twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీరియల్‌ హీరోయిన్ కి రూ.16లక్షలకు ఫైన్, ఏం తప్పు చేసిందంటే...

    సెట్ కు రోజూ లేటుగా వస్తున్న టీవి సీరియల్ హీరోయిన్ కు నిర్మాతలు 16 లక్షలు ఫైన్ వేసారు.

    By Srikanya
    |

    ముంబయి: సినిమాల్లో ఆర్టిస్ట్ లు షూటింగ్ లేటు గా రావటం, అందుకు పెద్ద నిర్మాతలు అయితే మండిపడటం, చిన్న నిర్మాతలు అయితే బ్రతిమిలాడటం వంటివి చేస్తూంటారు. అలాగే ఆర్టిస్ట్ లు కూడా పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు అయితే ఓ రకంగా, చిన్న నిర్మాతలు అయితే ఓ రకంగా ఉంటారు. ఆడేసుకుంటూంటారు.

    టీవి తెరపై ఇలాంటి సీన్స్ అరుదుగా జరుగుతూంటాయి. అలాంటి పరిస్దితి వచ్చినా ఎడ్జెస్ట్ అయ్యిపోతూంటారు. కానీ 'ఈతరం ఇల్లాలు' నిర్మాతలు మాత్రం మేము మోనార్క్ ల మి..మేము డబ్బు పే చేసేటప్పుడు షూటింగ్ కు టైమ్ కు రావాల్సిందే అంటున్నారు.

    అయినా ఓ రోజు లేటుగా వచ్చారంటే క్షమించవచ్చు. రోజూ లేటుగా వస్తూంటే ఎలా అంటూ మండిపడుతున్నారు. ఇంతకీ ఎవరు లేటుగా వస్తున్నారు అంటే ఆ టీవి సీరియల్ హీరోయిన్ . అలా లేటుగా రావటం కూడా ఏ స్దాయిలో అంటే సాయింత్రం నాలుగు గంటలకు వస్తున్నారట. దాంతో వాళ్లకు ఒళ్లు మండింది..మేము నీ వల్ల చాలా నష్టపోయాం , పదహారు లక్షలు ఫైన్ వేసాం కట్టు అంటున్నారు. ఆ వివరాలు క్రింద చూద్దాం.

    ఈ మె పైనే...

    ఈ మె పైనే...

    నార్త్ లోనే కాదు, సౌత్ లోనూ టీవి తెరపై వెలిగిపోతున్న ప్రముఖ నటి దీపికా సింగ్‌ కే ఈ ఫైన్ తలనొప్పి చుట్టుకుంది. ఆమె ‘దియా ఔర్‌ బాటి హమ్‌ ' సీరియల్‌లో ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీరియల్‌ని తెలుగులో ‘ఈతరం ఇల్లాలు' టైటిల్‌తో ప్రసారం చేస్తున్నారు.

    నోటీసులు జారీ

    నోటీసులు జారీ

    అయితే దీపిక ఈ సీరియల్‌ సెట్‌కు ఆలస్యంగా వస్తున్నారట అందుకు రూ.16లక్షలు చెల్లించాలని నిర్మాతలు నోటీసులు జారీ చేశారు. దాంతో వివాదం మొదలైంది. ఆమె పై చర్యలు తీసుకోవాల్సిందే అని నిర్మాతలు వాదిస్తూంటే, అదేం కుదరదు అంటున్నారు దీపిక. నా తప్పేం లేదు అని ఆమె అంటున్నారు.

    కోట్లు ఎగ్గొట్టడానికే

    కోట్లు ఎగ్గొట్టడానికే

    అయితే ఈ నిర్మాతలకూ, ఈ హీరోయిన్ కు మధ్య వివాదం తొలిసారి కాదు.. నిర్మాతలు దీపికకు పారితోషికం రూ.1.14 కోట్లు చెల్లించాల్సి ఉందని, అయితే తాము రూ.67 లక్షలు మాత్రమే చెల్లించగలమని నిర్మాతలు చెప్పడంతో ఆమెకు, వారికి మధ్య వివాదం ఏర్పడినట్లు గతంలో వార్తలొచ్చాయి. డబ్బు ఎగ్గొట్టడానికే ఈ ఎత్తు అని ఆమె తరపు వాళ్లు అంటున్నారు.

    ఆ గొడవ తప్పుకోవటానికే

    ఆ గొడవ తప్పుకోవటానికే

    ఈ వివాదంలో దీపిక సినీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ను కలిసినట్లు కూడా చెప్పారు. తర్వాత రూ.67 లక్షలు చెల్లించినట్లు సమాచారం లేదు. అయితే ఇప్పుడు నిర్మాతలు ఆమె సెట్‌కు ఆలస్యంగా వచ్చారంటూ రూ.16 లక్షలు ఇవ్వాలని నోటీసులు పంపడం షాకింగ్‌ న్యూస్‌ అయింది.

