‘విజయ్ దేవరకొండతో లిప్‌లాక్‌కి రెడీ.. నా తర్వాతే రష్మిక’

బ్రహ్మముడి సీరియల్‌తో తెలుగు నాట పాపులర్ అయ్యారు కావ్య అలియాస్ దీపిక రంగరాజు. పుట్టింటికి, మెట్టింటికి వారధిగా, భర్తకు తోడుగా నిలిచే కావ్య అనే ఇల్లాలి పాత్రతో ఆమె ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యారు. సీరియల్‌తో పాటు తెలుగులోని పలు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌లో షోలలో పాల్గొంటూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు దీపిక. ఎక్కడున్నా సరే తన ఎనర్జీతో జోష్ తీసుకొచ్చే ఈ ముద్దుగుమ్మ.. కొద్దిరోజుల క్రితం జబర్దస్త్ కమెడియన్ వర్ష నిర్వహిస్తోన్న కిస్సిక్ టాక్ షోకు గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

తమిళనాడుకు చెందిన దీపికా రంగరాజు బీటెక్ పట్టభద్రురాలు. చిన్నప్పటి నుంచి చదువుతో పాటు కల్చరల్ ఈవెంట్స్‌లో దీపిక చురుగ్గా ఉండేవారు. బీటెక్ తర్వాత ఓ తమిళ ఛానెల్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన దీపికకు.. చిత్రిరమ్ పెసుతాడి అనే సీరియల్‌‌లో అవకాశం వచ్చింది. అయితే నటనా రంగం వైపు కూతురిని పంపడానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయితే అమ్మానాన్నల అభిష్టానికి వ్యతిరేకంగా నటన వైపు అడుగులు వేశారు దీపిక. న్యూస్ రీడర్‌గా ఉద్యోగాన్ని పక్కనపెట్టి నటిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు దీపిక రంగరాజు.

Deepika Rangaraju Opens Up About Crush on Akkineni Nagarjuna and Bold Take on Vijay Deverakonda

ఆ సీరియల్‌లో ఆమె నటనకు మహిళా ప్రేక్షకుల ప్రశంసలు దక్కాయి. ఈ ఫేమ్‌తో తెలుగులో బ్రహ్మముడి ధారావాహికలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కింది. అయితే అంతకంటే ముందే సూపర్‌హిట్ తెలుగు సీరియల్ కార్తీక దీపంలో దీప క్యారెక్టర్ వేసే అవకాశం ముందు ఆమెకే వచ్చింది. కానీ పలు కారణాలతో ఈ ఆఫర్‌ను వదులుకున్నారు దీపిక. అయినప్పటికీ బ్రహ్మముడితో ఆ లోటు తీరింది. బిగ్‌బాస్ తెలుగులోనూ కంటెస్టెంట్స్ జాబితాలో దీపిక పేరు పలుమార్లు వచ్చింది. అయితే అవన్నీ పుకార్లుగా నిలిచాయి. కొద్దిరోజుల క్రితం కిస్సిక్ టాక్ షోలో ఆమె ఏం చెప్పారంటే?

బ్రహ్మముడి సీరియల్‌లో ఆఫర్ దొరకడం ఒక అదృష్టమైతే, మానస్ దొరకడం ఇంకొక అదృష్టం. మానస్ దొరకడం శ్రీజకి అదృష్టం. అతను ఆమె దగ్గర కంటే నా దగ్గరే ఎక్కువ ఉంటున్నాడు. మానస్ అన్ని విషయాల్లో చాలా సపోర్టివ్‌గా ఉంటాడు, నాకు డ్యాన్స్ రాదు.. కానీ సీరియల్స్‌లో ఏదో ఒక ఫంక్షన్ వస్తుంది. దీపావళి, సంక్రాంతి అన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. అలాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు హీరో హీరోయిన్లకు ఒక సాంగ్ ఉంటుంది. తనకు డ్యాన్స్ రాదు కదా? ఆమెను ఎందుకు అవమానించాలి? అనే ఉద్దేశంతో నా చేయి పట్టుకుని తనే ఏదో కవర్ చేసేస్తాడని దీపిక రంగరాజు చెప్పింది.

ఆన్‌స్క్రీన్ మీద రొమాంటిక్ సీన్ చేయాల్సి వస్తే ఏ హీరోతో చేస్తావని వర్ష అడగ్గా.. ఏ హీరో అయినా పర్లేదు చేస్తా. వాళ్లు సిగ్గుపడతారేమో కానీ నాకు సిగ్గు, మొహమాటం ఏం లేవు. ఆర్టిస్ట్ అనే వాళ్లు నో చెప్పకూడదు, కెమెరా ముందు ఎలాంటి సీన్ చేయడానికైనా వెనుకాడకూడదు. బ్రహ్మముడి సీరియల్ నాకు లైఫ్ ఇచ్చింది.. ఈ సీరియల్ తర్వాతే ఏదైనా. ఇన్నేళ్లుగా ఫ్రెండ్స్‌తో ఉన్నా ఎవరితోనూ నాకు గొడవలు లేవు. ఎవరినీ హార్ట్ చేయలేదు. ఎంత కంట్రోల్డ్‌గా ఉందామన్నా కొందరు ట్రిగ్గర్ చేస్తారు.. కానీ నేను ఎవరికీ ఆ ఛాన్స్ ఇవ్వను. నా ప్రపంచంలో నేను ఉంటా.. ఎవరినైనా పట్టించుకుంటేనే కదా తలనొప్పి, టెన్షన్స్. వాళ్ల మీద మైండ్ పెట్టకోకుండా ఉంటే చాలు అని దీపిక తెలిపింది.

నాగార్జున గారంటే నాకు చాలా ఇష్టం. మన ఏజ్ వాళ్లలో విజయ్ దేవరకొండగారు అంటే క్రష్. కానీ నాకు సేమ్ క్రష్.. నాగార్జున గారిని చూసినప్పుడల్లా వస్తుంది. ఒకరోజు ఆయనని డైరెక్ట్‌గా చూశా, ఆ రోజు నేను మాట్లాడింది అంతా నిజం, స్క్రిప్ట్ కాదు. నాకు ఆ టైంలో ఏం అనిపించిందో అది మాత్రమే మాట్లాడాను. నాకు లోపల నిజంగా ఆశపడి, ఆయన ఛార్మ్‌ని, అలా అట్రాక్ట్ చేయడంతో మాట్లాడిన మాటలే. విజయ్ దేవరకొండగారితో కిస్ సీన్ చేయాలంటే చేస్తావా అని వర్ష అడగ్గా.. రష్మిక గారేంటీ? నేనెంత బాగా చేస్తానో తెలుసా? అని దీపిక రంగరాజు బోల్డ్‌గా ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X