సుమ షో నుంచి దీపిక రంగరాజు ఔట్... జడ్జిలపై కంటెస్టెంట్స్ షాకింగ్ కామెంట్స్

స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు కావ్య అలియాస్ దీపిక రంగరాజు. ఆ ఒక్క సీరియల్ తప్పించి ఆమె చేతుల్లో కొత్తగా ఏ ప్రాజెక్ట్ లేదు. అయితే తెలుగు బుల్లితెరపై పలు ఛానెల్స్‌లో స్పెషల్ ప్రోగ్రామ్స్‌తో అలరిస్తున్నారు దీపిక. వచ్చి రాని తెలుగుతో దీపిక వేసే పంచ్‌లకు పడి పడి నవ్వాల్సిందే. తాజాగా స్టార్ యాంకర్ సుమ కనకాల హోస్ట్‌గా ప్రసారమవుతున్న ఓ షో నుంచి దీపిక ఎలిమినేట్ అయ్యింది. సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో సెలబ్రిటీ వంటల కార్యక్రమం చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 5 సీజన్లుగా తెలుగు బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ప్రస్తుతం చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే సీజన్ 5 ఎండింగ్‌కు వచ్చేసింది. ప్రస్తుతం గ్రాండ్ ఫినాలే జరుగుతున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ షోకు స్టార్ యాంకర్ సుమ కనకాల హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా... జీవన్ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.

Deepika Rangaraju Eliminated from Suma Kanakala s Chef Mantra Project K Show Shocking Comments Go Viral

బుల్లితెర సెలబ్రిటీలు మానస్ నాగులపల్లి, దీపిక రంగరాజు, ప్రేరణ కంభం, యష్మి గౌడ, సౌందర్య రెడ్డి, యాదమ్మ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్స్‌గా చేస్తున్నారు. ప్రతివారం ఏదో ఒక థీమ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది చెఫ్ మంత్ర. సుమ పంచ్‌లు, కంటెస్టెంట్స్‌ నవ్వులతో ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా సంక్రాంతితో పాటు గ్రాండ్ ఫినాలే సందర్భంగా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే సీజన్ 5 కొత్తగా రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది.

ఈ షో నుంచి నేను విడుదల కాబోతున్నానని జీవన్ అనగా..... లాస్ట్ సీజన్ కూడా ఇలాగే అనుకున్నాం. ఏమైంది తిప్పికొడితే మళ్లి నెక్ట్స్ సీజన్ స్టార్ట్ అయ్యిందని సుమ పంచ్ విసురుతుంది. 2 నిమిషాలు కూడా ఆనందంగా ఉండొద్దా అంటూ జీవన్ ఆవేదన వ్యక్తం చేయగా సుమ నవ్వేస్తుంది. ఆ వెంటనే కంటెస్టెంట్స్ అంతా అందంగా రెడీ అయి ఎంట్రీ ఇస్తారు. గెలవకపోతానా? అని కూడ నేను బాధపడలేదు... కానీ జీవన్ గారిని నెక్ట్స్ ఎపిసోడ్ నుంచి చూడలేకపోతున్నానే అని దీపిక బాధపడుతుంది. అయితే ఇంటికి తీసుకెళ్లమని ఒకరు పంచ్ విసరడంతో అంతా నవ్వేస్తారు.

అంతా జోష్‌లో ఉండగా మీరంతా ఎలిమినేషన్ సంగతి మరిచిపోయారంటూ సుమ బాంబు పేలుస్తుంది. ఈ గ్రాండ్ ఫినాలేలో కేవలం ముగ్గురు జోడీలు మాత్రమే వంటి చేస్తారని చెబుతుంది. ఈ రోజు ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరంటే కావ్య - ప్రేరణ అని చెప్పడంతో వారిద్దరూ సంబరాలు చేసుకుంటారు. అలాగే ఫస్ట్ ఎలిమినేట్ అవుతున్నది ఎవరంటే యాదమ్మరాజు - దీపిక అని చెప్పడంతో వారిద్దరూ గట్టిగా కేకలు పెడతారు. మా పిచ్చి తగ్గించుకుంటాం మాకు ఛాన్స్ ఇవ్వండి అంటూ యాదమ్మరాజు సెటైర్లు వేస్తాడు. సెకండ్ ఫైనలిస్ట్‌గా మానస్- అఖిల్ పేర్లు చదువుతుంది సుమ. అనంతరం మూడో ఫైనలిస్ట్‌గా యష్మి - పండులు ఛాన్స్ దక్కించుకోగా.... ఎలిమినేట్ అయినందుకు సౌందర్య రెడ్డి - టేస్టీ తేజాలు షాక్ అవుతారు.

గ్రాండ్ ఫినాలే సందర్భంగా మంచి తాళి కావాలి... తాళిలో ఏడు ఐటెమ్స్ మినిమమ్ ఉండాలి అని టాస్క్ ఇస్తాడు జీవన్. మీరెందుకు ఎలిమినేట్ అయ్యారని మీరు అనుకుంటున్నారని సుమ అడగ్గా.... సగం వంట మేం ఎత్తుకురావడం వల్ల వాళ్లు అక్కడున్నారు, మేం ఇక్కడున్నారని సౌందర్య పంచ్‌లు వేస్తుంది. మేం మాత్రం జడ్జిల వల్ల ఎలిమినేట్ అయ్యామని యాదమ్మరాజు అనడంతో జీవన్ షాక్ అవుతాడు. ఇప్పుడు దీపిక.... ఫైనలిస్టుల దగ్గర 10 నిమిషాలు టైం స్పెండ్ చేయబోతోందని సుమ అంటుంది. నేను ఖాళీగా ఉన్నాను మీకు ఏం హెల్ప్ కావాలసి దీపిక అడగ్గా.. అయితే ఈ గిన్నె కడగమని అఖిల్ పంచ్ విసురుతాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... దీపిక అల్లరి, సుమ పంచ్‌లు చూడాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X