అదే నా విజయం, కౌశల్ మీద కక్ష లేదు, తేజూ లైట్ తీస్కోవాలి: దీప్తి నల్లమోతు

బిగ్‌బాస్ తెలుగు 2లో ఫైనల్ వరకు చేరుకుని.... ఐదుగురు ఫైనలిస్టుల్లో 4వ స్థానంలో నిలిచిన దీప్తి నల్లమోతు.... బిగ్‌బాస్ ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత తొలిసారి అభిమానులతో లైవ్ చాట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు ఫ్యాన్స్ మీరు సెకండ్ పొజిషన్లో ఉంటారని ఆశించాం... కానీ అలా జరుగలేదు అంటూ నిరాశ వ్యక్తం చేశారు. దీంతో పాటు కౌశల్ గురించి, తేజూ గురించి కూడా కొందరు ఫ్యాన్స్ ప్రస్తావించారు. కొందరైతే అక్కా నువ్వు హీరోయిన్‌గా ట్రై చేయాలంటూ సూచించారు. దీనికి దీప్తి తనదైన రీతిలో సమాధానాలిచ్చారు.

అదే నేను సాధించిన విజయం

అదే నేను సాధించిన విజయం

అందరూ అదే చెబుతున్నారు సెకండ్ పొజిషన్ యూ ఓన్లీ అని, సెకండ్ పొజిషన్ నాకే వస్తే బావుండు అని మీరంతా చెబుతున్నారు కదా... ఇలా మీరు అనుకుంటున్నారంటే నేను మీ మనసు గెలిచినట్లే... మీ అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌లో మీరు ఉన్నారంటే అంతకంటే పెద్ద విజయం ఏమీ ఉండదు.... అని దీప్తి వ్యాఖ్యానించారు.

 తేజూ లైట్ తీసుకోవాలి

తేజూ లైట్ తీసుకోవాలి

మీ స్పోర్టివ్ స్పిరిట్ తేజూ తీసుకోలేక పోతోంది అంటూ ఓ అభిమాని వ్యాఖ్యానించగా.... ‘‘చిల్... షో అయితే అయిపోయింది కదా. ఇక అన్నీ లైట్ తీస్కోవాలి' అంటూ దీప్తి సమాధానం ఇచ్చారు.

అదే ఛానల్‌లో కంటిన్యూ అవుతాను

అదే ఛానల్‌లో కంటిన్యూ అవుతాను

బిగ్‌బాస్ ముగిసింది కదా... నెక్ట్స్ ప్లాన్స్ ఏమిటి? అనే ప్రశ్నకు దీప్తి రియాక్ట్ అవుతూ.... టీవీ9 తోనే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. అయితే ఒక 15 రోజులు రిలాక్స్ అయిన తర్వాత జాబ్‌లో జాయిన్ అవుతాను అని దీప్తి అన్నారు.

దీప్తి నల్లమోతు హీరోయిన్‌గా ట్రై చేయాలి

దీప్తి నల్లమోతు హీరోయిన్‌గా ట్రై చేయాలి

కొందరు అభిమానులు అక్కా నువ్వు సినిమా హీరోయిన్‌గా ట్రై చేయండి, సినిమాల వైపు రండి అంటూ కామెంట్ పెట్టగా... ‘అంత సినిమా లేదిక్కడ' అంటూ దీప్తి వ్యాఖ్యానించారు.

 చెలరేగిపోదాం....

చెలరేగిపోదాం....

‘వి వాంట్ ఫ్యాన్ మీట్ సెలబ్రేషన్స్' అంటూ ఓ అభిమాని కోరగా.... ‘‘ఎప్పుడమ్మా.. ఎక్కడమ్మా.. విజయవాడలోనా? అరేంజ్ చేయండి మనం చెలరేగిపోదాం'' అంటూ దీప్తి వారిలో మరింత జోష్ నింపింది.

నాకు నేను గర్వంగా అనిపిస్తోంది

నాకు నేను గర్వంగా అనిపిస్తోంది

మీ మీద బిగ్ బాస్ కామెడీ చేశారు కదా... ఎలా అనిపిస్తోంది?అని ఓ అభిమాని ప్రశ్నించగా.... చాలా బాగా అనిపిస్తోంది. ఎవరి మీద జరుగని కామెడీ నా మీద జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఏడవాలన్నా, నవ్వాలన్నా నన్నే చూపించేవారు. నాలో ఫైటింగ్ స్పిరిట్ మీరందరూ సూపర్ అంటున్నారు. గ్రాండ్ ఫినాలె వరకు తీసుకొచ్చారు. ఇన్ని మిక్ట్స్ ఎమోషన్స్, మిక్డ్స్ ఫీలింగ్స్ నాకు ఉండటం అనేది నాకు నేను గర్వంగా ఫీలవుతున్నాను... అని దీప్తి వెల్లడించారు.

 హోస్ట్ నాని గురించి

హోస్ట్ నాని గురించి

నానిగారు చాలా బ్యూటిఫుల్‌గా షోను హ్యాండిల్ చేశారు. యాంకరింగ్ మాత్రమే కాకుండా ఆ షోను ఓన్ చేసుకుని చేశారు. ఆయన స్టైల్, తీసుకున్న రెస్పాన్సిబిలిటీ , ఓన్ చేసుకున్న విధానం అద్భుతమని దీప్తి చెప్పుకొచ్చారు.

 కౌశల్ మీద కక్షలేదు

కౌశల్ మీద కక్షలేదు

మీరు కౌశల్‌తో ముందు బావున్నారు... తర్వాత ఎందుకు అలా ఉన్నారు? అని ఓ అభిమాని ప్రశ్నించగా.... ‘బిగ్‌బాస్ హౌస్ లో సిచ్యువేషన్స్ బట్టి ఒక్కోసారి ఒక్కోలా ఉండాల్సి ఉంటుంది. కౌశల్‌తో వ్యతిరేకంగా ఉండాలని మనసులో అయితే ఏమీ ఉండదు. కొన్ని సార్లు గొడవలైన తర్వాత కూడా నేనే వెళ్లి కౌశల్‌తో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి.... అని దీప్తి వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X