Deepthi Shanmukh Breakup: బ్రేకప్‌కు కారణం చెప్పిన దీప్తి సునైనా.. బాధను తట్టుకోలేక ఏడుస్తూ!
తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా చర్చనీయాంశం అవుతోన్న అంశాల్లో సోషల్ మీడియా సెన్సేషన్స్ దీప్తి సునైనా.. షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్ ఒకటి. దాదాపు ఐదేళ్లుగా ప్రేమాయణం సాగిస్తోన్న ఈ జంట ఇటీవలే విడిపోతున్నట్లు ప్రకటించింది. దీంతో అసలు వీళ్ల మధ్య ఏం జరిగింది? ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? అంటూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా దీప్తి సునైనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లైవ్ నిర్వహించింది. దీంతో అందరూ బ్రేకప్ గురించే ఆమెను ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో అసలు ఈ నిర్ణయం వెనుక కారణాలను వివరిస్తూ దీప్తి ఎమోషనల్ అయిపోయింది. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

అలా కలిశారు.. ప్రేమలో పడ్డారు
సోషల్ మీడియాలో పలు రకాల యాప్‌లలో, యూట్యూబ్‌లో వీడియోలు చేసుకుంటూ ఫేమస్ అయ్యారు దీప్తీ సునయన.. షణ్ముఖ్ జస్వంత్. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ కలిసి డ్యాన్స్ వీడియోలు చేశారు. వాటికి నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. కొన్నింటిలో దీప్తీని లీడ్‌గా పెట్టి.. అతడు వెనకుండి వాటిని నడిపించాడు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించింది.

బిగ్ బాస్ షోతో మారిపోయిందిగా
ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి షణ్ముఖ్ జస్వంత్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అందులో అతడు సిరి హన్మంత్‌తో ఎప్పుడూ కలిసే ఉండడం.. కలిసే ఆడడం.. కలిసే తినడం.. కలిసే పడుకోవడం వంటివి చేశాడు. అంతేకాదు, తరచూ ముద్దులు.. హగ్గులు చేసుకోవడం వంటి వాటితో రెచ్చిపోయాడు. దీంతో అతడిపై విమర్శలు రావడంతో పాటు ఫినాలేలో ఓడిపోయాడు.

ప్రేమికుల మధ్య పెరిగిన గ్యాప్
బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో సిరి హన్మంత్‌తో రొమాన్స్ చేయడం వల్ల షణ్ముఖ్ జస్వంత్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. అంతేకాదు, అతడిపై ప్రియురాలు దీప్తి సునైనా కూడా కోపంగా ఉందని ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే షన్నూ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి నిజమేనని చెప్పాడు. కానీ, తాను మాత్రం ఆమెను వదిలిపెట్టనంతూ చెప్పుకొచ్చాడు.

షన్నూకు బ్రేకప్ చెప్పేసిన దీప్తి
ఎన్నో అనుమానాలు వస్తోన్న నేపథ్యంలో ఇటీవలే దీప్తి సునైనా సోషల్ మీడియా వేదికగా షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్పేసింది. ఈ మేరకు ఓ సుదీర్ఘమైన పోస్టును కూడా చేసింది. 'చాలా ఆలోచనలు, చర్చల తర్వాత షన్నూ, నేనూ పరస్పరంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై ఇద్దరం వేరే వేరే దారుల్లో నడవబోతున్నాం' అంటూ న్యూ ఇయర్ రోజునే భారీ షాక్ ఇచ్చేసింది.

గౌరవిస్తున్నానని చెప్పిన షన్నూ
దీప్తి సునైనా బ్రేకప్ గురించి ప్రకటించిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ కూడా స్పందించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. తనకు ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు ఉంది. ఆల్ ది బెస్ట్ దీపు.. నీకంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను' అంటూ పోస్ట్ చేశాడు. దీంతో వీళ్ల బంధం ముగిసిపోయిందని ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.

లైవ్‌కి వచ్చి చెప్పిన దీప్తి సునైనా
దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ విడిపోయిన తర్వాత అసలు వీళ్లు ఎందుకు ఇలా నిర్ణయించుకున్నారని అందరిలో అనుమానాలు వచ్చాయి. అంతేకాదు, ఎన్నో సరికొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీప్తి సునైనా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లైవ్ నిర్వహించింది. దీంతో అందరూ బ్రేకప్ గురించే ప్రశ్నించడం మొదలు పెట్టడంతో ఆమె ఎమోషనల్ అయింది.
Recommended Video

అందుకే ఈ నిర్ణయం అని క్లారిటీ
ఫ్యాన్స్ పదే పదే బ్రేకప్ గురించి ప్రశ్నించడంతో దీప్తి సునైనా 'నా లైఫ్‌లో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. ఇన్నేళ్లలో నా లైఫ్ గురించి, కెరీర్ గురించి ఏనాడూ ఆలోచించలేదు. ఇప్పుడు వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. ఇకపై నా గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను' అంటూ ఏడుస్తూ లైవ్‌ను మధ్యలోనే ముగించేసింది.


Click it and Unblock the Notifications











