైపర్ ఆది జబర్ధస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చాడు. అందులో తనదైన పంచులతో దండయాత్ర చేసి యమ ఫేమస్ అయ్యాడు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయ్యాడు. అయితే, ఈ మధ్యనే అతడు ఈ షో నుంచి తప్పుకున్నాడు. అయితే, 'శ్రీదేవి డ్రామా కంపెనీ', 'ఢీ' వంటి షోలలో చేస్తున్నాడు. అదే సమయంలో సినిమాల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.

 Deepika Pilli

సూపర్ హిట్... వరుసగా: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌తో ఎన్నో రకాల షోలు వస్తున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే డ్యాన్స్ ఆధారంగా నడుస్తున్నాయి. అలాంటి వాటిలో 'ఢీ' ఒకటి. సౌతిండియాలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరొందిన దీనికి ప్రేక్షకులు భారీ స్పందనను అందిస్తున్నారు. ఫలితంగా ఇది వరుసగా 15 సీజన్లను పూర్తి చేసి సత్తా చాటింది.

 Deepika Pilli

లీగ్ రౌండ్.. పాయింట్లు: 'ఢీ' షో ఇప్పటికే 15 సీజన్లను భారీ రేటింగ్‌తో పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే పదహారో దానిని కూడా కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టారు. 'ఢీ ప్రీమియర్ లీగ్' పేరిట ప్రసారం అవుతున్న ఈ సీజన్‌లో.. గతంలో మాదిరిగా కాకుండా కొన్ని ఊరి పేర్లతో టీమ్‌లను తీసుకు వచ్చి వాటి పోటీలు పెడుతున్నారు. అలాగే, జట్లకు పాయింట్లను ఇస్తూ సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నారు.

 Deepika Pilli

ఫేమస్ గెటప్‌లతో ఆది: కొంత కాలంగా 'ఢీ' షోలో కంటిన్యూ అవుతోన్న హైపర్ ఆది.. తాజా సీజన్ 'ఢీ ప్రీమియర్ లీగ్'లో సైతం తనదైన కామెడీతో రెచ్చిపోతోన్నాడు. ముఖ్యంగా అతడు ప్రతి ఎపిసోడ్‌లోనూ ఏదో ఒక హీరో గెటప్‌లను వేస్తున్నాడు. అంతేకాదు, వాళ్ల బాడీ లాంగ్వేజ్, డైలాగులను ఇమిటేట్ చేస్తూ నవ్వులు పూయిస్తున్నాడు. దీంతో ప్రతి ఎపిసోడ్‌లోనూ అతడే ఓ రేంజ్‌లో హైలైట్ అవుతున్నాడు.

రాజా సినిమా స్ఫూఫ్‌తో: ఈ బుధవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మల్లెమాల టీమ్ తాజాగా విడుదల చేశారు. ఇందులో ఓరుగల్లు వీరులు - కోనసీమ పందెంకోళ్లు, నెల్లూరు నెరజాణలు - బెజవాడ టైగర్స్ జట్ల మధ్య పోటీలు జరుగుతున్నట్లు చూపించాయి. ఇక, ఈ ఎపిసోడ్‌లో భాగంగా హైపర్ ఆది.. యాంకర్ దీపికా పిల్లితో కలిసి 'రాజా' సినిమా స్ఫూఫ్ చేసి నవ్వించేశాడు.

 Deepika Pilli

క్లైమాక్స్‌లో.. పులిహోర: 'ఢీ ప్రీమియర్ లీగ్' బుధవారం ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో హైపర్ ఆది.. విక్టరీ వెంకటేష్‌లా, దీపికా పిల్లి.. సౌందర్యలా నటిస్తూ స్కిట్ చేశారు. ముఖ్యంగా 'రాజా' సీన్‌లోని క్లైమాక్స్ సీన్‌ను ఇమిటేట్ చేశారు. ఆ సమయంలో దీపికా పిల్లి 'నేను ఢీలోకి రాగానే చేయి చేయి టచ్ చేసి.. వెంటనే పులిహోర కలిపిన వ్యక్తి ఒకరు ఉన్నారు' అంటూ ఆదిపై ఫన్నీగా ఆరోపణలు చేసింది.

చెప్పులు, రాళ్లు అంటూ: దీపికా పిల్లి మాట్లాడుతున్న సమయంలో ఫేమస్ మ్యూజిక్ క్లిప్‌ను వేశారు. ఆ తర్వాత ఆమె 'ఈరోజు మీరు విసిరే రాళ్లు, చెప్పులు ఆయన మీదకే వెళ్లాలి' అంటూ ఆదిని చూపిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో అతడు షాకై నోరెళ్లబెట్టేశాడు. ఆ తర్వాత జబర్ధస్త్ ఫేం సుజాత కూడా షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె కూడా హైపర్ ఆదిని తనదైన శైలలో తిట్టి పరువు తీసేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X