దీపిక రంగరాజుకు బిగ్‌బాస్ కంటెస్టెంట్ ముద్దు.. యాంకర్ సుమ షోలో రచ్చ!

స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ఈ స్థాయిలో పాపులర్ కావడానికి తమిళనటి దీపిక రంగరాజు ప్రధాన కారణం. పేదింటి నుంచి వచ్చి అత్తింటికి తలలో నాలుకలా మారడంతో పాటు ఓర్పు, సహనంతో తన కాపురాన్ని చక్కదిద్దుకోవడం, అత్తింటి వారికి వచ్చే ఏ కష్టాన్ని అయినా ఎదిరించి నిలబడుతూ కావ్య పాత్రలో ఒదిగిపోయింది దీపిక. ఆమెను అసలు పేరుగా కంటే కావ్యగానే ఎక్కువమంది గుర్తుపడతారు. సీరియల్స్‌తో పాటు తెలుగు బుల్లితెరపై పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు దీపిక. ఈ క్రమంలోనే ఓ షోలో పాల్గొన్న దీపికకు చేదు అనుభవం ఎదురైంది. ఈ వివరాల్లోకి వెళితే..

ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో సెలబ్రిటీ వంటల కార్యక్రమం చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. మరికొద్దిరోజుల్లో ఈ సీజన్‌కి ఎండ్ కార్డ్ పడనుంది. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా ఆహా విడుదల చేసింది. ప్రస్తుతం గ్రాండ్ ఫినాలే జరుగుతున్నట్లుగా నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ గ్రాండ్ ఫినాలేను సరికొత్తగా డిజైన్ చేశారు. చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే సీజన్ 5కు స్టార్ యాంకర్ సుమ కనకాల హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా... చెఫ్ జీవన్ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.

Deepika Rangaraju Faces Shocking Moment in Aha s Chef Mantra Project K S5 Grand Finale

బుల్లితెర సెలబ్రిటీలు మానస్ నాగులపల్లి, దీపిక రంగరాజు, ప్రేరణ కంభం, యష్మి గౌడ, సౌందర్య రెడ్డి, యాదమ్మ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్స్‌గా చేస్తున్నారు. గ్రాండ్ ఫినాలే సందర్భంగా ఐదుగురు జంటల్లో మూడు జంటలు మాత్రమే పార్టిపేట్ చేస్తాయని సుమ అనౌన్స్ చేశారు. కావ్యశ్రీ- ప్రేరణ కంభం, మానస్ - అఖిల్‌, యష్మి గౌడ- పండులకు ఫైనల్‌ ఆడే అవకాశం దక్కిందని తెలిపారు. దీపిక రంగరాజు- యాదమ్మరాజు, సౌందర్య రెడ్డి - టేస్టీ తేజాలు ఎలిమినేట్ అయినట్లు అనౌన్స్ చేసింది సుమ.

గ్రాండ్ ఫినాలే సందర్భంగా తాళి చేయాలని.. ఖచ్చితంగా 7 ఐటెమ్స్ ఉండాలని చెఫ్ జీవన్ టాస్క్ ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో జోష్ పెంచేందుకు సమీర భరద్వాజ్, బిగ్‌బాస్ అవినాష్‌‌లు ఎంట్రీ ఇచ్చారు. సమీర ఫ్లవర్‌‌వాజ్ గారు ఎలా ఉన్నారని అవినాష్ అడగ్గా.. భరద్వాజ్ అని ఆమె సీరియస్ అయ్యింది. నాకు క్యాబ్ డబ్బులు వేశారు కానీ పేమెంట్ ఇవ్వలేదని అవినాష్ అడగ్గా.. క్యాబ్ డబ్బులే నీ పేమెంట్ అని సమీర అనడంతో అవినాష్ షాక్ అయ్యాడు. ఇంతలో దీపిక ఏదో సైటైర్లు వేయబోగా.. నా పీక పిసికేయమని అవినాష్ సీరియస్ అవుతాడు.

ఏదో వస్తువు కోసం కావ్యశ్రీ స్టోర్ రూమ్‌లోకి వెళ్తుండగా ఆమె వెనుక పరిగెత్తుతాడు అవినాష్. ఈ మధ్య సింగిల్ అని విన్నానని అవినాష్ చెప్పగా.. అతని వైపు కావ్య సీరియస్‌గా చూస్తుంది. అయితే ఏదో పంచ్‌కి కోప్పడిన అవినాష్.. బయట వాచ్‌మెన్ ఉన్నాడని వెళ్లిపోమ్మని యాదమ్మ రాజు- దీపికలను బయటకు వెళ్లపోమ్మంటాడు. ఈయన చేతికి వాచ్ లేదు.. నీ చేతికి వాచ్ ఉంది కాబట్టి నువ్వే వాచ్‌మెన్ అని దీపిక చెప్పబోతుండగా ఆమెకు అవినాష్ ముద్దుపెట్టేస్తాడు. దాంతో సుమ, జీవన్ సహా కంటెస్టెంట్స్ అంతా షాక్ అవుతారు. ఆ తర్వాత దీపిక, చెఫ్ జీవన్‌లు ఇమిటేట్ చేస్తూ అవినాష్ చేసిన కామెడీ బాగుంది. మధ్యలో మళ్లీ దీపిక ఏదో పంచ్ వేయడానికి రాగా.. ఆమెను గట్టిగా పట్టుకుంటాడు అవినాష్. మరి గ్రాండ్ ఫినాలేలో ఎవరు గెలిచారు? దీపిక- అవినాష్‌ల మధ్య ఏం జరిగిందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X