For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వద్దన్నా ఇంటికి వస్తాడు.. సుడిగాలి సుధీర్‌పై దీపిక హాట్ కామెంట్స్

  |

  ఏమాత్రం అంచనాలు లేకుండా బుల్లితెరపై ప్రవేశించి.. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న వారిలో ప్రముఖ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఒకడు. జబర్ధస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అతడు.. అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ స్టార్‌డమ్‌ను అందుకున్నాడు. అదే సమయంలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం దక్కించుకున్నాడు. టెలివిజన్ రంగంలోనే కాకుండా.. వెండితెరపైనా సందడి చేస్తూ సత్తా చాటుతున్నాడతను. తెలుగు రాష్ట్రాల్లో స్టార్‌గా వెలుగొందుతోన్న సుడిగాలి సుధీర్.. తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ యంగ్ కమెడియన్‌పై సోషల్ మీడియా సెలెబ్రిటీ దీపిక పిల్లి సంచలన ఆరోపణలు చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  Recommended Video

  Sudigali Sudheer పై Nagababu కోపం గా ఉన్నారా? నెటిజన్ కి షాకింగ్ రిప్లై
  అన్నింట్లోనూ రాణిస్తూ.. టాప్ ప్లేస్‌లో

  అన్నింట్లోనూ రాణిస్తూ.. టాప్ ప్లేస్‌లో

  మ్యాజిక్‌లో చేసుకుంటూ తన కెరీర్‌ను ఆరంభించుకున్నాడు సుధీర్. ఈ క్రమంలోనే ఎన్నో టీవీ ఛానెళ్లలో కొన్ని కార్యక్రమాలు చేశాడు. ఆ సమయంలోనే జబర్ధస్త్ కమెడియన్ల దృష్టిలో పడి.. ఆ షోలోకి ఆర్టిస్టుగా అడుగెట్టాడు. అలా అందులో చేస్తోన్న సమయంలోనే అసాధారణమైన టాలెంట్‌తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా మామూలు ఆర్టిస్టు నుంచి టీమ్ లీడర్‌గా ప్రమోషన్‌ను కూడా అందుకున్నాడు. అప్పటి నుంచి గెటప్ శ్రీను, రాంప్రసాద్, సన్నీలతో కలిసి అద్భుతమైన స్కిట్లతో అలరిస్తున్నాడు. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు సుధీర్.

  Raja Raja Chora Twitter Review: శ్రీవిష్ణు కెరీర్‌లో తొలిసారి.. ప్లస్ మైనస్ ఇవే.. మూవీ ఎలా ఉందంటే!

  యాక్టర్‌గా అలా... హీరోగా ఇలా చేస్తూ

  యాక్టర్‌గా అలా... హీరోగా ఇలా చేస్తూ

  సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై కామెడీని పండిస్తూ టాప్ కమెడియన్‌గా కొనసాగుతున్న సుడిగాలి సుధీర్.. అప్పుడెప్పుడో సినిమాల్లోనూ అడుగు పెట్టాడు. ఈ క్రమంలోనే 'రేసు గుర్రం', 'బ్రదర్ ఆఫ్ బొమ్మాలి', 'సర్దార్ గబ్బర్ సింగ్', 'బంతిపూల జానకీ' సహా కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా నటించాడు. ఆ తర్వాత హీరోగానూ మారాడు. ఈ క్రమంలోనే అతడు లీడ్ రోల్‌లో చేసిన 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' మాత్రం ఘోరంగా నిరాశ పరిచాయి. అయినప్పటికీ.. ప్రస్తుతం ఈ యంగ్ టాలెంటెడ్ గాయ్ 'కాలింగ్ సహస్రా', 'గాలోడు' వంటి చిత్రాల్లో హీరోగా చేస్తున్నాడు.

  రష్మీతో లవ్ ట్రాక్.. ప్లేబాయ్‌గా పేరుతో

  రష్మీతో లవ్ ట్రాక్.. ప్లేబాయ్‌గా పేరుతో

  బుల్లితెర ఆల్‌రౌండర్‌గా పేరొంది స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. అయితే, యాంకర్ రష్మీ గౌతమ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు వచ్చిన వార్తల వల్ల అతడు మరింతగా పాపులర్ అయ్యాడు. అంతేకాదు, ఆమెను పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని జరిగిన ప్రచారంతో ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు. దీనికితోడు, ఏదో ఒక యాంకర్‌తో సుధీర్ ప్రేమాయణం సాగిస్తున్నాడని వచ్చిన పుకార్లతో పాటు జబర్ధస్త్ స్కిట్లలో అతడు చేసే పాత్రల వల్ల ప్లేబాయ్ అనే బిరుదును కూడా అందుకున్నాడు. దీని వల్ల పలుమార్లు విమర్శలు కూడా ఎదుర్కొన్నాడతను.

  బాత్రూంలో బోల్డుగా దిశా పటానీ సెల్ఫీ: వామ్మో అందాలు మొత్తం చూపిస్తూ ఘాటుగా!

