‘స్మశానంలో 6 అడుగులే నాకున్న ఆస్తి... జీవితంలో చివరి కోరిక అదే’
స్టార్ మాలో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్‌తో తెలుగువారికి బాగా దగ్గరయ్యారు తమిళ నటి దీపిక రంగరాజు. బ్రహ్మముడిలో కావ్య పాత్రతో ప్రతి కుటుంబానికి ఇలాంటి కూతురు, కోడలు కావాలని అనిపించేలా అద్భుతంగా నటించారు. అయితే సెలబ్రిటీల జీవితాలు పైకి కనిపించేంత అందంగా ఉండవు. అలాగే దీపిక జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఇటీవల జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కిస్సిక్ టాక్ షోలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఎమోషనల్ అయ్యారు దీపిక. ఈ వివరాల్లోకి వెళితే..
తల్లిదండ్రుల అభిష్టానికి వ్యతిరేకంగా నటనా రంగం వైపు వచ్చిన దీపిక రంగరాజు.. తొలుత తమిళ చిత్ర పరిశ్రమలో పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించారు. అనంతరం తెలుగు బుల్లితెరపై అవకాశాలు అందుకున్నారు. కార్తీక దీపంలో అవకాశం అందినట్లే అంది చేజారిపోయింది. చివరికి బ్రహ్మముడిలో కావ్యగా ఛాన్స్ దక్కించుకుని తెలుగువారికి చేరువయ్యారు. పుట్టింటికి, మెట్టింటికి పేరు తెచ్చే అద్భుతమైన నటనతో ఒదిగిపోయారు దీపిక రంగరాజు. తాజాగా వర్ష షోలో ఆమె మాట్లాతూ భావోద్వేగానికి గురయ్యారు.

సడెన్‌గా కోటి రూపాయలు దొరికితే ఏం చేస్తావని వర్ష అడగ్గా.. నాకు చిన్నప్పటి నుంచి సొంతంగా చెన్నైలో ఒక ఇల్లు కొనుక్కోవాలని డ్రీమ్. కోటి రూపాయలు దొరికితే చెన్నైలో ఇల్లు కొనుక్కుంటా. లేదంటే ఒక డౌన్ పేమెంట్ అయినా కట్టేస్తా. 1.5 నుంచి 2 కోట్ల రూపాయల రేంజ్‌లో ఇల్లు కావాలి. చెన్నైలో ఒక 2 బీహెచ్‌కే అపార్ట్‌మెంటే 2 కోట్ల రూపాయలు. చెన్నైలో నాకు ల్యాండ్ లేదు, హౌస్ లేదు. కానీ 36 గజాల ల్యాండ్ ఉంది. అది కూడా గవర్నమెంట్ ఇచ్చిందని దీపిక రంగరాజు పేర్కొన్నారు.
మీరు ఇప్పటి వరకు ఇన్ని షోలు చేశారు.. ఇన్నేళ్లుగా నటిస్తున్నారు? మీకు ఇల్లు లేకపోవడం ఏంటని వర్ష ప్రశ్నించగా.. ఈ ప్రపంచంలో పుట్టినప్పుడే మనకి గవర్నమెంట్ స్మశానంలో ఇస్తది కదా ఒక 6 అడుగుల స్థలం.. అది తప్పించి ఏం లేదు. మనం చనిపోతే మనకి 6 అడుగులు మన సొంతమని ఈ ప్రపంచంలో ఒక చోటు ఉంటుంది. మనకి వచ్చేది కోట్లలో కాదు.. వేలు, లక్షలు మాత్రమే సంపాదిస్తున్నాం కదా. ఒక పదేళ్ల క్రితం ఇప్పుడు సంపాదిస్తున్నట్లుగా సంపాదించి ఉంటే కొనేదానిని. ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి కదా కొనలేమని దీపిక ఆవేదన వ్యక్తం చేశారు.
డబ్బు, మనుషులు అంటే.. నేను మనుషులకే వాల్యూ ఇస్తా. మనుషులే మనకి జీవితాంతం ఉంటారు, డబ్బులు రావు కదా. ఎన్ని లక్షలు ఉన్నా ఖర్చు పెడితే అయిపోతుంది. నేను ఒక మాల్‌కి వెళ్లి షాపింగ్ చేసినా, గోల్డ్ కొన్నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోతుంది. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఫోన్ చేసి చెప్పడానికి కానీ, మనకి సమస్య అంటే మనకి తోడుగా ఉండటానికి కానీ మనుషులే కావాలి. నేను చెప్పిన ఈ మాటలు విని.. రేపు నేను ఏదైనా షో చేయడానికి వెళ్లినప్పుడు ప్రొడ్యూసర్లు.. నువ్వు మనుషులే ఇష్టమని అన్నావు కదా? డబ్బులు చూడకమ్మా.. ఈ పేమెంట్‌కి చేసేసేయ్ అని చెప్పొద్దని సరదాగా నవ్వేసింది దీపిక.
డబ్బు సంపాదించుకోవాలి, మనుషులకు వాల్యూ ఇవ్వాలి. మనీ లేకుండా మనుషుల ముందు మనకి రెస్పెక్ట్ కూడా ఉండదు. షూటింగ్‌లో నా తోటి నటీనటులు పెద్ద పెద్ద కార్లలో వచ్చినా నన్ను ఏనాడూ తక్కువగా చూడలేదు. అందరూ నన్ను గౌరవిస్తారు. చెన్నైలో కారుంది, హైదరాబాద్‌లో కారు లేదు. ఇక్కడ మాత్రం కంపెనీ వెహికల్‌లోనే రావాలి. వీకెండ్స్‌లో పార్టీకి వెళ్లను, మందు తాగే అలవాటు కూడా లేదు. కనీసం టీ, కాఫీ కూడా తాగను. మా ఫ్రెండ్స్ కొంతమంది తాగినా.. అది వాళ్ల వ్యక్తిగతం, నేను ఇన్వాల్వ్ కాను అని దీపిక తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications