Brahmamudi కావ్య దశ తిరిగిందిగా.. ఏకంగా నేచురల్ స్టార్ నానితో!
బుల్లితెర నటీనటులు ప్రస్తుతం జోరు పెంచుతున్నారు. టెలివిజన్ రంగంలో పాపులారిటీ సంపాదించి ఈ ఫేమ్‌తో సినిమాల్లోనూ అవకాశాలు అందుకుని జోరు పెంచుతున్నారు. ఇప్పటి వరకు వాణిజ్య ప్రకటనల్లో సినీతారలదే హవా.. ఇప్పుడు వారికి గట్టి పోటీ ఇస్తున్నారు బుల్లితెర నటులు. కుటుంబ ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా పేరున్న సంస్థలు వారితో యాడ్స్ చేయించుకుంటున్నాయి. ఎంత కావాలంటే అంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదు. తాజాగా ఈ లిస్ట్‌లో చేరారు బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ కావ్య అలియాస్ దీపికా రంగరాజు.
స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్‌లో కావ్య పాత్ర పోషిస్తున్నారు దీపికా రంగరాజు. తమిళనాడుకు చెందిన ఈ ముద్దుగుమ్మ ఈ ధారావాహిక ద్వారా తెలుగువారికి బాగా పరిచయమయ్యారు. భర్త కోసం ఎంతకైనా వెళ్లే భార్యగా .. మెట్టినింటికి కష్టం వస్తే అండగా నిలిచే కోడలిగా అద్భుతంగా నటిస్తున్నారు దీపిక. బీటెక్ పట్టభద్రురాలైన దీపిక తొలుత న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఈ క్రమంలో తమిళ సీరియల్ చిత్రమ్ పెసుతాడిలో అవకాశం వచ్చింది. ఇందులో అద్భుతంగా నటించిన ఈమె ఇక ఫుల్ టైం నటిగా సెటిలవ్వాలని నిర్ణయించుకుంది.

యూట్యూబర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మంచి పాపురాలిటీ దక్కించుకున్న దీపికకు స్టార్ మా నుంచి కబురొచ్చింది. బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్‌గా ఆమె పర్ఫెక్ట్‌గా సెట్ అవుతారని గ్రహించిన దర్శక నిర్మాతలు అవకాశం కల్పించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కావ్య పాత్రకు న్యాయం చేసి బ్రహ్మముడి సక్సెస్ కావడంలో తన వంతు పాత్ర పోషించారు. ఈ సీరియల్‌తో వచ్చిన ఫేమ్‌తో దీపికకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. సీరియల్స్ పాటు బుల్లితెరపై స్పెషల్ షోలు, ఈవెంట్స్‌కు దీపిక హాజరై సందడి చేస్తుంది.
గతేడాది ముగిసిన బిగ్‌బాస్ తెలుగు 8లో హౌస్‌లో అడుగుపెట్టి రచ్చ రచ్చ చేసింది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత వివరాలు, సీరియల్స్, షోలు ఇతర వివరాలను పంచుకుంటూ ఉంటారు దీపిక రంగరాజు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో , నేచురల్ స్టార్ నానితో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసి కలకలం రేపారు. సీరియల్స్‌తో వచ్చిన పాపులారిటీతో వాణిజ్య ప్రకటనలు, బ్రాండ్ ఎండార్సింగ్ చేస్తున్నారు దీపిక. ఈ క్రమంలోనే ఆమెకు నానితో కలిసి యాడ్ చేసే అవకాశం దక్కింది.
ఆశీర్వాద్ బ్రాండ్ కోసం వీరిద్దరూ ఓ వాణిజ్య ప్రకటనలో కలిసి నటించారు. ఈ యాడ్‌లో నానికి చెల్లెలిగా నటించింది దీపిక. యాడ్ విషయానికి వస్తే నాని సినిమాలను దీపిక ఫోన్‌లో చూస్తూ కిచెన్‌లో వంట చేస్తుండగా.. ఆమె వంటకాల వాసనలు షూటింగ్‌లో ఉన్న నాని దాకా వెళ్తాయి. అంతే ఫోన్‌లో నుంచి నాని దీపిక ముందు ప్రత్యక్షమవుతాడు. నీ వంటలో భలే దమ్ముంది అంటాడు.. మీ అంత దమ్మున్న కారమే వాడున్నా అన్నయ్యా అంటూ ఆశీర్వాద్ బ్రాండ్ చూపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