  శ్రీదేవి కోసం అలా.. వాళ్లతో కలిసి రచ్చ

  శ్రీదేవి కోసం అలా.. వాళ్లతో కలిసి రచ్చ

  కమెడియన్‌గా జబర్ధస్త్‌ షోలో సత్తా చాటుతూ.. బుల్లితెర మొత్తంగా హవాను చూపిస్తోన్న సుడిగాలి సుధీర్.. ఆ మధ్య 'పోవే పోరా' అనే షోతో యాంకర్‌గానూ మారాడు. అందులోనూ తన మార్క్‌ను చూపించి ఆకట్టుకున్నాడు. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోతో మరోసారి యాంకర్‌గా ఎంట్రీ మారాడు. ఇక, సుధీర్ ప్రస్తుతం చేస్తోన్న షోలలో 'ఢీ' గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇందులో అతడు హైపర్ ఆదితో కలిసి కింగ్స్ టీమ్‌కు మెంటర్‌గా ఉన్నాడు. అలాగే, క్వీన్స్ టీమ్‌లో రష్మీ గౌతమ్, దీపిక పిల్లి మెంటర్లుగా ఉన్నారు. వాళ్లతో సుధీర్ రచ్చ చేస్తున్నాడు.

   పల్లెటూరి స్పెషల్‌గా వచ్చే వారం ‘ఢీ'

  పల్లెటూరి స్పెషల్‌గా వచ్చే వారం ‘ఢీ'

  ఇండియా మొత్తంలో చాలా భాషల్లో డ్యాన్స్ షోలు ప్రసారం అయినప్పటికీ.. తెలుగులో వచ్చే 'ఢీ'కు మాత్రం మరింత ఎక్కువగా ఆదరణ లభిస్తోంది. అంతలా ఈ షో టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏకంగా పదమూడో సీజన్‌ను జరుపుకుంటోంది. ఇందులో ప్రతివారం ఏదో ఒక స్పెషల్ థీమ్‌ను రెడీ చేస్తున్నారు నిర్వహకులు. ఇందులో భాగంగానే వచ్చే బుధవారం ప్రసారం కాబోతున్న 'ఢీ' షోలో పల్లెటూరి, పల్లె పాటల స్పెషల్ ఎపిసోడ్ జరగబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై.. వెంటనే వైరల్ అయిపోయింది.

  షూటింగ్‌‌కు వెళ్తే అలా చేయించారు.. ఇండస్ట్రీకి ఎందుకొచ్చానా అని ఏడ్చా: శ్రీముఖి సంచలన వ్యాఖ్యలు

  దారుణమైన మాటలతో సుధీర్ అలా

  వచ్చే వారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌లో సుడిగాలి సుధీర్ ఊరి సర్పంచ్‌గా వచ్చాడు. అతడి పక్కనే ఉన్న హైపర్ ఆది అదిరిపోయే పంచులతో రచ్చ చేశాడు. అలాగే, రష్మీ గౌతమ్, దీపిక పిల్లి పల్లెటూరి అమ్మాయిల్లా కనిపించారు. ఇక, సుడిగాలి సుధీర్‌ను మరోసారి అమ్మాయిల పిచ్చి ఉన్న వ్యక్తిగా చూపించారు. ఇందులో భాగంగానే అతడు 'గడ్డివాము దగ్గర బాగుంటుంది.. పంపు సెట్టు దగ్గరకు వెళ్లు.. ఊరి చివర కాలక్షేపానికి వస్తుంటారు.. అమ్మాయి కోసం వెళ్లి కండువా మర్చిపోయి రావడం' ఇలా ఎన్నో డబుల్ మీనింగ్ డైలాగులతో సుధీర్‌‌ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు.

  వద్దన్నా ఇంటికొస్తాడంటూ దీపిక పిల్లి

  వద్దన్నా ఇంటికొస్తాడంటూ దీపిక పిల్లి

  సుడిగాలి సుధీర్ క్యారెక్టర్‌ను దారుణంగా ఎలివేట్ చేసి చూపించారు నిర్వహకులు. ఇక, షోలో భాగంగా ప్రదీప్ ఓ అమ్మాయిని తీసుకుని ఆ ఊరికి వస్తాడు. అప్పుడు ఇల్లు కోసం వెతుకుతుండగా.. సర్పంచ్ అయిన సుధీర్‌తో మాట్లాడుతుంటారు. అప్పుడే రష్మీతో కలిసి అక్కడ వచ్చిన దీపిక.. ప్రదీప్ వాళ్ల గురించి తెలుసుకుని తన ఇంటికి రమ్మంటుంది. దీంతో సుధీర్ 'ఎప్పుడైనా నన్ను రమ్మన్నావా మీ ఇంటికి' అని అడుగుతాడు. దీనికి 'మిమ్మల్ని రమ్మనకపోయినా ఇంటికొస్తారు కదండీ' అంటుంది దీపిక. దీంతో రష్మీ షాక్ అయిపోయి అయ్యో అంటూ సిగ్గు పడిపోతుంది.

  English summary
  Social Media Sensation Deepika Pilli Sensational Allegations on Jabardasth Comedian, Tollywood Actor Sudigali Sudheer in DHEE 13 - Kings vs Queens Show. This Promo Video Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X