For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Deepthi Shanmukh Breakup: దీప్తి సునైనా సంచలన ప్రకటన.. న్యూ ఇయర్‌ రోజు షణ్ముఖ్‌కు షాక్.. అందుకేనట!

  |

  కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా హాట్ టాపిక్ అవుతోన్న అంశాల్లో షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైనా బ్రేకప్ స్టోరీ ఒకటి. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీళ్లిద్దరూ.. దూరం కాబోతున్నారంటూ ఇటీవల తెగ ప్రచారం జరుగుతోంది. దీనికి అనుగుణంగానే ఎన్నో రకాల అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. వాటికి బలం చేకూర్చే విధంగా దీప్తి తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేస్తూనే వస్తోంది.

  అంతలోనే షణ్ముఖ్ తాము విడిపోలేదని లైవ్ పెట్టి మరీ చెప్పాడు. దీంతో వీళ్లిద్దరి అభిమానులే కాకుండా సామాన్యులు కూడా అసలేం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యూ ఇయర్ రోజున షణ్ముఖ్‌కు పెద్ద షాకిచ్చింది దీప్తి. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

  బిగ్ బాస్ ఎంట్రీ.. దీప్తి ఫుల్ సపోర్ట్

  బిగ్ బాస్ ఎంట్రీ.. దీప్తి ఫుల్ సపోర్ట్

  తెలుగులో సూపర్ డూపర్ సక్సెస్‌ఫుల్ షో బిగ్ బాస్ ఐదో సీజన్‌‌లోకి 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో చాలా మంది ప్రేక్షకులకు పరిచయం అయిన వాళ్లే ఉన్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన షణ్ముఖ్ జస్వంత్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభంలోనే అతడిని టైటిల్ విన్నర్ అనుకున్నారు. దీనికితోడు అతడి ప్రేయసి దీప్తి సునైనా కూడా బయట నుంచి అతడికి ఎంతో సపోర్ట్ చేసింది. అంతేకాదు, అతడిని విమర్శించిన వాళ్లతో గొడవ కూడా పడేది. ఆమె మద్దతు షన్నూ బాగా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు.

  సుధీర్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు: షేక్ హ్యాండ్ ఇస్తే అంతే సంగతులు.. దూరంగా ఉండమంటూ ఘోరంగా!

  సిరితో రొమాన్స్ చేయడంతో రచ్చ

  సిరితో రొమాన్స్ చేయడంతో రచ్చ

  బిగ్ బాస్ షో కంటే ముందే షణ్ముఖ్ జస్వంత్‌కు సిరి హన్మంత్ ఫ్రెండ్. దీంతో హౌస్‌లో కూడా ఆరంభం నుంచే వీళ్లిద్దరూ సన్నిహితంగా ఉన్నారు. అంతేకాదు, ఎప్పుడూ కలిసే ఉండడం.. కలిసే ఆడడం.. కలిసే తినడం.. కలిసే పడుకోవడం వంటివి చేశారు. అంతేకాదు, తరచూ ముద్దులు.. హగ్గులు చేసుకోవడం వంటి వాటితో రెచ్చిపోయారు. అంతేకాదు, ఒకానొక సందర్భంలో ఇద్దరం బాగా కనెక్ట్ అయ్యాం అని కూడా చెప్పుకున్నారు. పలుమార్లు ప్రపోజ్ కూడా చేసుకున్నారు. దీంతో వీళ్లిద్దరి రిలేషన్‌పై సోషల్ మీడియాలో దారుణంగా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

  షణ్ముఖ్‌కు మైనస్.. ఓడిపోయాడు

  షణ్ముఖ్‌కు మైనస్.. ఓడిపోయాడు

  టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన షణ్ముఖ్ జస్వంత్.. వ్యవహార శైలితో ఎలా ఉన్నా ఆట పరంగా ఆకట్టుకోవడంతో టాప్‌ 5లో నిలిచి ఫినాలేలో అడుగు పెట్టాడు. దీంతో అతడు ఈ సీజన్‌లో గెలుస్తాడని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగానే ఓట్లు కూడా భారీ స్థాయిలో పోలయ్యాయి. కానీ, చివర్లో అతడు సిరి హన్మంత్‌తో వ్యవహరించిన తీరుతో విమర్శలు ఎదుర్కోవడంతో పాటు ఓటింగ్‌లోనూ కొంత వెనకబడ్డాడు. అదే సమయంలో అతడి కంటే సన్నీకి ఎక్కువ ఓట్లు రావడంతో ఐదో సీజన్‌లో విన్నర్‌గా నిలిచాడు. దీంతో షణ్ముఖ్ జస్వంత్ రన్నర్‌గా మిగిలాడు.

  Bigg Boss: మరో బాంబ్ పేల్చిన దీప్తి సునైనా.. షణ్ముఖ్‌కు బిగ్ షాక్.. విడిపోతున్నట్లు చెప్పేసిందా!

