‘ఫ్యామిలీని వదిలేసి ఇండస్ట్రీకి.. అలా దారుణంగా అవమానించారు’

న్యూస్ రీడర్‌‌గా కెరీర్ స్టార్ట్ చేసి సెలబ్రిటీగా మారారు దీపిక రంగరాజు. తొలుత తమిళ బుల్లితెరపై అవకాశాలు అందిపుచ్చుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నటించిన సీరియల్స్‌కు మంచి పేరు రావడంతో రెండు మూడు సినిమాలు కూడా చేసింది. ఈ ఫేమ్‌తో తెలుగు టెలివిజన్ రంగం నుంచి దీపికకు పిలుపు వచ్చింది. సూపర్ హిట్ సీరియల్‌ కార్తీక దీపంలో ప్రేమి విశ్వనాథ్ పోషించిన పాత్రతో పాటు మరికొన్ని సీరియల్స్‌లో ఆమెకు అవకాశాలు వచ్చాయి. అయితే పలు కారణాలతో ఈ ఆఫర్స్‌ను దీపిక తిరస్కరించారట. చివరికి బ్రహ్మముడిలో కావ్య పాత్ర ఆమెకు సెట్ అయ్యింది.

Also Read
Ustaad Bhagat Singh Day 3 Collections: ఉస్తాద్ భగత్ సింగ్ 3వ రోజు కలెక్షన్స్.. పవన్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Ustaad Bhagat Singh Day 3 Collections: ఉస్తాద్ భగత్ సింగ్ 3వ రోజు కలెక్షన్స్.. పవన్ మూవీకి ఎన్ని కోట్లంటే?

సంపన్న కుటుంబానికి చెందిన భర్తను పెళ్లి చేసుకుని అత్తారింట్లో నానా కష్టాలు పడి, చివరికి అందరి అభిమానాలు సంపాదించుకునే ఇల్లాలిగా దీపిక రంగరాజు అద్భుతంగా నటించారు. ఈ సీరియల్ ఈ స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్‌ను సొంతం చేసుకోవడం వెనుక దీపిక నటనే కారణం. బ్రహ్మముడితో తెలుగు మహిళా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. దీనితో పాటు పలు టీవీ షోలలో పాల్గొంటూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. తాజాగా స్టార్ మా పరివార్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో పాల్గొన్న దీపిక రంగరాజు ఎమోషనల్ అయ్యారు.

Deepika Rangaraju Gets Emotional at Star Maa Parivaar Awards 2026 After Winning Outstanding Performance Award

తొలుత శేఖర్ మాస్టర్ స్టైలీష్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చి తేజస్విని గౌడతో కలిసి గుంటూరు కారంలోని కుర్చీ మడతపెట్టి సాంగ్‌కు డ్యాన్ వేసి అలరించాడు. ఆ వెంటనే బుల్లితెర ముద్దుగుమ్మలతో కలిసి మరో స్టెప్ వేసి జోష్ తీసుకొచ్చాడు శేఖర్ మాస్టర్. ఈ సందర్భంగా ఉత్తమ తండ్రి కేటగిరీలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో రామరాజు పాత్ర పోషించిన ఈటీవీ ప్రభాకర్‌కు అవార్డ్ అందించారు హీరో అడవి శేష్. మీరు అవార్డ్ తీసుకోవడానికి ఇంత క్యాజువల్‌గా జాగింగ్ డ్రెస్‌లో ఎలా వచ్చేశారని శ్రీముఖి అడగ్గా.. ఇంతలో నా సూర్యుడివి, నా చంద్రుడివి అంటూ ప్రభాకర్ కుమార్తె దివిజ ఎంట్రీ ఇచ్చి తండ్రిని హత్తుకుంటుంది.