    నిజమే..లేటుగానే వచ్చేది

    నిజమే..లేటుగానే వచ్చేది

    నిజంగానే దీపిక సెట్‌కు ఆలస్యంగా వచ్చేవారని, అయితే తన సహనటుడు అనాస్‌ రషిద్‌ కారణంగా ఇలా వచ్చేవారని సమాచారం. ఉదయం 10 గంటలకు సెట్‌కు హాజరుకావాల్సిన అనాస్‌ సాయంత్రం 4 గంటలకు వస్తే.. ఆయన లేకుండా ఆమె మాత్రం ముందుగా వచ్చి ఏం చేయాలని ప్రియాంక సహచరులు చెప్పినట్లు తెలుస్తోంది.

    గొడవ జరిగిన మాట వాస్తవం

    గొడవ జరిగిన మాట వాస్తవం

    దీపిక, నిర్మాతల వివాదాన్ని నిజం చేస్తూ.. ‘అవును.. దీపికకు నిర్మాతలు శశి, సుమీత్‌తో వివాదం జరిగింది. కానీ సమస్య తీరే వరకు ఈ సంఘటన గురించి నేను వివరించలేను. వివరాలు సేకరించి సమస్యను పరిష్కరిస్తాం' అని ఇండియన్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌(ఐఎఫ్‌టీపీసీ) ఛైర్మన్‌ అన్నారు.

    సూపర్ హిట్ సీరియల్

    సూపర్ హిట్ సీరియల్

    స్టార్‌ప్లస్ చానెల్లో ప్రసారమవుతోన్న ‘దీయా ఔర్ బాతీ హమ్' సీరియల్ (తెలుగులో ‘ఈతరం ఇల్లాలు'గా వస్తోంది) 2011లో ప్రారంభమయ్యింది. అనతి కాలంలోనే సూపర్ హిట్ అయ్యింది. బలమైన కథ, ఆసక్తికరమైన కథనాలు సీరియల్‌ని రక్తి కట్టిస్తే... హీరోయిన్ దీపికాసింగ్ నటన ప్రేక్షకుల్ని కట్టిపడేసింది.

    స్వీట్స్ వ్యాపారం చేసే

    స్వీట్స్ వ్యాపారం చేసే

    సీరియల్‌లో దీపిక పాత్ర పేరు సంధ్య. ఆమెకి పోలీసాఫీసర్ కావాలని కోరిక. అయితే అనుకోని పరిస్థితుల్లో స్వీట్స్ వ్యాపారం చేసే సూరజ్‌తో పెళ్లవుతుంది. ఓ పేదపిల్లను కోడలిగా అంగీకరించలేని సూరజ్ తల్లి, సంధ్యని నరకయాతన పెడుతుంది.

    కష్టపడి ఐపీఎస్

    కష్టపడి ఐపీఎస్

    సూరజ్ తల్లి పెట్టే బాధలన్నిటినీ ఓపికగా భరించి అత్తగారి మనసును గెలుచుకుంటుంది సంధ్య. పోలీసాఫీసర్ అవ్వమంటూ అత్తగారు ప్రోత్సహించడంతో కష్టపడి చదివి ఐపీఎస్ పాసవుతుంది. ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తుంది. అయితే తర్వాత ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అన్నదే కథ.

    హుందాతనం ఏది

    హుందాతనం ఏది

    ఈ సీరియల్ కథలో...మూడేళ్లపాటు అత్తగారి ఆరళ్లతోనే సాగిపోయింది సంధ్య జీవితం. ఆ తర్వాత పోలీస్ అయ్యింది. అయ్యిందన్నమాటే కానీ... సంధ్యలో ఆ హుందాతనం లేదు అంటారు వీక్షకులు.ఈ విషయమై చాలా విమర్శలు వచ్చాయి.

    కరుకుదనం ఏది

    కరుకుదనం ఏది

    దీపిక పాత్రలో ..పోలీసులో ఉండాల్సిన కరకుదనం కాస్తయినా కనిపించడం లేదు. ఏవైనా వృత్తిపరంగా ఛాలెంజ్ లు ఎదురైనప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఓ కోడలిగా ఉన్నప్పుడు ఇచ్చిన బేల ఎక్స్‌ప్రెషన్సే ఇస్తూ ఉంటుంది.

    దీపిక

    దీపిక

    దీపిక పాత్ర అవసరాన్ని బట్టి ఆవేశాన్ని ప్రదర్శిస్తుంది కానీ... అటువంటి సీన్ లోనూ ఆమెలో సాఫ్ట్‌నెస్ మాత్రమే కనిపి స్తోంది. దాంతో ఒకప్పుడు సీరియల్‌కి ప్లస్ అయిన ఆమే ఇప్పుడు సీరియల్‌కి మైనస్ అయ్యిందనే విమర్శలు వస్తున్నాయి. ఆమెతో ఏవేవో సాహసాలు చేయించేద్దామని చూడకుండా... దర్శకుడు వీలైనంత త్వరగా కథకు ఫుల్‌స్టాప్ పెడితే మంచిదని కొన్ని సలహాలు కూడా వచ్చాయి.

    English summary
    Popular television actress Deepika Singh, who played the female lead role of Sandhya Rathi in Diya Aur Baati Hum, has reportedly been slapped with a notice to pay Rs 16 lakh by the show's producers Shashi and Sumeet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X