  బ్రేకప్ చెప్పుకోబోతున్నారు అంటూ

  బ్రేకప్ చెప్పుకోబోతున్నారు అంటూ

  బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో సిరి హన్మంత్‌తో రొమాన్స్ చేయడం వల్ల షణ్ముఖ్ జస్వంత్ ఇమేజ్ ఓ రేంజ్‌లో డ్యామేజ్ అయిపోయింది. మరీ ముఖ్యంగా అతడు వ్యవహరించిన తీరుపై భారీ స్థాయిలో విమర్శలు చెలరేగాయి. దీంతో అతడిపై ప్రియురాలు దీప్తి సునైనా కూడా కోపంగా ఉందని ప్రచారం జరిగింది. అంతేకాదు, ఆమె షణ్ముఖ్ జస్వంత్‌కు బ్రేకప్ కూడా చెప్పేసిందన్న టాక్ వినిపించింది. అందుకు అనుగుణంగానే ఆమె ఆ మధ్య కొన్ని పోస్టులు చేసింది. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఫలితంగా ఈ వ్యవహారం మరింత హైలైట్ అయింది.

  తనను బ్లాక్ చేసిందని ఒప్పుకుని

  తనను బ్లాక్ చేసిందని ఒప్పుకుని

  బ్రేకప్‌పై ఎన్నో రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటీవలే షణ్ముఖ్ జస్వంత్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లైవ్ నిర్వహించాడు. ఇందులో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడించాడు. ఇక ఈ సెషన్‌లో అతడి అభిమానులంతా దీప్తి సునైనా గురించి, బ్రేకప్‌పై వస్తున్న వార్తల గురించి షణ్ముఖ్‌ను ప్రశ్నించాడు. దీంతో దీనిపై అతడు క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం తనను దీప్తి సునైనా బ్లాక్ చేసిందని.. తన కోపం తగ్గే వరకూ డిస్టర్బ్ చేయనని చెప్పాడు. అంతేకాదు, తన చేతిపై ఉన్న పచ్చబొట్టు పోయే వరకూ దీప్తిని వదిలిపెట్టనని గట్టిగా చెప్పుకొచ్చాడు.

  Akhanda OTT: బాలయ్య సినిమా స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్.. పండుగ కానుకగా ఆరోజే.. మరి టీవీలో ఎప్పుడంటే!

  బ్రేకప్‌ను ప్రకటించిన దీప్తి సునైనా

  బ్రేకప్‌ను ప్రకటించిన దీప్తి సునైనా

  ఒకవైపు దీప్తి సునైనా అనుమానం కలిగించే పోస్టులు.. మరోవైపు షణ్ముఖ్ జస్వంత్ అలాంటిదేమీ లేదని చెప్పడం వంటి వాటితో వీళ్లిద్దరి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా దీప్తి సునైనా సోషల్ మీడియా వేదికగా షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్పేసింది. ఈ మేరకు ఓ సుదీర్ఘమైన పోస్టును కూడా చేసింది. 'చాలా ఆలోచనలు, చర్చల తర్వాత షన్నూ, నేనూ పరస్పరంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై ఇద్దరం వేరే వేరే దారుల్లో నడవబోతున్నాం' అంటూ న్యూ ఇయర్ రోజునే భారీ షాక్ ఇచ్చేసింది.

  అందుకే విడిపోతున్నామని పోస్ట్

  అందుకే విడిపోతున్నామని పోస్ట్

  బ్రేకప్‌ను ప్రకటించేందుకు దీప్తి సునైనా సుదీర్ఘమైన పోస్టు చేసింది. 'ఈ ఐదు సంవత్సరాల్లో మేము సంతోషంగా ఉండడంతో పాటు చాలా మందిని ఎదుర్కోవాల్సి వచ్చింది. మీరందరూ కోరుకున్నట్లుగా మేము కూడా కలిసుండాలి అనుకున్నాం. కానీ, అది కుదరడం లేదు. సోషల్ మీడియాలో కనిపించినంత తేలికైన ప్రయాణం కాదిది. కలిసుండాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. అయితే, కష్టంగా కలిసుండడం కంటే ఇష్టంగా విడిపోవడమే బెటర్ అని అనిపించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము' అంటూ ఆమె ఇందులో వివరించింది.

  భర్తతో టాలీవుడ్ హీరోయిన్ లిప్‌లాక్: ఆ ఫొటోను షేర్ చేసిన కాజల్.. పర్సనల్ పిక్ లీక్ చేయడంతో రచ్చ

   దయచేసి అలా చేయండి అంటూ

  దయచేసి అలా చేయండి అంటూ

  షణ్ముఖ్ జస్వంత్‌కు బ్రేకప్ చెబుతున్నట్లు తెలిపిన తర్వాత దీప్తి సునైనా ఓ రిక్వెస్ట్ కూడా చేసింది. 'నన్ను ఇష్టపడే వాళ్లందరితో అంతే ఇష్టంగా ఉంటాను. ఈ క్లిష్ట సమయంలో మా ఇద్దరికీ మీరు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము దూరం అవుతున్న సమయంలో మాకు ప్రైవసీ కావాలి. దీనికి మీరు సహకరించాలని అభ్యర్ధిస్తున్నా' అంటూ రాసుకొచ్చింది.

  English summary
  Bigg Boss 5th Season Completed Successfully. Shanmukh Jaswanth Romance Highlighted in This Season. Now Deepthi Sunaina announce breakup with Shanmukh.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X