Recommended For You
చైతన్యతో విడాకులపై నాన్న రియాక్షన్ అలా... ఓపెన్ అయిన నిహారిక కొణిదెల
చైతన్యతో విడాకులపై నాన్న రియాక్షన్ అలా... ఓపెన్ అయిన నిహారిక కొణిదెల

విలక్షణ పాత్ర అవార్డ్‌ను ఇల్లు ఇల్లాలు పిల్లలులో నటించిన వల్లికి అందించారు హీరో నిఖిల్. మీరు నా ఫేవరెట్ యాక్టర్, నా ఫస్ట్ క్రష్ అని చెప్పొచ్చు అని చెప్పింది. ఆ వెంటనే అవార్డ్‌ను వాళ్ల అమ్మ చేతిలో పెట్టింది వల్లి. ఈ స్టేజ్‌లో ఇప్పుడు ఇలా ఉండటానికి కారణం ... డాడీ లేకపోయినా సరే, చాలామంది చాలా నెగిటివ్‌గా మాట్లాడారు. అవన్నీ నేను వదిలేసి నా వెనకాల బెస్ట్ సపోర్ట్ మా అమ్మే. ఈ అవార్డ్ అందించిన మీ అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు అని మోకాళ్లపై కూర్చొని చెప్పింది వల్లి.

You May Also Like
40 ఏళ్లు దాటాక వెంటాడుతున్న ఆ డేంజర్... నటి ప్రియ ఎమోషనల్
40 ఏళ్లు దాటాక వెంటాడుతున్న ఆ డేంజర్... నటి ప్రియ ఎమోషనల్

ఆ తర్వాత కన్నె పిట్టరో, కన్ను కొట్టరో అంటూ అడవి శేష్ అద్భుతంగా డ్యాన్స్ చేశారు. మీ టైటిల్ చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది.. అమ్మాయి ప్రేమను దొంగిలించారా? లేక ఆ అమ్మాయే మీ ప్రేమను దొంగిలించిందా? అని యాంకర్ ప్రదీప్ అడగ్గా.. ఆ అమ్మాయి వల్ల అంటూ కథ చెప్పబోతూ ఆగిపోతాడు అడివి శేష్. ఇక ఔట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ (ఫిమేల్) అవార్డ్‌ను బ్రహ్మముడి సీరియల్‌లో కావ్య రోల్‌లో నటించిన దీపిక రంగరాజు ఎంపికయ్యారు. ఈమె గురించి స్పెషల్ ఏవీ ప్రదర్శించగా, తన కష్టాలను పంచుకున్నారు దీపిక.

Dhurandhar 2 vs Baahubali 2: సింగిల్ డేలో బాహుబలి 2 రికార్డ్ బ్రేక్.. ఆస్ట్రేలియాలో ధురంధర్ 2 సరికొత్త చరిత్ర
Dhurandhar 2 vs Baahubali 2: సింగిల్ డేలో బాహుబలి 2 రికార్డ్ బ్రేక్.. ఆస్ట్రేలియాలో ధురంధర్ 2 సరికొత్త చరిత్ర

నన్ను స్క్రీన్ మీద చూడాలని ఒక పెద్ద ఆశ నాకు.. ఈ విషయం ఇంట్లో చెబితే మా అమ్మ నాతో గొడవపడి నన్ను తిట్టి తనకు బీపీ ఎక్కువ అయిపోయి, కిందపడిపోయి తనకు హార్ట్ పెయిన్ వచ్చింది. నేను అందరినీ వదులుకునే ఇండస్ట్రీకి వచ్చాను. సిట్టింగ్‌లో కూర్చోవడానికి కూడా నాకు అర్హత ఉందా అనుకున్నప్పుడు, ఔట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అవార్డ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెబుతూ ఎమోషనల్ అయ్యింది దీపిక రంగరాజు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. స్టార్ మా పరివార్ అవార్డ్స్ 2026లో ఏ సీరియల్‌కు ఎక్కువ అవార్డ్స్ వచ్చాయి? విజేతలు ఎవరు? అనేది తెలియాలంటే మార్చి 22వ తేదీ 5.30 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమం చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: deepika rangaraju brahmamudi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X