బిగ్‌బాస్‌‌‌పై బ్రహ్మముడి కావ్య షాకింగ్ కామెంట్స్.. ‌నాగార్జున షోపై తేల్చేసిన నటి

భారతదేశంలోని రియాలిటీ షోలలో టాప్ షో ఏది అని అడిగితే టక్కున చెప్పే సమాధానం బిగ్‌బాస్. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ షో ఫేవరెట్‌గా మారిపోయింది. తొలుత హిందీలో ప్రారంభమైన ఈ మెగా షో.. తర్వాత ప్రాంతీయ భాషల్లోకి అడుగుపెట్టి మంచి హిట్ అయ్యింది. ఒక్క మాటలో చెప్పాలంటే హిందీని మించి అవి సక్సెస్ అయ్యాయి. సెలబ్రిటీలే కాదు.. సామాన్యులు కూడా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టి సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. తాజాగా ఈ బిగ్‌బాస్ షోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బుల్లితెర నటి దీపిక రంగరాజు. ఈ వివరాల్లోకి వెళితే..

స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్‌తో తెలుగు వారిని పలకరించారు దీపిక రంగరాజు. తమిళ అమ్మాయే అయినా తన కట్టుబొట్టుతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన దీపిక.. తర్వాత తమిళ బుల్లితెరపై అడుగుపెట్టారు. ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా కావడంతో తమిళ సినీరంగం నుంచి కూడా అవకాశాలు వచ్చాయి. ఇదే ఫేమ్‌తో తెలుగులో బ్రహ్మముడి నుంచి ఆఫర్ వచ్చింది. దీనికి ముందు కార్తీక దీపంలో ప్రేమి విశ్వనాథ్ పాత్రకు ముందుగా దీపికనే సంప్రదించారట. కానీ అనివార్య కారణాలతో ఆ అవకాశాన్ని దీపిక వదులుకున్నారట.

Deepika Rangaraju Opens Up About Bigg Boss Entry Shares Her Honest Thoughts

ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ తాను ఉన్న చోట ఫుల్ జోష్ తీసుకొస్తారు దీపిక రంగరాజు. వచ్చీ రాని తెలుగులో ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. ఓ మాదిరి ఫేమ్ ఉంటేనే బిగ్‌బాస్‌లోకి తీసుకొచ్చేందుకు నిర్వాహకులు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటిది దీపిక రంగరాజు ఇప్పటి వరకు బిగ్‌బాస్‌లో అడుగుపెట్టడం ఆమె అభిమానులను నిరాశ పరిచింది. కొద్దిరోజుల క్రితం జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా ప్రసారమైన కిస్సిక్ టాక్స్ షోకి హాజరైన దీపిక రంగరాజు.. బిగ్‌బాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బిగ్‌బాస్‌కి వెళ్లిపోతే మా ఆడియన్స్ పరిస్ధితి ఏంటని వర్ష అడగ్గా.. అసలు నేను బిగ్‌బాస్‌కి వెళ్లలేదు. నాకు కొంతమంది మెసేజ్ చేయడం, ఫోన్లు చేసి మరి బిగ్‌బాస్‌కి వెళ్తున్నావా అని అడుగుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఫస్ట్ ఇయర్ నుంచి నేను బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నానని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ నేను ఇంత వరకు బిగ్‌బాస్‌కి వెళ్లలేదు. ప్రస్తుతం సీరియల్ జరుగుతుంది కదా? ఇలాంటి టైంలో నేను బిగ్‌బాస్‌కి వెళ్తే దానికి మీనింగ్ ఉండదు. బ్రహ్మముడి సీరియలే లైఫ్ ఇచ్చింది, బ్రహ్మముడి ముగిసిన తర్వాత వెళ్తే బాగుంటుందని దీపిక రంగరాజు పేర్కొంది.

బిగ్‌బాస్ టీమ్ నుంచి నాకు కాల్ కూడా రాలేదు, నన్ను పిలవలేదు. బిగ్‌బాస్‌కి వెళ్లాలని చాలా ఇష్టం. అక్కడ ఎంతమంది ఉన్నా నా నోటితోనే సమాధానం చెబుతా. నా లైఫ్‌లో కాలేజ్, స్కూల్‌లో ఫ్రెండ్స్‌తో ఎన్నాళ్ల నుంచి కలిసున్నా ఎప్పుడూ గొడవలు జరగలేదు, ఎవరినీ హర్ట్ చేయలేదు. ఇవన్నీ కాలిక్యులేట్ చేసి.. ఒకవేళ నేను బిగ్‌బాస్‌కి వెళితే పెద్దగా ఎవరినీ హర్ట్ చేయను, వాళ్లతో ఫైట్ చేయను, సర్దుకుపోతా. అడ్జెస్ట్ అయ్యే క్వాలిటీ నాలో చిన్నప్పటి నుంచి ఉంది. నన్ను ట్రిగ్గర్ చేయాలనుకున్నా చేయలేరు అని దీపిక వెల్లడించింది.

నేను నా వరల్డ్‌లో ఉంటాను. మిగతా వాళ్లని పెద్దగా పట్టించుకోను. ఎదుటివాళ్లను పట్టించుకుంటేనే కదా, తలనొప్పి అవన్నీ. వాళ్ల విషయాలపై మైండ్ పెట్టకూడదు.. మనం మనలోపల హ్యాపీగా వైబ్ చేసుకోవాలి. ఫ్యూచర్‌లో ఖచ్చితంగా బిగ్‌బాస్‌కి వెళ్తా.. బిగ్‌బాస్ వాళ్లు నన్ను పిలవాలని కోరుకుంటున్నా. బిగ్‌‌బాస్‌లోకి వెళ్లాక విన్నర్ ట్రోఫీ నా చేతుల్లోకి రావాలి, నాగార్జున సార్ నా చేతిని ఇలా ఎత్తాలి.. ది విన్నర్ ఈజ్ దీపిక అని చెప్పాలి. నాకు విజయ్ దేవరకొండ గారు క్రష్. కానీ అదే క్రష్ నాగార్జున గారిని చూసినా అనిపిస్తుంది. ఒకరోజు ఒక షోలో ఆయన్ను డైరెక్ట్‌గా చూశా. ఆరోజు నేను మాట్లాడినదంతా నిజమే. కానీ అది స్క్రిప్ట్ కాదు.. ఆ టైంలో ఏమనిపించిందో అది మాత్రమే మాట్లాడా. ఆయన ఛార్మ్‌ని అట్రాక్ట్ చేసి లోపలి నుంచి వచ్చిన మాటలే అవన్నీ అని దీపిక రంగరాజు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. త్వరలోనే దీపిక బిగ్‌బాస్‌కి వెళ్లాలని ఆమె అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X